Kalki 2898 AD Remuneration: కల్కి కోసం ప్రభాస్, దీపికా పడుకొణ్, కమల్, అమితాబ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే..
Kalki 2898 AD - Prabhas Remuneration: భారీ బడ్జెట్‍తో కల్కి 2898 ఏడీ సినిమా రూపొందింది. ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్, దీపికా, అమితాబ్ ఎంత రెమ్యూనషన్ తీసుకున్నారో సమాచారం బయటికి వచ్చింది.
Kalki 2898 AD Movie: భారతీయ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ రూపొందుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాను సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. భారత పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ కోసం ప్రధాన నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు బయటికి వచ్చాయి.
రెమ్యూనరేషన్లు ఇలా..
కల్కి 2898 ఏడీ సినిమా కోసం హీరో ప్రభాస్ సుమారు రూ.100కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి స్ఫూర్తితో ఈ చిత్రంలో ప్రభాస్ పోషించిన భైరవ పాత్రను నాగ్ అశ్విన్ సృష్టించారని తెలుస్తోంది. ఈ మూవీలో సూపర్ హీరోగా కనిపించనున్నారు డార్లింగ్.
కల్కి చిత్రంలో తమిళ సీనియర్ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ నటించారు. ఈ మూవీ కోసం ఆయన రూ.50కోట్లు అందుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ రూ.10కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రం అశ్వాత్థమ పాత్ర చేశారు. ఈ సినిమా కోసం ఆయన రూ.10కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
బడ్జెట్ ఇలా..
కల్కి 2898 ఏడీ సినిమాలో రెమ్యూనరేషన్లు, భారీ సెట్లు, వీఎఫ్‍ఎక్స్‌కు ఎక్కువగా ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం మొత్తం రూ.600కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం. అయితే, ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్, లుక్‍లు చూస్తే పెట్టిన బడ్జెట్‍కు తగ్గట్టే నాగ్ అశ్విన్ అద్భుతమైన ఔట్‍పుట్ తెచ్చినట్టు అర్థమవుతోంది.
కల్కి 2898 ఏడీ సినిమా కోసం బుజ్జి అనే స్పెషల్ కారును కూడా మూవీ టీమ్ తయారు చేయించింది. ఫ్యుచరిస్టిక్‍గా ఉన్న ఈ కారు చాలా ప్రత్యేకతలతో ఉంది. ఇటీవలే దీన్ని ప్రపంచానికి ఓ ఈవెంట్ ద్వారా పరిచయం చేసింది మూవీ టీమ్. బుజ్జికారును ఆ ఈవెంట్లో నడిపారు ప్రభాస్. భైరవ, బుజ్జి గ్లింప్స్ వీడియో కూడా ఆకట్టుకుంది.
కల్కి 2898 ఏడీ సినిమా బడ్జెట్ ప్రీ-రిలీజ్ బిజినెస్‍తోనే నిర్మాతలకు వచ్చేయనుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 27న ఈ మూవీ గ్లోబల్ రేంజ్‍లో రిలీజ్ కానుండగా.. పాజిటివ్ టాక్ వస్తే రూ.1000కోట్ల కలెక్షన్ల మార్కును సులువుగా దాటే అవకాశం కనిపిస్తోంది.
కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్ల జోరు పెంచేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా డిఫరెంట్‍గా ప్రమోషన్లను చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే బుజ్జి కారును దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ప్రదర్శించాలని అనుకుంటోంది. ట్రైలర్ లాంచ్ కోసం కూడా ఈవెంట్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓటీటీలో ప్రిల్యూడ్
కల్కి 2898 ఏడీ నుంచి యానిమేషన్ ప్రిల్యూడ్ వస్తోంది. బుజ్జిభైరవ పాత్రలను పరిచయం చూస్తూ ఇది రూపొందింది. మే 31వ తేదీన ఈ యానిమేషన్ వీడియో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రానుంది.