Yodha OTT: ఎట్టకేలకు ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్.. కానీ, అదొక్కటే మైనస్.. ఎక్కడ చూడాలంటే?-bollywood action thriller yodha ott streaming free on amazon prime yodha ott release sidharth malhotra disha patani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yodha Ott: ఎట్టకేలకు ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్.. కానీ, అదొక్కటే మైనస్.. ఎక్కడ చూడాలంటే?

Yodha OTT: ఎట్టకేలకు ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్.. కానీ, అదొక్కటే మైనస్.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
May 11, 2024 09:55 AM IST

Yodha OTT Streaming Free: రాశీ ఖన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ నటించిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ యోధా మూవీ ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. మొన్నటివరకు రెంటల్ విధానంలో ప్రసారమైన యోధా సినిమా ఎట్టకేలకు ఫ్రీ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చింది.

ఎట్టకేలకు ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్.. కానీ, అదొక్కటే మైనస్.. ఎక్కడ చూడాలంటే?
ఎట్టకేలకు ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్.. కానీ, అదొక్కటే మైనస్.. ఎక్కడ చూడాలంటే?

Yodha OTT Release: బాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) సమర్పణలో కొత్త డైరెక్టర్స్ సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ యోధ. ఈ సినిమాతో సాంగర్ అంబ్రే-పుష్కర్ ఓజా దర్శక ద్వయం హిందీ పరిశ్రమకు పరిచయం అయింది.

బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), టాలీవుడ్ బ్యూటి రాశీ ఖన్నా (Raashi Khanna), హిందీ హాట్ భామ దిశా పటానీ (Disha Patani) ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలో విడుదలైంది.

యాక్షన్ చిత్రంగా వచ్చిన యోధకు మిశ్రమ స్పందన లభించింది. మూవీలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయినప్పటికీ ప్లాట్ చాలా రొటీన్‌గా ఉందని కామెంట్స్ వినిపించాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది యోధ సినిమా. రూ. 55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన యోధ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 53 కోట్ల వరకే కలెక్షన్స్ రాబట్టగలిగింది. అంటే చిత్ర నిర్మాతలకు రూ. 2 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్నో అంచనాలో బాలీవుడ్ బాక్సాఫీస్ బరిలోకి దిగిన యోధ సినిమా అక్కడ నిరాశపరచడంతో ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో (Amazon Prime OTT) యోధ చిత్రాన్ని ఏప్రిల్ 26 నుంచి డిజిటల్ ప్రీమియర్ చేశారు. కానీ, అది రెంటల్ విధానంలో సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫ్రీగా కాకుండా రూ. 349 చార్జీ చెల్లించి సినిమాను ఆస్వాదించేలా ఏర్పాటు చేశారు సదరు ఓటీటీ సంస్థ నిర్వాహకులు.

రూ.349 అద్దె రుసుము చెల్లిస్తే ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్లకు యోధ చిత్రాన్ని చూసేందుకు 30 రోజుల గడువు ఉంటుంది. ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా సినిమాను చూసుకునే వెసులు బాటు కల్పించారు. అయితే, తాజాగా ఎలాంటి రుసుము చెల్లించకుండా యోధా సినిమాను ఉచితంగా వీక్షించేలా వెసులుబాటు కల్పించింది అమెజాన్ ప్రైమ్.

మే 15 నుంచి ఈ సినిమాను (Yodha OTT Streaming Free) ఫ్రీగా ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వచ్చింది. కానీ, ఆ తేది కంటే ముందుగానే ఓటీటీలో యోధను ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం యోధ మూవీ కేవలం హిందీ భాషలోనే ప్రసారం అవుతోంది. తెలుగులో చూడాలనుకునే ప్రేక్షకులకు మాత్రం ఇది నిరాశపడాల్సిన విషయమే. ఫ్రీగా స్ట్రీమింగ్ వెసులుబాటు కల్పించినప్పటికీ హిందీలోనే రావడం ఒక్కటి మైనస్ అని చెప్పుకోవచ్చు.

అయితే, భాషతో సంబంధం లేకుండా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఎంజాయ్ చేయాలనుకునేవారు మాత్రం ఆనందంగా వీక్షించొచ్చు. కాగా ఈ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో దిశా పటానీ (Disha Patani Hot) విలన్ రోల్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు హీరోయిన్‌గా గ్లామర్ ట్రీట్ అందించిన దిశా ఇందులో హాట్ ట్రీట్‌తో పాటు యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టిందని తెలుస్తోంది.

ఈ చిత్రం యోధ టాస్క్ ఫోర్స్ కమాండింగ్ ఆఫీసర్ అరుణ్ కాత్యల్ థ్రిల్లింగ్ రెస్క్యూ ఆపరేషన్‌ కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని హిరూ యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ నిర్మించారు.

IPL_Entry_Point