Pushpa 2 Box Office: పుష్ప 2 మూవీకి రూ.1000 కోట్లు పక్కా.. ఓపెనింగ్స్ ఎంత ఉంటాయో తెలుసా?-pushpa 2 box office prediction industry experts predict 1000 crores for allu arjun sukumar rashmika mandanna movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Box Office: పుష్ప 2 మూవీకి రూ.1000 కోట్లు పక్కా.. ఓపెనింగ్స్ ఎంత ఉంటాయో తెలుసా?

Pushpa 2 Box Office: పుష్ప 2 మూవీకి రూ.1000 కోట్లు పక్కా.. ఓపెనింగ్స్ ఎంత ఉంటాయో తెలుసా?

Hari Prasad S HT Telugu
Apr 09, 2024 10:52 AM IST

Pushpa 2 Box Office: అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 మూవీకి రూ.1000 కోట్లు పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేయడం విశేషం. ఈ సినిమా టీజర్ సోమవారమే (ఏప్రిల్ 8) రిలీజైన విషయం తెలిసిందే.

పుష్ప 2 మూవీకి రూ.1000 కోట్లు పక్కా.. ఓపెనింగ్స్ ఎంత ఉంటాయో తెలుసా?
పుష్ప 2 మూవీకి రూ.1000 కోట్లు పక్కా.. ఓపెనింగ్స్ ఎంత ఉంటాయో తెలుసా?

Pushpa 2 Box Office: ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో ఒకటి పుష్ప: ది రూల్. అల్లు అర్జున్ నటించిన ఈ సీక్వెల్ మూవీ టీజర్ అతని బర్త్ డే సందర్భంగా సోమవారం (ఏప్రిల్ 8) రిలీజ్ కాగా.. తొలి 24 గంటల్లోనే 4 కోట్లకుపైగా రికార్డు వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో లైఫ్ టైమ్ కలెక్షన్లు రూ.1000 కోట్లకుపైనే ఉంటాయని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

పుష్ప 2 ఓపెనింగ్స్

టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతుందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో కేవలం హిందీలోనే రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల ఓపెనింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు. ఇక అన్ని భాషల్లో కలిపి తొలి రోజే రూ.100 కోట్లకుపైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

అంతేకాదు పుష్ప: ది రూల్ మూవీ హిట్ తర్వాత అల్లు అర్జున్ ఇండియాలో అతిపెద్ద స్టార్ గా అవతరిస్తాడని కూడా ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ రమేష్ బాలా అన్నాడు. పుష్ప 1లాగే కంటెంట్ బాగుంటే పుష్ప 2 సులువుగా రూ.100 కోట్ల ఓపెనింగ్ సాధిస్తుందని, మొత్తంగా రూ.1000 కోట్లు పక్కా అని అతడు స్పష్టం చేశాడు. పుష్ప హిట్ అయిన నేపథ్యంలో ఈ సీక్వెల్ బడ్జెట్ కూడా భారీగా పెంచేశారు.

ఇక మరో ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ అజయ్ రాఠీ మాట్లాడుతూ.. ప్రస్తుతం పుష్ప 2కి ఉన్న హైప్ నేపథ్యంలో కేవలం హిందీలోనే ఈ సినిమాకు రూ.40 నుంచి రూ.50 కోట్ల ఓపెనింగ్ వస్తుందని అన్నాడు. 2021లో వచ్చిన పుష్ప మూవీ సీక్వెల్ కోసం రెండున్నరేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. తెలుగు కంటే హిందీ బెల్ట్ లోనే ఈ సినిమా హిట్ అవడంతో సీక్వెల్ కు కూడా అక్కడే ఎక్కువ ఆదరణ వస్తుందన్న అంచనా ఉంది.

పుష్ప 2 టీజర్

ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 మేకర్స్ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మొదట్లో ఇందులో బన్నీ స్టైల్, కాళీ మాత రూపంలో అతని లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే ఇది టీజర్ లా కాదు.. గ్లింప్స్ లా ఉందని తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. టీజరో, గ్లింప్సోగానీ ఈ షార్ట్ వీడియో మాత్రం పుష్ప 2 ఏ రేంజ్ లో ఉండబోతోందో కళ్లకు కట్టింది.

పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు అజయ్ దేవగన్ సింగం అగైన్ సినిమా నుంచి పోటీ ఉంది. ఆ సినిమా కూడా అదే రోజు రిలీజ్ కాబోతోంది. అదే జరిగితే హిందీలో పుష్ప: ది రూల్ వసూళ్లు కాస్త తగ్గే అవకాశం ఉంది. పుష్ప మూవీ సుమారు రూ.400 కోట్ల వరకూ వసూలు చేసింది. వీటిలో హిందీ బెల్ట్ నుంచి వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి.

IPL_Entry_Point