Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..-nikhil swayambhu movie one fight costs makers whopping 8 crores this high budget pan india movie shooting in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

Hari Prasad S HT Telugu
May 07, 2024 02:38 PM IST

Nikhil Swayambhu: నిఖిల్ మరో పాన్ ఇండియా మూవీ స్వయంభుతో రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..
ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

Nikhil Swayambhu: నిఖిల్ స్వయంభు మూవీ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. గతంలో కార్తికేయ 2, స్పై మూవీలతో పాన్ ఇండియా లెవల్లో స్టార్ గా మారిపోయిన అతడు.. ఇప్పుడీ స్వయంభుతో మరోసారి ఐదు భాషల ప్రేక్షకులను పలకరించనున్నాడు. ౌ

yearly horoscope entry point

భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా.. అందులో ఓ ఫైట్ సీన్ కోసమే రూ.8 కోట్లు ఖర్చు పెడుతుండటం విశేషం. తాజాగా మంగళవారం (మే 7) ఈ మూవీ పోస్టర్ ను నిఖిల్ రిలీజ్ చేశాడు. అందులో అతడు ఓ వారియర్ గా కనిపిస్తున్నాడు.

నిఖిల్ స్వయంభు షూటింగ్

నిఖిల్ నటిస్తున్న ఈ స్వయంభు మూవీ ఓ పీరియాడిక్ యాక్షన్ మూవీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో ఒక ఫైట్ సీన్ కోసం ప్రత్యేకంగా రెండు భారీ సెట్లు వేశారు. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చూడని విధంగా యుద్ధానికి సంబంధించిన ఓ సీన్ తీయబోతున్నట్లు ఈ మూవీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ వార్ సీన్ లో ఏకంగా 700 మంది పాల్గొననున్నారు. అందులో వియత్నాం నుంచి తీసుకొచ్చిన ఫైటర్స్ కూడా ఉండనుండటం విశేషం. 12 రోజుల పాటు ఈ సీన్ ను ప్రత్యేకంగా వేసిన సెట్లలో తీయనున్నారు. దీనికోసం మేకర్స్ ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాలో వారియర్ గా కనిపిస్తున్న నిఖిల్.. అందుకు తగినట్లుగా షూటింగ్ ప్రారంభానికి ముందే శిక్షణ తీసుకున్నాడు.

సినిమాలో అతడు కొన్ని కళ్లు చెదిరే సాహసాలు చేయబోతున్నట్లు సమాచారం. ఆ మధ్య బాహుబలి మూవీలో రాజమౌళి తీసిన యుద్ధం సీన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడీ స్వయంభు మూవీలోని సీన్ కూడా అంతకుమించిన స్థాయిలో తీయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆసక్తి రేపుతోంది.

బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్న యోధుడిగా నిఖిల్ ఇందులో కనిపించాడు. అతని కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఈ స్వయంభు నిలవబోతోంది. సంయుక్త, నభా నటేష్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.

నిఖిల్ ఏం చేస్తున్నాడు?

గతంలో కార్తికేయ 2 మూవీతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సినిమా తెలుగులో కంటే నార్త్ లోనే బాగా ఆడింది. వసూళ్ల వర్షం కురిపించింది. అదే జోష్ లో నిఖిల్ ఆ తర్వాత స్పై మూవీని కూడా పాన్ ఇండియా లెవల్లో తీసినా.. ఆ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. దీంతో ఇప్పుడీ స్వయంభుపై అతడు భారీ ఆశలే పెట్టుకున్నాడు.

ప్రస్తుతం నిఖిల్ ఈ స్వయంభు మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అంతేకాదు సూపర్ హిట్ కార్తికేయ ఫ్రాంఛైజీని కూడా ముందుకు తీసుకోబోతున్నట్లు గతంలోనే వెల్లడించాడు.

కార్తికేయ 3 కూడా రాబోతున్నట్లు రెండు నెలల కిందటే అతడు వెల్లడించాడు. మరోవైపు సినిమాలు కాకుండా పాలిటిక్స్ లోనూ చేరాడు. అతడు కొన్నాళ్ల కిందట టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

Whats_app_banner