Vijay Antony: ఈ సినిమాతో మహిళలను అర్థం చేసుకుంటారు: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ-vijay antony says you will understand women after watching love guru movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Antony: ఈ సినిమాతో మహిళలను అర్థం చేసుకుంటారు: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ

Vijay Antony: ఈ సినిమాతో మహిళలను అర్థం చేసుకుంటారు: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ

Sanjiv Kumar HT Telugu
Mar 17, 2024 02:50 PM IST

Vijay Antony About Love Guru Movie: లవ్ గురు సినిమాతో మీ జీవితాల్లోని మహిళలను అర్థం చేసుకుంటారని చెబుతున్నాడు బిచ్చగాడు, బిచ్చగాడు 2 చిత్రాల హీరో విజయ్ ఆంటోనీ. తాజాగా తన మూవీ లవ్ గురుకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు విజయ్ ఆంటోనీ.

ఈ సినిమాతో మహిళలను అర్థం చేసుకుంటారు: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ
ఈ సినిమాతో మహిళలను అర్థం చేసుకుంటారు: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ

Vijay Antony Love Guru Movie: వైవిధ్యమైన కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ సౌత్ ఫిలీం ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఇప్పటివరకు సీరియస్ రోల్స్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాల చేసిన విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటింక్ జోనర్‌లో చేస్తున్న మూవీ లవ్ గురు. మృణాళిని రవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తిర విశేషాలను పంచుకున్నాడు హీరో విజయ్ ఆంటోనీ.

"దాదాపు 95 శాతం మందికి లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా అబ్బాయిలకు. గర్ల్స్‌ను హ్యాండిల్ చేయడం అనేది అబ్బాయిలకు పెద్ద సమస్య. ఈ లవ్ గురు సినిమా చూస్తే అమ్మాయిలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. నేనే లవ్ గురులా ఆ పరిష్కారాలు చెబుతాను. ఈ సినిమాలో లీలా అనే అమ్మాయితో నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాను. ఆ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాను అనేది ఫన్నీగా దర్శకుడు వినాయక్ సినిమాలో చూపించాడు" అని విజయ్ ఆంటోనీ అన్నారు.

"ఏప్రిల్ 11న రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 నుంచి 600 థియేటర్స్‌లో లవ్ గురు సినిమాను విడుదల చేయబోతున్నాం. నేను ఇప్పటిదాకా 12-13 సినిమాలు చేస్తే వాటిలో 8-9 సినిమాలకు భాష్యశ్రీ గారు వర్క్ చేశారు. బిచ్చగాడు సినిమా నుంచి ఆయన నాతో ట్రావెల్ చేస్తున్నారు. కథలోని సందర్భాన్ని మరింత అందంగా రాస్తారు. హీరోయిన్ మృణాళిని రవి తన క్యారెక్టర్‌ను బాగా అర్థం చేసుకుని ఆకట్టుకునేలా నటించింది" అని విజయ్ ఆంటోనీ తెలిపారు.

"ఏడాది పాటు టైమ్ తీసుకుని మా డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ ఇచ్చారు. అంతే బాగా తెరకెక్కించారు. ఆయన యాక్టర్ కూడా. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కంటే లవ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రేమ అనేది యూనివర్సల్‌గా ఎక్కడైనా ఒక్కటే. లవ్ గురు చూసిన తర్వాత పెళ్లైన వాళ్లు, కాని వాళ్లు తమ జీవితాల్లోని మహిళలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మా సినిమాటోగ్రాఫర్ ఫరూక్, మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. వారికి థ్యాంక్స్. లవ్ గురు సక్సెస్ మీట్‌లో మనమంతా మళ్లీ కలుద్దాం" అని విజయ్ ఆంటోనీ చెప్పుకొచ్చారు.

లవ్ గురు సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీనే నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక లవ్ గురు మూవీ రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీతోపాటు డైరెక్టర్ వినాయక్ వైద్యనాథన్ ఆసక్తికర విషయాలు చెప్పారు.

"శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమాకు నేను డైరెక్షన్ టీమ్‌లో వర్క్ చేశాను. అప్పుడు ఇక్కడ హైదరాబాద్‌లో మూడు నెలలు ఉన్నాను. ఆ సమయంలో తెలుగు ఇండస్ట్రీ ఆర్టిస్టులకు ఎంత విలువ ఇస్తారు అనేది చూశాను. మా లవ్ గురు సినిమాతో ఇప్పుడు మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. విజయ్ ఆంటోనీ గారి సినిమాకు డైరెక్షన్ చేయడం ఒక మర్చిపోలేని విషయంగా భావిస్తాను" అని డైరెక్టర్ వినాయక్ వైద్యనాథన్ అన్నారు.

"బిచ్చగాడు తర్వాత అంతలా లవ్ గురు కూడా ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమా విజయ్ ఆంటోనీ గారికి 2.0 అనుకోవచ్చు. మనమంతా లవ్‌ను ఒక్కోలా ఎక్స్‌ప్రెస్ చేస్తాం. ఆయన తన పద్ధతిలో ఎక్స్ ప్రెస్ చేశారు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం విజయ్ గారికి కొత్త" అని వినాయక్ వైద్యనాథన్ తెలిపారు.

Whats_app_banner