Nikhil Swayambhu: ఫస్ట్ టైమ్ హిస్టారికల్ జోనర్‌లో నిఖిల్ మూవీ - ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్
Nikhil Swayambhu: కెరీర్‌లో తొలిసారి హిస్టారికల్ కథాంశంతో యంగ్ హీరో నిఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడు. నిఖిల్ బర్త్‌డే సందర్భంగా గురువారం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేశారు.
Nikhil Swayambhu: కెరీర్‌లో ఫస్ట్ టైమ్ హిస్టారికల్ జోనర్‌లో నిఖిల్ సినిమా చేస్తోన్నాడు. ఈ మూవీకి డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గురువారం నిఖిల్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ హిస్టారికల్ మూవీకి స్వయంభూ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఫస్ట్‌లుక్‌లో నిఖిల్ పోరాట యోధుడిగా కనిపిస్తోన్నాడు. ఓ చేతిలో బళ్లెం, మరో చేతిలో షీల్డ్ ధరించి యుద్ధరంగంలో పోరాడుతోన్నట్లుగా ఉన్న నిఖిల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాంగ్ హెయిర్‌స్టైల్‌తో ఇప్పటివరకు కనిపించనటువంటి కొత్త లుక్‌లో నిఖిల్ కనిపిస్తోన్నాడు.
హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియన్ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోన్నాడు. నిఖిల్ కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీగా స్వయంభూ తెరకెక్కుతోంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుంచి ప్రారంభించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. స్వయంభూ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.
నిఖిల్ హీరోగా నటిస్తోన్న 20వ సినిమా ఇది. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు. కాగా ప్రస్తుతం పలు పాన్ ఇండియ్ మూవీస్‌తో నిఖిల్ బిజీగా ఉన్నాడు.
సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో స్పై అనే మూవీ చేస్తోన్నాడు నిఖిల్. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అలాగే రామ్‌చరణ్ ప్రొడక్షన్‌లో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌజ్ అనే సినిమాను ఇటీవలే అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.