Sidharth Malhotra Kiara Advani Wedding: పెళ్లి పీట‌లెక్క‌నున్న సిద్ధార్థ్‌, కియారా - మ్యారేజ్ డేట్ ఇదేనా-sidharth malhotra kiara advani to tie knot in february 2023 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sidharth Malhotra Kiara Advani Wedding: పెళ్లి పీట‌లెక్క‌నున్న సిద్ధార్థ్‌, కియారా - మ్యారేజ్ డేట్ ఇదేనా

Sidharth Malhotra Kiara Advani Wedding: పెళ్లి పీట‌లెక్క‌నున్న సిద్ధార్థ్‌, కియారా - మ్యారేజ్ డేట్ ఇదేనా

Nelki Naresh Kumar HT Telugu
Dec 31, 2022 10:28 AM IST

Sidharth Malhotra Kiara Advani Wedding: బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అద్వాణీ పెళ్లిపీట‌లెక్క‌బోతున్న‌ట్లు బాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరి పెళ్లి ఎప్పుడు, ఎక్క‌డ జ‌రుగ‌నుందంటే...

సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అద్వాణీ
సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అద్వాణీ

Sidharth Malhotra Kiara Advani Wedding: బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అద్వానీ త‌మ బంధాన్ని మ‌రో అడుగు ముందుకు తీసుకెళ్ల‌బోతున్న‌ట్లు తెలిసింది. 2023 ఫిబ్ర‌వ‌రిలో వీరు పెళ్లిపీట‌లెక్క‌నున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. షేర్షా సినిమాలో సిద్ధార్థ్‌, కియారా ఫ‌స్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఈ సినిమా షూటింగ్‌లోనే వీరి మ‌ధ్య ప‌రిచ‌యం ప్రేమ‌కు దారితీసిన‌ట్లు తెలిసింది. ప‌లు ఈవెంట్స్‌లో సిద్ధార్థ్‌, కియారా స‌న్నిహితంగా క‌నిపించ‌డం, క‌లిసి విహార‌యాత్ర‌ల‌కు వెళ్లిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో ప‌లు మార్లు చ‌క్క‌ర్లు కొట్టాయి. సిద్ధార్థ్‌, కియారా ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా క‌ర‌ణ్‌జోహార్‌, అక్ష‌య్‌కుమార్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు. వారి మ‌ధ్య స్నేహానికి మించిన బంధం ఉంద‌ని వెల్ల‌డించారు.

ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనున్న‌ట్లు కియారా పేర్కొన్న‌ది. సిద్ధార్థ్‌తో పెళ్లిని ఉద్దేశించే కియారా ఈ కామెంట్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

కాగా ఈ ప్రేమ ప‌క్షులు ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి 4 నుంచి 6 వ‌ర‌కు సిధ్‌, కియారా పెళ్లి వేడుక జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్ ఫోర్ట్‌ను పెళ్లి వేదిక‌గా ఖ‌రారు చేసిన‌ట్లు చెబుతున్నారు. కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల‌తో పాటు కొద్ది మంది బాలీవుడ్ ప్ర‌ముఖులు సిధ్‌, కియారా పెళ్లికి హాజ‌రుకాబోతున్న‌ట్లు తెలిసింది.

జ‌న‌వ‌రిలో త‌మ పెళ్లి గురించి అఫీషియ‌ల్‌గా సిద్ధార్థ్‌, కియారా ప్ర‌క‌టించే చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం తెలుగులో రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

టాపిక్