Rathnam Twitter Review: రత్నం ట్విట్టర్ రివ్యూ.. విశాల్ మాస్ యాక్షన్.. హ్యట్రిక్ కొట్టినట్లేనా?
Rathnam Movie Twitter Review In Telugu: కోలీవుడ్ హీరో, పురట్చి దళపతి విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రత్నం. ఈ సినిమా ఏప్రిల్ 26న తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రత్నం ట్విట్టర్ రివ్యూ చూస్తే..
Rathnam Twitter Review In Telugu: యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కింది రత్నం. ఇది వరకే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో భరణి, పూజా వంటి యాక్షన్ మూవీస్ వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మూడో సారి రత్నంతో ఈ కాంబో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు.
రత్నం సినిమాపై
రత్నం మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఎటువైపో ఎటువైపో.. అనే పాట శ్రోతలను మెప్పించింది. దేవీ శ్రీ ప్రసాద్ విశాల్ కాంబోలో రత్నం మొదటి సినిమా కావడంతో మ్యూజిక్ లవర్స్ దృష్టి రత్నం మీద పడంది.
కుటుంబ సమేతంగా
ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవలే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ మేరకు సెన్సార్ సభ్యులు సినిమాను వీక్షించి యూ/ఏ సర్టిఫికెట్‌ను అందించారు. ఈ మూవీలో యాక్షన్‌తో పాటు చక్కని సందేశం ఉందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని కొనియాడారు.
సోషల్ మీడియాలో
ఈ చిత్రం ఏప్రిల్ 26న అంటే ఇవాళ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పడిన పలు ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్స్ రత్నం మూవీపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రత్నంపై రివ్యూలు ఇస్తున్నారు. మరి వారి అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం.
కమ్ బ్యాక్ బ్లాక్ బస్టర్
"షోటైమ్ రత్నం. విశాల్ నుంచి బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ సినిమా రత్నం" అని రాఘవ్ అనే ఎక్స్ (గతంలో ట్విట్టర్) యూజర్ ట్వీట్ చేశఆడు. అందులో థియేటర్‌లోని విజువల్స్ వీడియోను షేర్ చేశాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే బ్యానర్ రావడంతో ఆ వీడియో ఉంది.
"పాటలు సూపర్బ్‌గా ఉన్నాయి. ఎమోషన్స్ అదిరిపోయాయి. స్క్రీన్‌ప్లే మరింత అదిరిపోయింది. అతని మొత్తం సినిమాల్లో ఇది కూడా ఒక వందశాతం బెస్ట్ సినిమా. రత్నం బాగుంది" అనే మీనింగ్ వచ్చేలా ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
"విశాల్, హారి యాక్షన్ ఎంటర్టైనర్ రత్నం ఇవాళ్టి నుంచి థియేటర్లలోకి రానుంది. మంచి ఇంటర్వ్యూలు, గ్రౌండ్ నుంచి సినిమాకు ప్రమోషన్స్ నిర్వహించారు. ఆల్ ది బెస్ట్" అన్నట్లుగా ఓ నెటిజన్ రత్నం సినిమాపై ట్వీట్ చేశాడు.
మంచి మెసెజ్
రత్నం సినిమాలో అదిరిపోయే యాక్షన్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉందని నెటిజన్స్ రివ్యూలు ఇస్తున్నారు. విశాల్ నటన అదిరిపోయిందని అంటున్నారు. ఫస్టాఫ్‌లో విశాల్ ఇంట్రో సీన్స్, ప్రియా భవానీ శంకర్ మధ్య ఎమోషన్స్ బాగున్నాయట. గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు, మురళీ శర్మ తమ పాత్రల్లో బాగా జీవించేశారని రివ్యూలు వస్తున్నాయి.
ఛాన్స్ ఇవ్వని డైరెక్టర్
అయితే, విశాల్, ప్రియా భవానీ మధ్య లవ్ ట్రాక్‌లో డెప్త్ కంటే సినిమాటిక్ టోన్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. రత్నం సినిమా మొదలైనప్పటినుంచి విశాల్ అభిమానులు విజిల్స్, కేకలతో ఊగిపోయేంతగా డైరెక్టర్ హరి ఎక్కువగా అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. అందుకు కారణం రత్నం కథలో కంటెంట్ లేకపోవడం అంటున్నారు.
పూర్తి స్థాయిలో
రత్నం సినిమా బోరింగ్ స్క్రీన్ ప్లేతో లాజిక్ లెస్ యాక్షన్ డ్రామాగా నిలిచిందని టాక్. మొత్తానికి భారీ యాక్షన్ సినిమాగా వచ్చిన రత్నం ఒక సిల్లీ డ్రామా అయిపోయిందంటున్నారు. అయితే, విశాల్ అభిమానులకు నచ్చేలా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని రివ్యూలు చెబుతున్నాయి. పూర్తి స్థాయిలో మాత్రం రత్నం ఆకట్టుకోడనేది టాక్.