NNS August 12th Episode: ​​​​​మనోహరి కాదు మనోరమ- పెద్ద షాకిచ్చిన రణ్​వీర్​- మిస్సమ్మకు డౌట్- ఆలోచనలో ఆరు- వణికిపోయిన మను-nindu noorella saavasam serial august 12th episode ranveer big shock to manohari nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns August 12th Episode: ​​​​​మనోహరి కాదు మనోరమ- పెద్ద షాకిచ్చిన రణ్​వీర్​- మిస్సమ్మకు డౌట్- ఆలోచనలో ఆరు- వణికిపోయిన మను

NNS August 12th Episode: ​​​​​మనోహరి కాదు మనోరమ- పెద్ద షాకిచ్చిన రణ్​వీర్​- మిస్సమ్మకు డౌట్- ఆలోచనలో ఆరు- వణికిపోయిన మను

Sanjiv Kumar HT Telugu
Aug 12, 2024 05:38 AM IST

Nindu Noorella Saavasam August 12th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 12వ తేది ఎపిసోడ్‌‌లో తన ఇంటికి వచ్చిన రణ్‌వీర్‌ను మీరు వెతుకుతున్న భార్య మా ఇంట్లో ఉందేమో అని మనోహరిని పిలిపిస్తాడు. అప్పుడు తన భార్య మనోరమ అని రణ్‌వీర్ చెబుతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 12వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 12వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 12th August Episode) అమర్​ ఇంటికి వచ్చిన రణ్​వీర్​ క్షమించమని కోరతాడు. అలాంటి తప్పు మరోసారి జరగకుండా జాగ్రత్త పడతానంటూ మాటిస్తాడు. సరే అని క్షమిస్తాడు అమర్​. మీరు నన్ను కలవడానికి జైలుకి వస్తున్నారని అన్నారు దేనికో తెలుసుకోవచ్చా? అంటాడు రణ్​వీర్​.

షాక్ అయిన మనోహరి

అవును.. మా ఇంట్లో ఒక మనోహరి ఉంది. మీరు వెతుకుతున్న మీ భార్య ఆమెనా అని తెలుసుకుందామని అంటాడు అమర్​. ఒకసారి పిలిపించండి చూసి చెబుతాను అంటాడు రణ్​వీర్​. భాగీ లోపలకు వెళ్లి మనోహరిని పిలుచుకుని వస్తుంది. మనోహరి గతం బయటపడబోతోందని సంబరపడుతుంది అరుంధతి. అమర్​ ఎందుకు పిలిచాడో అర్థంకాక బయటకు వచ్చిన మనోహరి రణ్​వీర్​ని చూసి షాకవుతుంది.

మొత్తం చెప్పేసి ఉంటాడా? నా కష్టం మొత్తం వృథా అయిపోయిందా? అని కంగారుపడుతుంది మనోహరి. ముందుకు రమ్మని మీరు వెతుకుతున్నది ఈ మనోహరినేనా అంటాడు అమర్​. నేను వెతుకుతున్న నా భార్య మనోహరి ఈమె అంటాడు రణ్​వీర్​. కానీ, వెంటనే మాట మార్చి నా భార్య ఈమె కాదు. నా భార్య పేరు మనోరమ అంటాడు.

ప్రాణం ఇచ్చేంత ఇష్టం

అదేంటీ.. ఇప్పటివరకు మనోహరి అన్నాడు. ఇప్పుడు మనోరమ అంటున్నాడు అని అనుమానపడుతుంది భాగీ. సరే లోపలకు వెళ్లి మాట్లాడుకుందాం అంటాడు అమర్​. అందరూ ఇంట్లోకి వెళ్తారు. అమర్​ తన తల్లిదండ్రులను రణ్​వీర్​కి పరిచయం చేస్తాడు. మీరు ఇంతగా వెతుకుతున్నారంటే మీకు మీ భార్య అంటే ఎంత ఇష్టమో అంటాడు శివరామ్​. అవునండీ.. ప్రాణం ఇచ్చేంత ఇష్టం అంటాడు రణ్​వీర్​.

మీ కుటుంబాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది అంటూ మనోహరి వైపు చూస్తాడు. అసలు రణ్​వీర్​ ఎందుకు అబద్ధం చెప్పాడో అర్థంకాక ఆలోచనలో పడుతుంది మనోహరి. అసలేం జరుగుతోంది గుప్తగారు.. రణ్​వీర్​, మనోహరి పెళ్లి ఫొటోని నేను కళ్లారా చూశాను, మనోహరి స్వయంగా రణ్​వీరే తన భర్త అనడం విన్నాను అంటుంది అరుంధతి.

బాధను అనుభవించాల్సిందే

అతను రూటు మార్చి తన భార్యను తన వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అని వివరంగా చెబుతాడు గుప్త. ఆ బాలుడు ఆ బాలికతో ఆడుతున్న ఆట చాలా భయంకరమైనది, మానసికంగా ఆ బాలికను కృంగిపోయేలా చేస్తాడు అంటాడు. మనో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ బాధను అనుభవించి తీరాల్సిందే అంటుంది అరుంధతి.

ఈమె నా భార్య కాదని తేలిపోయింది మరి మీకేమవుతుందో చెప్పలేదు అంటాడు రణ్​వీర్​. తన నా భార్య ఫ్రెండ్​ అంటాడు అమర్. అంటే.. ఆమె ఈ ఇంటికి అతిథి అన్నమాట. కొన్నాళ్లకు తను ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే వెళ్తుందన్న మాట అంటాడు రణ్​వీర్​. తను కూడా మా కోడలులా అనాథ. తనకి ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు వెళ్తుంది అంటుంది నిర్మల.

వణికిపోయిన మనోహరి

మనోహరిని భయపెట్టేందుకు కావాలనే తనని తను పరిచయం చేసుకుని ఎప్పుడైనా కోల్​కత్తాకి వచ్చారా అంటూ వివరాలు అడుగుతాడు రణ్‌వీర్. ఒక్కో ప్రశ్నకి వణికిపోతుంది మనోహరి. ఆరోజు పార్టీలో నా వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడితే క్షమించండి అంటాడు రణ్​వీర్​. అందరికీ చెప్పారు కదా.. మళ్లీ ఎందుకు అంటుంది భాగీ.

అందరికీ చెప్పినట్లు మనోహరి గారికి చెబితే ఎలా? తను ఎంతైనా నా భార్య కదా.. అంటాడు రణ్​వీర్​. అందరూ ఆశ్చర్యపోతారు. రణ్​వీర్​ ప్లాన్​ ఏంటి? మనోహరి రణ్​వీర్​ బారి నుంచి తప్పించుకోడానికి ఏం చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఆగస్టు 13న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!