Vishal: పురుచ్చి దళపతి విశాల్ కోసం దేవీ శ్రీ ప్రసాద్.. డోంట్ వర్రీ చిచ్చా అంటూ!-tamil actor vishal rathnam movie dont worry chiccha released composed by devi sree prasad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tamil Actor Vishal Rathnam Movie Dont Worry Chiccha Released Composed By Devi Sree Prasad

Vishal: పురుచ్చి దళపతి విశాల్ కోసం దేవీ శ్రీ ప్రసాద్.. డోంట్ వర్రీ చిచ్చా అంటూ!

Sanjiv Kumar HT Telugu
Mar 16, 2024 01:22 PM IST

Vishal Rathnam Devi Sri Prasad: తమిళ హీరో విశాల్ తాజాగా నటిస్తున్న సినిమా రత్నం. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రత్నం సినిమా నుంచి డోంట్ వర్రీ రా చిచ్చా అనే మాస్ బీట్ సాంగ్‌‌ను విడుదల చేశారు.

పురుచ్చి దళపతి విశాల్ కోసం దేవీ శ్రీ ప్రసాద్.. డోంట్ వర్రీ చిచ్చా అంటూ!
పురుచ్చి దళపతి విశాల్ కోసం దేవీ శ్రీ ప్రసాద్.. డోంట్ వర్రీ చిచ్చా అంటూ!

Rathnam Dont Worry Ra Chiccha: మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో విశాల్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలాంటిది యాక్షన్ డైరెక్టర్ హరితో విశాల్ మూవీ అంటే యాక్షన్ మూవీ లవర్స్‌కు ఇక పండుగే. దానికి తగ్గట్టుగానే రత్నం అనే చిత్రం ఫుల్ యాక్షన్ సినిమాగా రానుంది.

రత్నం సినిమాను జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి డైరెక్టర్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ మూవీకి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కల్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్ బాధ్యతలు చేపట్టారు. ఇక రత్నం సినిమాలో హీరో విశాల్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

రత్నం మూవీలోని ఫస్ట్ షాట్ టీజర్‌, పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా రత్నం మూవీ నుంచి అదిరిపోయే పాటను రిలీజ్ చేశారు. కాలేజ్‌లో విద్యార్థుల మధ్య రిలీజ్ చేసిన డోంట్ వర్రీరా చిచ్చా పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. పాటను రిలీజ్ చేసిన అనంతరం విశాల్ ఆసక్తికరంగా స్పీచ్ ఇచ్చాడు.

"ఇలా కాలేజ్‌లో మా పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. డోంట్ వర్రీ మచ్చి.. ఎగ్జామ్స్ కోసం డోంట్ వర్రీ మచ్చి.. కష్టాలు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ప్రతీ హీరోకి దేవీ శ్రీ ప్రసాద్‌ అదిరిపోయే పాట ఒకటి ఇస్తాడు. నాకు కూడా అలాంటి పాటను ఇవ్వమని అడిగాను. హరి నా జీవితాన్ని చూసి ఈ పాటను రాయించాడా? అని అనిపిస్తుంది" అని హీరో విశాల్ తెలిపాడు.

ఇక శ్రీమణి రాసిన ఈ డోంట్ వర్రీ రా చిచ్చా పాటను దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించాడు. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీ మంచి ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. రత్నం షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 26న రత్నం చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ప్రస్తుతం రత్నం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపై వరుసగా అప్డేట్లతో రత్నం టీం సందడి చేయనుంది అని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రత్నం సినిమాలో విశాల్, ప్రియా భవానీ శంకర్‌తోపాటు యోగి బాబు, సముద్ర ఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కనల్ కన్నన్, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్రయాన్, విక్కీ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఇదివరకు విడుదలైన రత్నం ఫస్ట్ షాట్ టీజర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ టీజర్‌ చాలా ట్రెండ్ అయింది. విశాల్ కత్తితో విలన్ తల నరకడం చూపించి ఇందులో హీరో ఎంత మాసీగా ఉన్నాడో చూపించారు.

IPL_Entry_Point