NNS September 6th Episode: మనోహరి ప్లాన్ ఫెయిల్- భాగీ వార్నింగ్- ఆశ్రమంలో పిల్లలు, అమర్​- లాయర్ గొంతు పట్టిన రణ్‌వీర్-nindu noorella saavasam serial september 6th episode manohari plan fail to picnic nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns September 6th Episode: మనోహరి ప్లాన్ ఫెయిల్- భాగీ వార్నింగ్- ఆశ్రమంలో పిల్లలు, అమర్​- లాయర్ గొంతు పట్టిన రణ్‌వీర్

NNS September 6th Episode: మనోహరి ప్లాన్ ఫెయిల్- భాగీ వార్నింగ్- ఆశ్రమంలో పిల్లలు, అమర్​- లాయర్ గొంతు పట్టిన రణ్‌వీర్

Sanjiv Kumar HT Telugu
Sep 06, 2024 11:12 AM IST

Nindu Noorella Saavasam September 6th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 6వ తేది ఎపిసోడ్‌‌లో పిక్నిక్ వెళ్లకుండా అడ్డుకుందామనుకున్న మనోహరి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ప్లే చేయకని మనోహరికి భాగీ వార్నింగ్ ఇస్తుంది. అంతా అనాథాశ్రమంలోకి వెళ్తారు.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 6వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 6వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 6th September Episode) అమర్​ పిక్నిక్​‌కు వెళ్లడానికి అందరూ రెడీ అవ్వమని చెప్పడంతో ఎలాగైనా ప్రోగ్రామ్​ చెడగొట్టాలనుకుంటుంది మనోహరి. అంజుని కింద పడేద్దామనుకుంటుంది. కానీ, అది అంతగా వర్కౌట్​ అవదని ఆకాష్​ని ఎంచుకుంటుంది.

అయితే ఆకాష్‌ను కింద పడేయబోయి.. తానే కింద పడిపోతుంది మనోహరి. దీంతో అమర్‌ పిక్నిక్‌ క్యాన్సిల్‌ చేసి మనోహరిని తీసుకుని హాస్పిటల్‌‌కు వెళ్లబోతుంటే రాథోడ్‌‌కు భాగీ సైగ చేస్తుంది. దీంతో రాథోడ్‌ నేను మనోహరిని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తానని.. మీరంతా పిక్నిక్‌ కు వెళ్లండని చెప్తాడు. ఇదేంటి కథ అడ్డం తిరగింది.

మనోహరి ఛీప్ ట్రిక్స్

వీళ్లిద్దరిని కలవకుండా చేద్దామని అనుకుంటే ఇలా జరుగుతుందేంటి? అని మనసులో అనుకుని మెల్లగా లేచిన మనోహరి ఇక నాకు బాగానే ఉందని, హాస్పిటల్‌‌కు ఎందుకని, నేను కూడా మీతో పాటు పిక్నిక్‌‌కు వస్తానని చెప్తుంది. దీంతో అమర్‌ సరే అని బయటకు వెళ్లిపోతాడు.

ఏంటీ మేమే బయటకు వెళ్లితే మా బంధం బలపడుతుందని భయపడుతున్నావా? అందుకే ఇలాంటి ఛీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తున్నావా? అయ్యో పిచ్చి మను. మా మధ్య బ్రహ్మముడి పడ్డప్పుడే మా బంధం బలపడిపోయింది. ఆయన ప్రేమకి నేను అర్హురాలినో కాదో నాకు తెలియదు. కానీ, నువ్వింకో పది జన్మలు ఎత్తినా ఆయన నీడను కూడా తాకలేవు అని మనోహరికి వార్నింగ్​ ఇస్తుంది భాగీ.

