Netflix Top Trending Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 7 ట్రెండింగ్ మూవీస్ ఇవే.. ఈ వీకెండ్‌లో చూసేయండి
Netflix Top Trending Movies: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ 7 మూవీస్ ఇవే. వీటిలో మీరెన్ని చూశారో చెక్ చేసుకోండి. ఇప్పటికీ చూడలేదంటే ఈ వీకెండ్ లో ప్లాన్ చేయండి.
Netflix Top Trending Movies: నెట్‌ఫ్లిక్స్ లో ఆ ఓటీటీ ఒరిజినల్స్ తోపాటు పలు ఇతర మూవీస్ కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ మూవీస్ లో ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ట్రెండింగ్ సినిమాల్లో ఫైటర్ తోపాటు మర్డర్ ముబారక్, మలయాళం మూవీ తుండు, మెర్రీ క్రిస్మస్ లాంటివి ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ప్రతి వారం టాప్ ట్రెండింగ్ మూవీస్ జాబితా మారుతూ ఉంటుంది. అయితే శుక్రవారం (మార్చి 22) వరకూ టాప్ లో ఉన్న మూవీస్ ఏంటో ఇక్కడ చూడండి.
ఫైటర్ - నంబర్ 1
ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న థియేటర్లలో రిలీజైన ఫైటర్ మూవీ ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ మూవీస్ లో ఈ ఫైటర్ టాప్ లో ఉంది. హృతిక్ రోషన్, దీపికా పదుకోన్, అనిల్ కపూర్ నటించిన ఈ మూవీ థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మర్డర్ ముబారక్ - నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్
ఇక నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ మర్డర్ ముబారక్ ట్రెండింగ్స్ లో రెండో స్థానంలో ఉంది. సారా అలీ ఖాన్, పంకజ్ త్రిపాఠీ, డింపుల్ కపాడియా, కరిష్మా కపూర్ లాంటి బాలీవుడ్ నటీనటులు నటించిన ఈ సినిమాకు అంత మంచి రివ్యూస్ రాకపోయినా.. రెండో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీలోని ఓ క్లబ్ లో జరిగిన హత్య, దాని చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ మర్డర్ ముబారక్ కథ తిరుగుతుంది.
డామ్‌సెల్
హాలీవుడ్‌లో 20 ఏళ్లకే స్టార్ హీరోయిన్‍గా పేరు తెచ్చుకుంటోన్న మిల్లీ బాబీ బ్రౌన్ నటించిన డామ్‌సెల్ మూవీ నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్స్ లో మూడోస్థానంలో ఉంది. గత వారం రెండో స్థానంలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఇంగ్లిష్ తోపాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
తుండు
మలయాళం మూవీ తుండు నాలుగో స్థానంలో ఉంది. బిజు మీనన్ హీరోగా నటించిన మలయాళ మూవీ తుండు ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు రియాస్ షరీష్ దర్శకత్వం వహించాడు. తెలుగులోనూ మూవీ అందుబాటులో ఉంది.
అన్వేషిప్పిన్ కండెతుమ్
మరో మలయాళ మర్డర్ మిస్టరీ మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్ మూవీ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. టొవినో థామస్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు మంచి థ్రిల్ పంచుతోంది.
ఇక ఆరు, ఏడు స్థానాల్లో ఐరిష్ విష్, మెర్రీ క్రిస్మస్ మూవీస్ ఉన్నాయి. మెర్రీ క్రిస్మస్ మూవీలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన విషయం తెలిసిందే. థియేటర్లలో ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. ఈ మూవీస్ చూసి ఉండకపోతే.. ఈ వీకెండ్ లో ప్లాన్ చేయండి.