Skanda Second song Promo: థమన్ మాస్ బీట్.. శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్: స్కంద రెండో సాంగ్ ప్రోమో రిలీజ్-gandarabhai song promo release from skanda movie sree leela dance moves are highlight ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Gandarabhai Song Promo Release From Skanda Movie Sree Leela Dance Moves Are Highlight

Skanda Second song Promo: థమన్ మాస్ బీట్.. శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్: స్కంద రెండో సాంగ్ ప్రోమో రిలీజ్

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 17, 2023 07:41 PM IST

Skanda Second Song Promo: ‘స్కంద’ సినిమా నుంచి రెండో పాట ప్రోమో రిలీజ్ అయింది. మాస్ బీట్‍తో ఫుల్ జోష్‍తో ఈ సాంగ్ ఉంది. ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్, టైమ్‍ను కూడా చిత్ర యూనిట్ వెల్లడించింది.

Skanda Second song Promo: థమన్ మాస్ బీట్.. శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్: స్కంద రెండో సాంగ్ ప్రోమో రిలీజ్
Skanda Second song Promo: థమన్ మాస్ బీట్.. శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్: స్కంద రెండో సాంగ్ ప్రోమో రిలీజ్

Skanda Second Song Promo: ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్‍ పోతినేని, యంగ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోహీరోయిన్లుగా 'స్కంద' చిత్రం వస్తోంది. మాస్ యాక్షన్ సినిమాలకు పాపులర్ అయిన డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్కంద కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. సెప్టెంబర్ 15వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో స్కంద చిత్రం నుంచి రెండో పాటను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ‘గండరబాయ్’ అనే ఈ పాటకు సంబంధించిన ప్రోమోను నేడు (ఆగస్టు 17) తీసుకొచ్చింది. పూర్తి లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్, టైమ్‍ను కూడా వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

“గండరబాయ్.. గండరబాయ్.. గందరగోళంలో పెట్టకమ్మాయ్” అంటూ ఈ పాట ఫుల్ మాస్ బీట్‍లో ఉంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్.. స్కంద చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ పాట ప్రోమోను చిత్ర యూనిట్ నేడు రిలీజ్ చేసింది. పూర్తి లిరికల్ సాంగ్ రేపు (ఆగస్టు 18) సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మిస్తున్న శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ ట్వీట్ చేసింది.

‘గండరబాయ్’ పాటకు థమన్ మాస్ బీట్ ఇచ్చారు. ఈ పాటను నకష్ అజీజ్, సౌజన్య భాగవతుల పాడారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఈ పాటలో హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్ అదిరిపోనుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. హీరో రామ్‍ పోతినేని కూడా డ్యాన్స్ ఇరగదీశారు. రేపు ఫుల్ లిరికల్ సాంగ్ రానుంది.

స్కంద సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే స్కంద నుంచి వచ్చిన తొలి పాట ‘నీ చుట్టు.. చుట్టు’కు మంచి రెస్పాన్సే వచ్చింది.

రామ్ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ మూవీ రూపొందుతోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.