చర్మ ఆరోగ్యం పెంచే.. సహజ సిద్దమైన మేకప్ రిమూవర్లు..

freepik

By Koutik Pranaya Sree
Jun 28, 2024

Hindustan Times
Telugu

బయట మార్కెట్లో దొరికే రసాయనాలున్న మేకప్ రిమూవర్ బదులు, ఇంట్లో సహజంగానే మేకప్ తొలగించే పదార్థాలున్నాయి.. 

freepik

రోజ్ వాటర్+ జొజొబా నూనె.. ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి ముఖానికి రాస్తే మేకప్ తొలిగిపోతుంది. 

freepik

పాలు+తేనె.. కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని టవెల్‌తో తుడుచుకుంటే మేకప్ తొలిగిపోతుంది. 

freepik

కీరదోస రసాన్ని ముఖానికి మర్దనా చేసి తుడిచేస్తే మేకప్ తొలిగిపోతుంది. చర్మం కూడా తేమగా మారుతుంది. 

freepik

రసాయనాల ప్రభావం చర్మం మీద పడొద్దంటే.. మేకప్ తొలగించడానికి గాఢత తక్కువుండే  బేబీ షాంపూ లేదా బేబీ ఆయిల్ వాడండి. చాలా బాగా పనిచేస్తాయి. 

freepik

కలబంద గుజ్జు లేదా అలోవెరా జెల్,  ఆలివ్ నూనె సమపాళ్లలో కలిపి ముఖానికి మర్దనా చేయాలి. మేకప్ సులువుగా వదులుతుంది. 

ఒక గాజు సీసాలో పేపర్ టవెళ్లు వేసి అవి మునిగేంత వరకు..  ఆలివ్ నూనె, నీళ్లు, ఏదైనా ఎసెన్షియల్ నూనె రెండు మూడు చుక్కలు వేయాలి.  మేకప్ రిమూవర్ వైప్స్ రెడీ అయినట్లే. వీటితో మేకప్ తుడిచేస్తే సరి..

pexels

దోమల నివారణకు ఇంట్లోని వివిధ మూలల్లో మస్కిటో కాయిల్స్ పెట్టడం అలవాటు. దీని నుండి వచ్చే పొగ దోమలను నియంత్రిస్తుంది.

Unsplash