Yodha OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ యోధ.. ఆరోజే స్ట్రీమింగ్!-yodha ott release date sidharth malhotra and raashii khanna action thriller will stream on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yodha Ott Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ యోధ.. ఆరోజే స్ట్రీమింగ్!

Yodha OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ యోధ.. ఆరోజే స్ట్రీమింగ్!

Yodha OTT Release Date: యోధ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైనట్టు బజ్ బయటికి వచ్చింది. ఆ వివరాలివే..

Yodha OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ యోధ.. ఆరోజే స్ట్రీమింగ్!

Yodha OTT Release Date: బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించిన యోధ చిత్రం భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. మార్చి 15వ తేదీన ఈ సినిమా రిలీజైంది. సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓజా ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ట్రైలర్ ఆకట్టుకోవడం సహా ప్రమోషన్లను జోరుగా చేయటంతో యోధ మూవీపై చాలా క్రేజ్ వచ్చింది. అయితే, ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావటంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోయింది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే!

యోధ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ ప్లాట్‍ఫామ్‍లో యోధ మూవీ ఏప్రిల్ 19వ తేదీన స్ట్రీమింగ్‍కు రానున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. అయితే, ముందుగా ఈ మూవీ రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్‍కు వస్తుందని బజ్ ఉంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం బాలీవుడ్ సినిమాలు థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్‍కు రావాల్సి ఉంది. అయితే, రెంటల్ పద్ధతిలో అయితే ముందుగానే రావొచ్చు. అందుకే ఏప్రిల్ 19న యోధ సినిమా రెంటల్ విధానంలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మూడు వారాలకు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ యూజర్లందరికీ ఉచితంగా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

యోధ గురించి..

యోధ సినిమాలో ఆర్మీ సైనికుడిగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్లు రాశీ ఖన్నా, దిశా పటానీ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. రోనిత్ రాయ్, తనూజ్ విర్వాణీ, సన్నీ హిందూజ, కృతిక భరద్వాజ్, ఎంఎస్ జహీర్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. జాన్ స్టీవర్ట్ ఈడూరి బ్యాక్‍గ్రాడ్ స్కోర్ ఇచ్చారు.

ధర్మ ప్రొడక్షన్స్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, మెంటార్ డిసిపిల్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లపై కరణ్ జోహార్, హిరూ యశ్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జిష్ణు భట్టచార్జీ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేశారు.

యోధ కలెక్షన్లు

యోధ సినిమా సుమారు రూ.55 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కింది. ఆర్మీ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్‍తో ఉండడం, ట్రైలర్ ఆకట్టుకోవటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే, మిశ్రమ స్పందన రావటంతో బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. మొత్తంగా ఈ మూవీకి సుమారు రూ.31 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం కమర్షియల్‍గా ప్లాఫ్‍గా నిలిచింది.

యోధ స్టోరీ బ్యాక్‍డ్రాప్

స్పెషల్ టాస్క్ ఫోర్స్ సైనికుడు అరుణ్ కత్యల్ (సిద్ధార్థ్ మల్హోత్రా).. ఓ మిషన్‍లో వైఫల్యం చెందుతాడు. దీంతో అతడిపై స్పెన్షన్ వేటు పడుతుంది. సస్పెండ్ అయిన అతడు అనూహ్యంగా హైజాక్ అయిన ఓ విమానంలో కనిపిస్తాడు. అరుణ్ దేశభక్తి ఉన్న సైనికుడా.. లేకపోతే దేశ ద్రోహా? అనేదే యోధ సినిమా కథగా ఉంది. కథపరంగా ఆసక్తికరంగా ఉన్నా.. స్క్రీన్‍ప్లే సరిగా లేదనే అభిప్రాయాలు ఈ చిత్రం విషయంలో వ్యక్తమయ్యాయి. మిక్స్డ్ రివ్యూలే వచ్చాయి. అయితే, సిద్ధార్థ్ మల్హోత్రా పర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు దక్కాయి.