Vishal Rathnam: తల నరికి చేతిలో పట్టుకున్న విశాల్.. మైండ్ బ్లాక్ చేస్తున్న రత్నం టీజర్-vishal rathnam movie first shot teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishal Rathnam: తల నరికి చేతిలో పట్టుకున్న విశాల్.. మైండ్ బ్లాక్ చేస్తున్న రత్నం టీజర్

Vishal Rathnam: తల నరికి చేతిలో పట్టుకున్న విశాల్.. మైండ్ బ్లాక్ చేస్తున్న రత్నం టీజర్

Sanjiv Kumar HT Telugu
Dec 03, 2023 07:43 AM IST

Vishal Rathnam Teaser: కోలీవుడ్ స్టార్ విశాల్ రత్నం అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా విశాల్ రత్నం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రత్నం ఫస్ట్ షాట్ పేరుతో విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

తల నరికి చేతిలో పట్టుకున్న విశాల్.. మైండ్ బ్లాక్ చేస్తున్న రత్నం టీజర్
తల నరికి చేతిలో పట్టుకున్న విశాల్.. మైండ్ బ్లాక్ చేస్తున్న రత్నం టీజర్

Vishal Rathnam First Shot: తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవల మార్క్ ఆంటోనీతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు ఆయన నటించిన కొత్త సినిమా రత్నం. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పాపులర్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహించారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ ప్యాండన్ సహ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు.

విశాల్ రత్నం సినిమాకు రాకింగ్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌తో పాటుగా, ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేశారు. రత్నం ఫస్ట్ షాట్ టీజర్ ప్యూర్ గూస్ బంప్స్ స్టఫ్‌లా అనిపించింది. ఆ బ్యాక్ డ్రాప్, ఆ సెటప్, దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్ఆర్, కత్తితో తల నరికేయడం, విశాల్ మాస్ అవతారం ఇలా అన్నీ కలిసి ఈ ఫస్ట్ షాట్ టీజర్‌ను అద్భుతం అనేలా చేశాయి.

‘కన్నీరే నెత్తురు చిందగా.. క్రోదమే రుధిరం చిమ్మగా.. ఆగ్రహమే అరుణధారగా.. రణరంగమే రక్తపు ఏరుగా’ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే మాటలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. తలని నరికిన రక్తంతో టైటిల్ పేరు రావడం, ఆ రక్తమే రత్నం అనే టైటిల్‌గా మారడం మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. కాగా ఈ సినిమాకు వివేక్ పాటలు రాశారు.

విశాల్ నటిస్తున్న రత్నం సినిమాకు ఎం సుకుమార్ కెమెరామెన్‌గా పని చేయగా.. టీఎస్ జయ్ ఎడిటర్‌గా, ఆర్ట్ డైరెక్టర్ పీవీ బాలాజీ వర్క్ చేశారు. ఇక కనల్ కన్నన్, పీటర్ హెయిన్, దిలిప్ సుబ్రయాన్, విక్కీ స్టంట్ మాస్టర్లుగా పని చేశారు. రత్నం సినిమాలో విశాల్, భవానీ శంకర్‌తోపాటు సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు.

టీ20 వరల్డ్ కప్ 2024