రైస్ వాటర్ చర్మం, జుట్టు కోసం ఉపయోగిస్తుంటారు. అయితే ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. పోషకాలు అధికంగా ఉండే బియ్యం నీరుతో కలిగే 5 ప్రయోజనాలు తెలుసుకుందాం. 

pexels

By Bandaru Satyaprasad
Dec 04, 2024

Hindustan Times
Telugu

తక్కువ కేలరీల కంటెంట్ - బియ్యం నీరు చక్కెర పానీయాలకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. అధికంగా తినాలనే కోరిక, ఆకలిని నియంత్రించడంలో బియ్యం నీరు ఉపయోగపడుతుంది.  

pexels

జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది - బియ్యం నీటిలో ఉండే స్టార్చ్ జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. బియ్యం నీరు ఫ్యాట్ మెటబాలిజంను ప్రోత్సహించడం ద్వారా సమర్థవంతంగా బరువును నిర్వహించగలరు. 

pexels

బియ్యపు నీటిని తాగడం వల్ల అందులోని స్టార్చ్ కంటెంట్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో భోజనం అధికంగా చేయాలనే ఆలోచనను తగ్గిస్తుంది.  

pexels

ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది 

pexels

వ్యాయామం తర్వాత రైస్ వాటర్ తాగితే పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ ను శరీరానికి తిరిగి అందిస్తుంది. ఇది డీహైడ్రేషన్ ను నిరోధిస్తుంది. అలసటను తగ్గిస్తుంది.  

pexels

జీవ క్రియను పెంచుతుంది - రైస్ వాటర్ లోని విటమిన్ బి జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది కేలరీలను మరింత సమర్థవంతంగా బర్న్ చేయడంలో సహాపడుతుంది. మీరు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.  

pexels

బియ్యం నీరు ఆరోగ్యకరమైనప్పటికీ అధికంగా తీసుకుంటే మలబద్ధకం ఏర్పడవచ్చు. రోజుకు 1-2 కప్పులు మాత్రమే తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఎక్కువగా తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు దారితీయవచ్చు.  

pexels

కర్పూరంతో చలికాలంలోనూ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో చూడండి