Shalini Kondepudi: సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్ లాగే ఆ హీరోయిన్.. నటుడు నిఖిల్ కామెంట్స్
Actor Nikhil About Shalini Kondepudi: హీరోలు సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్ తరహాలోనే శాలినీ కొండెపూడి ఉంటుందని నటుడు నిఖిల్ గాజుల ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. అభినవ్ గోమఠం మై డియర్ దొంగ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిఖిల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Nikhil My Dear Donga Pre Release Event: అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రల్లో నటించిన సినిమా మై డియర్ దొంగ. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి కమెడియన్ అండ్ యాక్టర్ ప్రియదర్శి ముఖ్య అతిథిగా విచ్చేసి మై డియర్ దొంగ ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ ఆసక్తికర విశేషాలు పంచుకుంది.
పదేళ్ల తర్వాత మళ్లీ
"అభినవ్‌తో స్టార్ చేస్తే.. 2014లో మేము తీసిన ఫస్ట్ మూవీ ‘జగన్నాటకం’లో కూడా అభినవ్ దొంగ క్యారెక్టర్ చేశాడు. మళ్లీ ఇప్పుడు పదేళ్ల తర్వాత దొంగ పాత్ర చేశాడు. ఇందులో కామెడీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ర్యాడికల్ కామెడీ ఉంది. మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేస్తూ చేశా. ఆహా గురించి చెప్పక్కర్లేదు. ఆహా నుంచి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయని ఆశిస్తున్నా" అని మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాడా అన్నారు.
దొంగ అంటే శాలినీనే
"మై డియర్ దొంగ అంటే ఈ టీమ్‌లో శాలిని. ఆమె ఒక స్టోరీ రాసి, అందులో నటించడం అంటే చాలా గొప్ప విషయం. ఆమె ఒక డైరెక్టర్‌ను సెలెక్ట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్‌ను ఇంత సక్సెస్ చేయడంలో ఆమే కీలకం. తర్వాత ఆహా ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించింది. ఎంతోమంది కొత్త టాలెంట్‌ను గుర్తించి వాళ్లకు క్రియేటివ్ ఫ్రీడమ్‌ను ఇచ్చింది ఆహా" అని నిర్మాత మహేశ్వర్ రెడ్డి అన్నారు.
మంచి స్టోరీస్ ఉన్నవాళ్లు
"చాలా తక్కువ బడ్జెట్‌లో తక్కువ టైమ్‌లో మంచి అవుట్‌పుట్ ఇచ్చిన డైరెక్టర్ సర్వాంగ రియల్లీ గ్రేట్. మ్యూజిక్ ఈ సినిమాకు గ్రేట్ ఎసెట్. శాలిని, అభినవ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయి. క్యామ్ (CAM) ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ముగ్గురు వ్యక్తులు. వాళ్లు చంద్ర, అభిలాష్, మహేశ్. కొత్తవాళ్లతో మేము ఫ్రెండ్లీగా సినిమాలు చేయాలనుకుంటున్నాము. మంచి స్టోరీస్ ఉన్నవాళ్లు మమ్మల్ని సంప్రదించండి" అని నిర్మాత మహేశ్వర్ రెడ్డి అనౌన్స్ చేశారు.
కథ రాసి యాక్ట్ చేయడం
"ఇది నా ఫస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్. అభినవ్ అన్న నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ లాగా శాలినీ తనే కథ రాసి యాక్ట్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఇందులో యాక్ట్ చేసిన వాళ్లలో ఒక్కరి నుంచి ఒక్కో విషయం నేర్చుకున్నా. నాలాంటి కొత్త నటుడిని నమ్మినందుకు ఆహాకు థ్యాంక్స్" అని నటుడు నిఖిల్ గాజుల తెలిపాడు. అంటే, సిద్ధు జొన్నలగడ్డ, అడవి శేష్ తరహాలోనే హీరోయిన్ శాలిని తానే సొంతగా కథ రాసి, మై డియర్ దొంగ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్
"డైరెక్టర్ కష్టం అంతా ట్రైలర్‌లో కనిపిస్తోంది. శాలినీ రైటింగ్ చాలా బాగుంది. దివ్య శ్రీపాదతో కలిసి నటించడం నా అదృష్టం. ఏప్రిల్ 19న మై డియర్ దొంగను ఆహాలో చూసి ఆనందించండి" అని నటి స్నేహల్ చెప్పారు.
టాపిక్