Geethanjali Malli Vachindi: నవ్విస్తూ భయపెడుతున్న హారర్ మూవీ.. గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్
Geethanjali Malli Vachindi Teaser Out: హారర్ కామెడీగా వచ్చిన గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేశారు. ఈ టీజర్‌ను బేగంపేట్ శ్మశానవాటికలో లాంచ్ చేస్తున్నట్లు ఇదివరకు మూవీ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Geethanjali Malli Vachindi Teaser: హారర్ కామెడీ జోనర్‌లో హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రధారిగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ గీతాంజలి. 2014లో వచ్చిన ఈ సినిమాను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్‌లో గీతాంజలి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ గీతాంజలి సీక్వెల్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కించారు.
ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్ గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రాన్ని ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అచ్చ తెలుగు అమ్మాయి అంజలి నటిస్తోన్న 50వ సినిమా ఇది కావడం విశేషం. ఇటీవల శనివారం (ఫిబ్రవరి 24) బేగంపేట శ్మశానవాటికలో గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ఆద్యంతం నవ్విస్తూ భయపెట్టింది.
సినిమా షూటింగ్‌కు కోసం వెళ్లిన ఓ డ్యాన్స్ మాస్టర్ భవనంలో జరిగిన సంఘటనలతో గీతాంజలి మళ్లీ వచ్చింది తెరకెక్కినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. సినిమాలో కామెడీకి ఎలాంటి లోటు లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీజర్ చివర్లో దెయ్యాన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుని ఎలా ఏడవాలో సత్య చెప్పే సీన్ హైలెట్ అయింది. ఇక ఆర్టిస్ట్ మేకోవర్, యాక్టింగ్ భయపడే విధంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. అయితే, టీజర్‌లో కాస్తా చంద్రముఖి చాయలు కనిపిస్తున్నాయి.
హారర్ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో హ్యూజ్ రేంజ్ మూవీగా గీతాంజలి మళ్లీ వచ్చిందిని మేకర్స్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 22న రిలీజ్ చేస్తున్నారు. గీతాంజలి సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
అలాగే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రాహుల్ మాధవ్‌ను టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు మేకర్స్. వీళ్లతో పాటు ముక్కు అవినాష్, విరూపాక్ష రవి కూడా పలు పాత్రలో మెరవనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన హారర్ కామెడీ చిత్రాలన్నీ ఒక ఎత్తైతే గీతాంజలి మళ్లీ వచ్చిందిలో హారర్ కామెడీ వాటన్నింటినీ మించేలా ఉంటుందని మేకర్స్ టీజర్‌లో తెలిపారు. హైదరాబాద్, ఊటీల్లో ఈ సినిమా కథాంశం సాగుతుంది.