Aha OTT Indian Idol 3: ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ 3 మెగా ఆడిషన్స్.. పోటీలో 5 వేల మంది సింగర్స్-aha ott telugu indian idol season 3 mega auditions at hyderabad and usa telugu indian idol season 3 contestants ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Ott Indian Idol 3: ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ 3 మెగా ఆడిషన్స్.. పోటీలో 5 వేల మంది సింగర్స్

Aha OTT Indian Idol 3: ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ 3 మెగా ఆడిషన్స్.. పోటీలో 5 వేల మంది సింగర్స్

Sanjiv Kumar HT Telugu
May 09, 2024 08:14 AM IST

Telugu Indian Idol 3 Mega Auditions: ఆహా ఓటీటీలో త్వరలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలుగు ఇండియన్ ఐడల్ 3 మెగా ఆడిషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5 వేల మంది గాయనీ గాయకులు పోటీ పడ్డారు.

ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ 3 మెగా ఆడిషన్స్.. పోటీలో 5 వేల మంది సింగర్స్
ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ 3 మెగా ఆడిషన్స్.. పోటీలో 5 వేల మంది సింగర్స్

Aha OTT Telugu Indian Idol 3: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో మూడో సీజన్ కోసం ఏర్పాటు చేసిన వేదిక పుల‌కించింది. ప్ర‌ద‌ర్శ‌న‌లోని స్పాట్ లైట్ మ‌రింత ప్ర‌కాశవంతంగా మారింది.

yearly horoscope entry point

ఆహా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 కోసం ఎదురు చూస్తోన్న ప్ర‌యాణం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ ప్రారంభ‌మైన శ‌క్తివంత‌మైన త‌రంగాలు హైద‌రాబాద్‌, యూఎస్ఏల‌లో ప్ర‌భావాన్ని చూపాయి. ఎన్న‌డూ లేనివిధంగా అమెరికాలోని న్యూజెర్సీలో మే 4న సీజ‌న్ 3కి సంబంధించిన ఆడిష‌న్స్ జ‌రిగాయి. అలాగే మే 5న హైద‌రాబాద్‌లో ఆడిష‌న్స్ జ‌రిగాయి. వీటికి అత్య‌ద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2కు వ‌చ్చిన అపూర్వ‌మైన స్పంద‌న‌ను ఆధారంగా చేసుకుని మూడో సీజ‌న్‌ను మ‌రింత ఉన్నతంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ మూడో సీజ‌న్ ప్రామాణికంగా మ‌రింత గొప్ప‌గా ఉంటుంద‌ని ఆహా ప్రేక్ష‌కుల‌కు వాగ్దానం చేస్తోంది. అందుకు ఉదాహ‌రణ రీసెంట్‌గా జ‌రిగిన ఆడిష‌న్స్‌.

ఈ ఆడిషన్స్‌లో5000 మంది ఔత్సాహిక గాయ‌నీగాయ‌కులు పోటీ ప‌డ్డారు. ఫైన‌లిస్ట్స్‌గా నిలిచే టాప్ 12 కోసం వారు అత్యుత్త‌మమైన ప్ర‌తిభ‌ను చూపారు. సంగీతంలో అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌ప‌రిచిన సంగీత ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ థమన్, పాపులర్ సింగర్స్ గీతా మాధురి, కార్తీక్ ఈ సీజ‌న్ ఆడిష‌న్స్‌కు న్యాయ‌నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సీజ‌న్‌కు వ‌చ్చిన స్పంద‌న చూస్తుంటే తెలుగు సంగీతాభిమానుల్లో, ఔత్సాహిక గాయ‌నీ గాయ‌కుల్లో ఉన్న అసాధార‌ణ నైపుణ్యానికి నిద‌ర్శ‌నంగా తెలుస్తోంది.

ఎస్ఎస్ థమన్, గీతా మాధురి, కార్తీక్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వం ఔత్సాహిక గాయ‌నీగాయ‌కుల్లో చ‌క్క‌టి ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చి చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న చేసేలా చేశాయి. సంగీత ప్ర‌పంచానికి త‌మ‌లోని ప్ర‌తిభ‌ను ఆవిష్క‌రించ‌టానికి, వారి క‌ల‌ల‌ను సాకారం చేసుకోవ‌టానికి ఆహా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ రూపంలో చ‌క్క‌టి వేదిక దొరికింది. గాయ‌నీగాయ‌కుల్లో ఉన్న అసాధార‌ణ‌మైన ప్ర‌తిభ‌ను వెలికి తీయ‌టానికి ఇండియ‌న్ ఐడ‌ల్ చ‌క్క‌టి వేదికగా మారింది.

సంగీతంలో ఒక గొప్ప నైపుణ్యాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌ట‌మే కాకుండా తిరుగులేని వినోదాన్ని అందించ‌టానికి ఆహా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 3 స‌న్నద్ధ‌మ‌వుతోంది. అయితే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 కోసం మెగా ఆడిషన్స్ మొదటిసారి USAలో జరగడం విశేషం.

మే 4న న్యూజెర్సీలో TV9 USA స్టూడియోస్, 399 హూస్ లేన్ రెండో ఫ్లోర్ పిస్కాటవేలో ఆడిషన్స్ జరిగాయి. అలాగే మే 11న డల్లాస్‌లోని కాకతీయ లాంజ్ 4440 హెచ్.డబ్ల్యువై 121 టీవెసిల్, USA టెక్సాస్ విల్,లూయిస్ విల్లే #5లలో ఆడిషన్స్ జరగనున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ రెండు సీజన్స్‌కు సంగీత ప్రేమికులు, ప్రేక్షకుల నుంచే కాకుండా ఔత్సాహిక గాయకుల నుంచి చాలా గొప్ప స్పందన వచ్చింది.టెలివిజన్ రంగంలో ఈ కార్యక్రమం సరికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసింది.

దీంతో మూడో సీజన్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. దీన్ని అందుకునేలా ఉంటుందని ఆహా చెబుతోంది. అందుకు కారణం ఏకంగా 5 వేల మంది ఔత్సాహిక గాయకులు ఇందులో పాల్గొనబోతున్నారు. అందులో నుంచి 12 మంది మాత్రమే ఫైనల్ రౌండ్‌కు చేరుకుంటారు.

Whats_app_banner