Rathnam OTT: 2 ఓటీటీల్లో లేటెస్ట్ కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ రత్నం.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడెక్కంటే?-vishal rathnam ott streaming on amazon prime netflix rathnam ott release rathnam ott platform rathnam movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rathnam Ott: 2 ఓటీటీల్లో లేటెస్ట్ కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ రత్నం.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడెక్కంటే?

Rathnam OTT: 2 ఓటీటీల్లో లేటెస్ట్ కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ రత్నం.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడెక్కంటే?

Sanjiv Kumar HT Telugu
May 09, 2024 08:59 AM IST

Rathnam Movie OTT Streaming: విశాల్ నటించిన కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రత్నం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అది కూడా తమిళంతోపాటు తెలుగులోనూ మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో రత్నం ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

2 ఓటీటీల్లో లేటెస్ట్ కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడెక్కంటే?
2 ఓటీటీల్లో లేటెస్ట్ కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడెక్కంటే?

Rathnam OTT Release: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రత్నం. ఈ సినిమాకు మాస్ అండ్ యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన డైరెక్టర్ హరి దర్శకత్వం వహించారు. హరి-విశాల్ కాంబినేషన్‌లో ఇదివరకు భరణి, పూజా సినిమాలు వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో మూడో సినిమాగా రత్నం రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

500 స్క్రీన్లకుపైగా

విశాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన రత్నం సినిమా తమిళంతోపాటు తెలుగులో ఏప్రిల్ 26న థియేటర్లలో విడుదలైంది. రత్నం సినిమాను తమిళనాడులో 500 స్క్రీన్‌లకు పైగా విడుదల కాగా గ్లోబల్ స్క్రీన్ కౌంట్ 100 స్క్రీన్‌లకు పైగా రిలీజ్ అయింది. సుమారు 2 గంటల 36 నిమిషాలు ఉంటుందని కూడా సమాచారం.

సెన్సార్ బోర్డ్ నుంచి

అయితే అటు తమిళనాట, ఇటు తెలుగు రాష్ట్రాల్లో రత్నం సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగున్నాయని టాక్ వచ్చింది. సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాలో ఎమోషన్స్, స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయని కొంతమంది చెబితే.. రొటీన్ స్టోరీ అని, సినిమా చాలా స్లోగా వెళ్తుందని రివ్యూలు వచ్చాయి.

పాతకాలం నాటి కథ

ఎప్పుడో 90స్ కాలంలోనే కథ అని, అప్పుడు తెరకెక్కించి ఉంటే మాత్రం సినిమా హిట్ అయ్యేదని చెప్పారు. పాత కథకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు బార్డర్ అని కొత్తగా యాడ్ చేసి రొటీన్ యాక్షన్ మాస్ మసాలా చిత్రాన్ని హరి-విశాల్ అందించారని కాస్తా నెగెటివ్ టాకే వచ్చింది. ఇలాంటి రత్నం సినిమాకు విడుదలకు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం.

ఓటీటీ రైట్స్ ధర

రత్నం సినిమాను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ మంచి ధర వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ తర్వాత రెండు నెలలకు ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారట. కానీ, సినిమాకు వచ్చిన టాక్, బాక్సాఫీస్ కలెక్షన్స్ దృష్టిలో పెట్టుకుని రత్నం చిత్రాన్ని నెలలోపే ఓటీటీలో విడుదల చేయనున్నారని టాక్.

రెండు భాషల్లో స్ట్రీమింగ్

రత్నం సినిమాను మే 24 నుంచి తమిళం, తెలుగు రెండు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, రత్నం సినిమాను మరో ఓటీటీ సంస్థ కూడా కొనుగోలు చేసిందని సమాచారం. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సైతం రత్నం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిందట. ఈ రెండింట్లో రత్నం ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కూడా

అయితే, నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం జూన్ మొదటి వారంలో రత్నం డిజిటల్ ప్రీమియర్ కానుందని తెలుస్తోంది. అది కూడా కేవలం తమిళం లేదా తెలుగులో మాత్రమే రిలీజ్ కానుందట. రెండు ఓటీటీల్లో ఏదో ఒక భాషలో రత్నం ఓటీటీ స్ట్రీమింగ్ కానుందట. అమెజాన్ ప్రైమ్‌లో తమిళం, నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు లేదా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం ఇలా రిలీజ్ చేయనున్నారని ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.

ఓటీటీపై అధికారిక ప్రకటన

మరి వీటిలో ఎంతవరకు నిజముందో తెలియదు. ఏమైనా కానీ, రత్నం ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకట వచ్చే వరకు అసలు విషయం చెప్పడం కష్టం. మరి థియేటర్లలో రత్నం సినిమాను పెద్దగా ఎంకరేజ్ చేయని ప్రేక్షకులు ఓటీటీలో ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.