గుప్త గారు.. వాళ్లు బయటకు వెళ్లొద్దంటే ఆగడం లేదు. వెళితే ఏం జరుగుతుందో చెప్పమంటే మీరు చెప్పడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అని అరుంధతి అడగ్గానే గుప్త మాయం అయిపోతాడు. దాంతో షాక్‌ అయిన అరుంధతి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని కంగారుపడుతుంది. మరోవైపు రణ్​వీర్​ తాగుతూ ఉండగా లాయర్ వచ్చి ఇంకా తాగుతూనే ఉంటావా? అని అడుగుతాడు.

లాయర్ గొంతుపట్టుకుని

మనోహరి నీ జీవితంలో ముగిసిపోయిన చాప్టర్‌ అని అని లాయర్ చెప్తాడు. దీంతో లాయర్‌ గొంతు పట్టుకుని నేను మర్చిపోను అంటాడు. రూంలోకి తీసుకెళ్లి తన కూతురు ఫోటో చూపించి ఎమోషనల్‌ అవుతాడు రణ్​వీర్​. ఏంటి రణ్​వీర్ నీకు కూతురు ఉందా? నువ్వు ఇన్నాళ్లుగా వెతుకుతుంది నీకు మనోహరికి పుట్టిన కూతురి కోసమా? అంటాడు లాయర్​.

అవును ఆ మనోహరి మనిషి కాదు. నా బిడ్డను నా నుంచి దూరం చేసిన రాక్షసి. అందుకే అది కనబడగానే చంపాలని చూశాను. కానీ, నా కూతురుకు జన్మనిచ్చి అది ఆయుష్సు పోసుకుంది అంటూ ఏడుస్తూ తన కూతురును గుర్తు చేసుకుంటాడు రణవీర్‌. తన బిడ్డతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తాడు. దీంతో లాయర్‌ ఎమోషనల్​ అవుతాడు.

అందరూ కారులో పిక్నిక్‌ కు వెళ్తుంటారు. అంజు వెటకారంగా భాగీతో మాట్లాడుతుంది. వెనక కారులో మనోహరి, శివరాం, నిర్మల వస్తుంటారు. అందులో అరుంధతి కూర్చుని మనోహరిని తిడుతుంది. ఇంతలో కారు అమ్మ అనాథ శరణాలయం దగ్గర వచ్చి ఆగుతుంది. అదేంటి అమర్‌ పిక్నిక్‌ అని ఇక్కడికి తీసుకొచ్చి ఆగావు అంటాడు శివరామ్.

ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా

ఇది ఆరుంధతి, మనోహరి పెరిగిన ఆశ్రమం నాన్నా.. పిక్నిక్‌‌కు వెళ్లేముందు ఎందుకో ఇక్కడికి ఒకసారి రావాలనిపించింది అంటాడు అమర్​. మంచి పని చేశావు అమర్‌. పాపం ఆ పిల్లలను చూస్తుంటే మనసు ఎందుకో బాధగా ఉంది అంటుంది నిర్మల. ఎలాగూ వచ్చాం కదా అమర్‌ వాళ్లకు స్వీట్లు, చాక్లెట్స్‌ తీసుకొచ్చి ఉంటే బాగుండు అంటాడు శివరామ్​.

ఆల్‌రెడీ తీసుకొచ్చాను నాన్నా అని రాథోడ్‌ని పిలుస్తాడు. స్వీట్స్‌, ప్రూట్స్‌ తీసుకురావడానికి రాథోడ్ వెళ్తాడు. శివరాంను చూసి రాథోడ్‌ ఇక్కడికి వస్తారని ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు కదా? అందుకే ఇలాంటిదేదో వస్తుందని కారులో ఒక ప్యాంటు తీసి పెట్టాను వేసుకోండని చెప్పగానే శివరాం వెళ్లి ప్యాంటు వేసుకుంటాడు.

తర్వాత లోపలికి వెళ్లాక భాగీకి వాళ్ల అక్క గుర్తుకు వస్తుంది. ఎమోషనల్‌‌గా ఫీలవుతుంది. అనాథాశ్రమంలో ఏం జరగబోతోంది? రణ్​వీర్​ కూతురు ఎవరు? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్​ 07న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!