Baak OTT: ఓటీటీలోకి తమన్నా రాశీ ఖన్నా తమిళ హారర్ మూవీ బాక్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Aranmanai 4 OTT Release: తమన్నా, రాశీ ఖన్నా నటించిన తమిళ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ అరణ్మనై 4 ఓటీటీ ప్లాట్‌ఫామ్, డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఇదే అని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాను తెలుగులో బాక్‌గా రిలీజ్ చేశారు. అంటే తెలుగులోను బాక్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
Baak OTT Streaming: టాలీవుడ్ మిల్కీ బ్యూటి తమన్నా (Tamanna), ముద్దుగుమ్మ రాశీ ఖన్నా (Raashi Khanna) మరోసారి కలిసి నటించిన సినిమా అరణ్మనై 4. అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ అరణ్మనై ఫ్రాంచైజీ (Aranmanai Franchise) నుంచి నాలుగో సినిమాగా వచ్చిందే అరణ్మనై 4. ఈ సినిమాకు గత చిత్రాలకు దర్శకత్వం వహించిన నటుడు, డైరెక్టర్ సుందర్ సి తెరకెక్కించారు.
బాక్ టైటిల్‌తో
ఈ అరణ్మనై 4 చిత్రాన్ని తెలుగులో బాక్ పేరుతో విడుదల చేశారు. తమిళంతోపాటు తెలుగులో కూడా అరణ్మనై సిరీస్ బాగా హిట్ అయింది. అందుకే వరుసపెట్టి సినిమాలను రూపొందిస్తున్నాడు డైరెక్టర్ అండ్ యాక్టర్ సుందర్ సి (Director Sundar C). మరోసారి బాక్ అనే దెయ్యం కథ ఆధారంగా తెరకెక్కించారు. అస్సాంలో బాక్ అనే దెయ్యం (Baak Ghost) గురించి చాలా కథలుగా చెప్పుకుంటారు.
అస్సాంకు చెందిన దెయ్యం
అస్సామీకి చెందిన బాక్ అనే దెయ్యం సౌత్‌కు వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్టుతో చిత్రాన్ని రూపొందించినట్లు డైరెక్టర్ సుందర్ సి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే. పాటలు, ట్రైలర్‌తో ఎంతో బజ్ క్రియేట్ చేసిన బాక్ సినిమా మే 3న చాలా గ్రాండ్‌గా తమిళంతోపాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విడుదలైంది. సినిమాకు మంచి టాకే వచ్చింది.
కొత్తగా చూపించలేదని
తమిళంలో అరణ్మనై 4 సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతోపాటు కలెక్షన్స్ కూడా బాగున్నట్లు సమాచారం. అయితే, రొటీన్ కామెడీ, బాక్ అనే దెయ్యాన్ని కొత్తగా చూపించలేదని, ఈ సిరీస్ అభిమానుల కోసం మాత్రమే అరణ్మనై 4 తెరకెక్కించారేమో అని పలువురు రివ్యూలు ఇచ్చారు. ఏది ఎలా ఉన్న తమిళ, తెలుగు ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి టాక్ అయితే వస్తుంది.
జీ5 ఓటీటీకి రైట్స్
ఇదిలా ఉంటే, ఈ క్రమంలో బాక్ ఓటీటీ (Aranmanai 4 OTT) స్ట్రీమింగ్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (Zee5 OTT) మంచి ధరకు కొనుగోలు చేసి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుందని తమిళనాట వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా అరణ్మనై 4 సినిమాను మే 31 లేదా జూన్ 10 లోపు ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.
నెలలోపే ఓటీటీలోకి
అలాగే, అరణ్మనై 4 జీ5లో తమిళంతోపాటు తెలుగు భాషలో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కానుందట. అంటే మే 3న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నెల కాకముందే ఓటీటీలోకి వచ్చేయనుందని తెలుస్తోంది. అయితే, అధికారిక సమాచారం మాత్రం కాదు. కాబట్టి, బాక్ ఓటీటీపై (Baak OTT) అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
తెలుగు రాష్ట్రాల్లో
ఇదిలా ఉంటే, బాక్ సినిమాను ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్‌లు అవ్నీ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. ఇందులో వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, కోవై సరళతోపాటు తదితరులు నటించారు.