OTT Releases: ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 14 సినిమాలు.. 2 చిత్రాలు, 2 వెబ్ సిరీసులు మాత్రమే స్పెషల్.. ఎక్కడ చూడాలంటే?
Friday OTT Movies Releases: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని ఏకంగా 14 స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం ఓటీటీలోకి దాదాపుగా 21కిపైగా సినిమాలు విడుదల అవుతుండగా ఏప్రిల్ 10న 14 సినిమాలు ఉన్నాయి. మరి వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూద్దాం.
Today OTT Releases: ప్రతి వారం ఓటీటీలో సరికొత్త కంటెంట్ సినిమాలు వెబ్ సిరీసులు సందడి చేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే వాటిలో ఎక్కువ శాతం శుక్రవారం రోజున స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలాగే ఫ్రైడే రోజు రిలీజ్ అయ్యే సినిమాల్లో స్పెషల్ చిత్రాలు అధికంగా ఉంటాయి. ఇక ఈ వారం ఓటీటీల్లోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని 21కిపైగా స్ట్రీమింగ్‌కు వచ్చాయి.
వాటిలో ఇవాళ ఒక్కరోజే అంటే మే 10న ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, జోనర్స్, స్పెషాలిటీస్ ఏంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 10
బ్లడ్ ఆఫ్ జీసస్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- మే 10
కుకింగ్ ఆప్ మర్డర్: అన్‌కవరింగ్ ది స్టోరీ ఆఫ్ సీజర్ రోమన్ (డాక్యుమెంట్ సిరీస్)- మే 10
ది అల్టిమేటమ్: సౌతాఫ్రికా (రియాలిటీ షో)- మే 10
జీ5 ఓటీటీ
8 ఏఎమ్ మెట్రో (హిందీ చిత్రం)- మే10
పాష్ బాలిష్ (బెంగాలీ వెబ్ సిరీస్)- మే 10
జియో సినిమా ఓటీటీ
మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ వెబ్ సిరీస్)- మే 10 స్ట్రీమింగ్
ప్రెట్టీ లిటిల్ లయర్స్: సమ్మర్ స్కూల్ - మే 10
రోమియో (తమిళ సినిమా)- ఆహా తమిళ్- మే 10 స్ట్రీమింగ్
అన్‌దేకి సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- మే 10 స్ట్రీమింగ్
ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే- మే 10 స్ట్రీమింగ్
ఫ్యూచర్ పొండాటి (తమిళ వెబ్ సిరీస్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 10 స్ట్రీమింగ్
బయోస్పియర్- హుళు ఓటీటీ- మే 10 స్ట్రీమింగ్
చాల్చిత్ర ఏఖాన్- హోయ్‌చోయ్ ఓటీటీ- మే 10 స్ట్రీమింగ్
ఇలా ఇవాళ ఒక్కరోజు స్ట్రీమింగ్‌కు వచ్చిన 14 సినిమాలు, వెబ్ సిరీసుల్లో 8ఏఎమ్ మెట్రో స్పెషల్‌గా ఉండనుంది. ఈ సినిమాను మల్లేశం సినిమా డైరెక్టర్ రాజ్ రాచకొండ తెరకెక్కించారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన అందమైన జీవితం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్ ప్రధాన పాత్రలో పోషించారు. టాలీవుడ్ నటి కల్పిక గణేష్ మరో పాత్రలో నటించారు.
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ తొలిసారిగా నటించిన రొమాంటిక్ సినిమా రోమియో. ఈ సినిమా తమిళంలో ఆహా తమిళ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా ఇవాళే ఓటీటీలోకి రానుంది. కానీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటనేది క్లారిటీ లేదు. ఈ సినిమా కూడా స్పెషల్‌గా ఉండనుంది.
ఈ రెండు సినిమాలతోపాటు మర్డర్ ఇన్ మహిమ్, అన్‌దేకి సీజన్ 3 వెబ్ సిరీసులు కూడా స్పెషల్‌గా నిలవనున్నాయి. ఇదిలా ఉంటే ఈవారం ఇవే కాకుండా అనేక తెలుగు, డిఫరెంట్ కంటెంట్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ ఆవేశం సినిమా అమెజాన్ ప్రైమ్‌లో మలయాళ భాషలో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు తెలుగులో హారర్ కామెడీ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది ఆహాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
టాపిక్