Indian Idol 13 Winner: ఇండియ‌న్ ఐడ‌ల్ 13 విన్న‌ర్‌గా రిషి సింగ్ - విజేత‌కు ద‌క్కిన ప్రైజ్‌మ‌నీ ఎంతంటే-rishi singh wins indian idol 13 season title prize money details here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Indian Idol 13 Winner: ఇండియ‌న్ ఐడ‌ల్ 13 విన్న‌ర్‌గా రిషి సింగ్ - విజేత‌కు ద‌క్కిన ప్రైజ్‌మ‌నీ ఎంతంటే

Indian Idol 13 Winner: ఇండియ‌న్ ఐడ‌ల్ 13 విన్న‌ర్‌గా రిషి సింగ్ - విజేత‌కు ద‌క్కిన ప్రైజ్‌మ‌నీ ఎంతంటే

Nelki Naresh Kumar HT Telugu
Apr 03, 2023 11:10 AM IST

Indian Idol 13 Winner: ఇండియ‌న్ ఐడ‌ల్ 13వ సీజన్ విజేత‌గా అయోధ్య‌కు చెందిన రిషి సింగ్ నిలిచాడు. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్స్‌లో అత‌డు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

రిషి సింగ్
రిషి సింగ్

Indian Idol 13 Winner: ఇండియా టాప్ సింగింగ్‌షో ఇండియ‌న్ ఐడ‌ల్ 13 ఎడిష‌న్ విజేత ఎవ‌ర‌న్న‌ది రివీలైంది. అయోధ్య‌కు చెందిన రిషి సింగ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్స్‌లో రిషి సింగ్ విజేత‌గా నిల‌వ‌గా కోల్‌క‌తాకు చెందిన దోబోస్మిత‌రాయ్ ర‌న్న‌ర‌ప్‌గా స్థానాన్ని ద‌క్కించుకున్న‌ది.

జ‌మ్మూ క‌శ్మీర్‌కు చెందిన చిరాగ్ కొత్వాల్ సెకండ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. విజేత‌గా నిలిచిన రిషి సింగ్‌ ఇర‌వై ఐదు ల‌క్ష‌ల క్యాష్ ప్రైజ్‌తో పాటు కారును గిప్ట్‌గా సొంతం చేసుకున్నాడు.

ర‌న్న‌ర‌ప్స్‌గా నిలిచిన దోబోస్మిత‌రాయ్‌, చిరాగ్ త‌లో ఐదు ల‌క్ష‌ల క్యాష్ ప్రైజ్ ద‌క్కించుకున్నారు. నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచి చ‌క్ర‌వ‌ర్తి, శివ‌మ్ సింగ్‌ల‌కు త‌లో మూడుల‌క్ష‌లు ద‌క్కాయి.

ఓవ‌రాల్‌లో ఫైన‌ల్ రౌండ్‌కు రిషి సింగ్‌, దోబోస్మిత‌రాయ్‌, చిరాగ్‌, చ‌క్ర‌వ‌ర్తి, శివ‌మ్‌సింగ్‌ల‌తో సోనాక్షి క‌ర్ చేరుకున్నారు. ఒక్కో రౌండ్‌లో ఒక్కొక్క‌రు ఎలిమినేట్ కాగా చివ‌ర‌కు రిషిసింగ్‌, దోబోస్మిత‌రాయ్ ఫైన‌ల్ రౌండ్ పోటీలో నిలిచారు. ఈ రౌండ్‌లో రిషిసింగ్‌ను జ‌డ్జీలు విజేత‌గా ప్ర‌క‌టించారు. టైటిల్ విన్న‌ర్‌గా త‌న పేరును చూడాల‌నే క‌ల నెర‌వేర‌డం ఆనందంగా ఉంద‌ని రిషి సింగ్ చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్