Top Rated Kannada Movies: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న టాప్ రేటెడ్ కన్నడ మూవీస్ ఏవంటే?
డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో రూపొందుతోన్న కన్నడ సినిమాలు పాన్ ఇండియన్ లెవెల్‌లో అద్భుతమైన విజయాల్ని అందుకుంటున్నాయి. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలలో ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న కొన్ని టాప్ రేటెడ్ కన్నడ మూవీస్ ఏవంటే?
(1 / 5)
దీక్షిత్ శెట్టి, ఖుషి, పృథ్వీ అంబర్ హీరోహీరోయిన్లుగా నటించిన కన్నడ లవ్‌స్టోరి దియా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రాయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది.
(2 / 5)
2020లో రిలీజైన కన్నడ మూవీ లవ్ మాక్‌టెయిల్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఓ యువకుడి జీవితంలో భిన్న దశల్లో సాగే ప్రేమకథతో దర్శకుడు డార్లింగ్ కృష్ణ లవ్ మాక్‌టెయిల్ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో డార్లింగ్ కృష్ణనే హీరోగా నటించాడు.
(3 / 5)
రాజ్ బీ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఒందు మొట్టేయ్య కథే మూవీ విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. బట్టతల సమస్యతో బాధపడుతోన్న జనార్ధన్ అనే లెక్చరర్ జీవితంలోకి ఓ అమ్మాయి ఎలా వచ్చిందనే పాయింట్‌తో మెసేజ్ ఓరియెంటెడ్ లవ్‌స్టోరీగా ఈ మూవీ తెరకెక్కింది.
(4 / 5)
తోరా తోరా కన్నడంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అనుకోకుండా టైమ్ మిషన్‌లో చిక్కుకున్న ఏడుగురు స్నేహితుల కథతో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో మంజు హెడ్డూర్, సన్నిహ యాదవ్ కీలకపాత్రలు పోషించారు.
ఇతర గ్యాలరీలు