Sidharth on Wedding Rumors: నా పెళ్లికి నాకు ఆహ్వానం అందలేదే.. ఎవ్వరూ నన్ను పిలవలేదు.. సిద్ధార్థ్ మల్హోత్రా కౌంటర్-bollywood hero sidharth malhotra clarity on wedding rumors with kiara advani
Telugu News  /  Entertainment  /  Bollywood Hero Sidharth Malhotra Clarity On Wedding Rumors With Kiara Advani
సిద్ధార్థఅ మల్హోత్రా-కియారా అద్వానీ
సిద్ధార్థఅ మల్హోత్రా-కియారా అద్వానీ

Sidharth on Wedding Rumors: నా పెళ్లికి నాకు ఆహ్వానం అందలేదే.. ఎవ్వరూ నన్ను పిలవలేదు.. సిద్ధార్థ్ మల్హోత్రా కౌంటర్

13 January 2023, 13:53 ISTMaragani Govardhan
13 January 2023, 13:53 IST

Sidharth on Wedding Rumors: బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై క్లారిటీనిచ్చారు. కియారా అద్వానీతో తను వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్న వార్తలపై స్పందించాడు. ఆ పెళ్లికి తనకు ఆహ్వానం అందలేదని కౌంటర్ వేశాడు.

Sidharth on Wedding Rumors: బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ త్వరలో పెళ్లి చేసుకుబోతున్నారనే వార్త గత కొన్ని రోజులుగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియా ఊహాగానాలు వచ్చాయి. అంతేకాకుండా ఫిబ్రవరిలో వీరు వివాహం చేసుకుబోతున్నానరని డేట్లతో సహా సమాచారం బయటకుపొక్కింది. దీంతో వీరిద్దరూ నిజంగానే ఒక్కటవుతున్నారని అందరూ భావించారు. ఈ అంశంపై సదరు హీరో, హీరోయిన్లు కూడా స్పందించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా ఈ అంశంపై సిద్ధార్థ్ మల్హోత్రా స్పందించాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ తన పెళ్లి రూమర్లపై స్పష్టత ఇచ్చాడు. పెళ్లి గురించి వచ్చే వార్తల గురించి అతడిని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానమిచ్చాడు. "నా పెళ్లికి నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఎవ్వరూ నన్ను పిలవలేదు. ఫిబ్రవరిలో పెళ్లి జరగబోతుందని రాశారు. నేను రెండు, మూడు సార్లు తేదీలను చెక్ చేసుకున్నాను. కానీ నన్ను ఎవరు పిలవలేదు. ఆ తర్వాత అనిపించింది నిజంగానే నేను పెళ్లిచేసుకోబోతున్నానా? నాకైతే ఎలాంటి క్లూ లేదు" అని సిద్ధార్థ్ కౌంటర్ వేశాడు.

ఇలాంటి రూమర్లు ఎలా వస్తున్నాయో తనకు అర్థం కావట్లేదని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన ఫోకస్ కెరీర్‌పైనే ఉందని స్పష్టం చేశాడు.

"ఇలాంటి గాసిప్స్‌ను చదివినిప్పుడు వారు ముందు నా సినిమాల గురించి రాస్తే బాగుంటుంది కదాని అనిపిస్తుంది. అదే చాలా ముఖ్యమని నేను అనుకుంటాను. వాళ్లు నా వ్యక్తిగత జీవితం గురించి రాయకపోతేనే నేను బాగుంటాను. కానీ వాళ్లు నా సినిమాల గురించి మాత్రం రాయకపోతే నిజంగా చాలా బాధపడతాను. కాబట్టి ఎంతకామైతే వారు నా సినిమాల గురించి రాస్తారో అంతవరకు బాగానే ఉంటుంది" అని సిద్ధార్థ్ మల్హోత్రా అన్నాడు.

సిద్ధార్థ్-కియారా పెళ్లిచేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియా ఇటీవల కోడై కూసింది. అంతేకాకుండా వారి పెళ్లి తేదీలను కూడా బహిర్గత పరిచింది.ఫిబ్రవరి 4, 5 తేదీల్లో హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి కార్యక్రమాలు ఉంటాయని, ఫిబ్రవరి 6న వివాహం జరగబోతుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజస్థాన్‌లోని జైసల్మీర్ ప్యాలెస్‌ హోటెల్‌లో వీరి పెళ్లి జరగబోతున్నట్లు తెలిపింది. ఈ వేడుకకు ముఖ్యమైన బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారని తెలిపింది.

సంబంధిత కథనం