Pushpa 2 Rights: పుష్ప 2 నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులకు కళ్లు చెదిరే ధర! రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ మూవీ-pushpa 2 the rule movie north indian north indian theatrical rights bagged by aa films for record price ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Rights: పుష్ప 2 నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులకు కళ్లు చెదిరే ధర! రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ మూవీ

Pushpa 2 Rights: పుష్ప 2 నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులకు కళ్లు చెదిరే ధర! రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ మూవీ

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 17, 2024 10:06 PM IST

Pushpa 2 North Indian Rights: పుష్ప 2 సినిమా ఉత్తరాది థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయిలో భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం బయటికి వచ్చింది. జవాన్ మూవీ కంటే ఎక్కువ థియేట్రికల్ బిజినెస్‍ను ఈ చిత్రం చేసిందని తెలుస్తోంది.

Pushpa 2 Rights: పుష్ప 2 నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులకు కళ్లు చెదిరే ధర! రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ మూవీ
Pushpa 2 Rights: పుష్ప 2 నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులకు కళ్లు చెదిరే ధర! రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ మూవీ

Pushpa 2 North Indian Rights: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమాపై ఆకాశమంత క్రేజ్ ఉంది. తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ చాలా నిరీక్షిస్తున్నారు. 2021లో వచ్చిన ‘పుష్ప1: ది రైజ్’ సినిమా దేశాన్ని ఊపేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. ముఖ్యంగా తెలుగుకు మించి హిందీలో ఉత్తర భారతంలో ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. అల్లు అర్జున్ యాక్షన్, స్వాగ్, మేనరిజమ్స్ హిందీ జనాలకు చాలా నచ్చేశాయి. దీంతో ఆ మూవీ సీక్వెల్ ‘పుష్ప 2’ సినిమాపై భారీ హైప్ ఉంది. ఈ క్రమంలో ఆ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం బయటికి వచ్చింది.

రికార్డు ధరకు..

పుష్ప 2: ది రూల్ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తందానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ రైట్స్ కోసం ఏకంగా రూ.200 కోట్లను అనిల్ తందానీ చెల్లించారని తెలుస్తోంది.

రికార్డులు బద్దలు!

పుష్ప 2 సినిమా హిందీ నార్త్ ఇండియన్ హక్కులను రూ.200 కోట్లకు అనిల్ తందానీ దక్కించుకోవడంతో ఈ చిత్రం రికార్డును సృష్టించింది. నార్త్ ఇండియాలో ఓ చిత్రానికి ఇదే అత్యంత పెద్ద డీల్‍గా ఉంది. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ మూవీ 'జవాన్‍' నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ సుమారు రూ.150 కోట్లకు అమ్ముడయ్యాయి. అయితే, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఆ మార్కును రూ.50 కోట్ల తేడాతో బీట్ చేసేసింది.

దీంతో, పుష్ప 2 చిత్రంతో నార్త్ ఇండియా థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్‍లో అల్లు అర్జున్.. కొత్త రికార్డును క్రియేట్ చేశారు. బాలీవుడ్ చిత్రాలన్నింటినీ మించి ఈ చిత్రం బిజినెస్ చేయడం విశేషంగా ఉంది.

రూ.200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగటంతో నార్త్ ఇండియాలోనే రూ.400 కోట్ల నెట్ కలెక్షన్లను పుష్ప 2 చిత్రం రాబడితేనే బయ్యర్లు సేఫ్ అవుతారు. అయితే, ఈ మూవీకి ఉత్తరాదిలో ఉన్న క్రేజ్ చూస్తే ఆ వసూళ్లు అలవోకగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డులను బద్దలుకొట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి.

సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2: ది రూల్ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. తెలుగు, హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది.

టీజర్‌కు సూపర్ రెస్పాన్స్

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న పుష్ప 2 సినిమా టీజర్ రిలీజ్ అయింది. అమ్మవారి అవతారంలో అల్లు అర్జున్ ఈ టీజర్‌లో అదరగొట్టారు. పుష్ప మార్క్ స్టైల్, స్వాగ్‍తో వారెవా అనిపించారు. ఈ టీజర్‌కు దేశవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అల్లు అర్జున్‍కు జోడీగా ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, జగదీష్ ప్రతాప్ బండారీ, ప్రకాశ్ రాజ్, అనసూయ కీరోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

IPL_Entry_Point