NNS July 30th Episode: అరుంధతి డైరీ చదివిన అమర్.. మనోహరి కుట్ర బట్టబయలు.. భాగీతో మాటల యుద్ధం.. పాపిగా అరుంధతి ఆత్మ
Nindu Noorella Saavasam July 30th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 30వ తేది ఎపిసోడ్‌లో అరుంధతి రాసిన డైరీలోని చివరి పేజీని అమర్ చదివినట్లు చూపించారు. దాంతో కోపంగా కిందకు దిగిన అమర్ మనోహరి కనపడగానే అరుస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 30th July Episode) దిగులుగా కూర్చున్న అమర్ దగ్గరకు వచ్చి నేనంటూ మిమ్మల్ని వదిలి వెళ్లడం అంటూ జరిగితే ఆ మనోహరి గురించి మీకు తెలిసిన తర్వాతే.. మనోహరి చేసిందంతా ఆ డైరీలో రాశాను. ఒక్కసారి చదవండి అంటుంది అరుంధతి.
ఆఖరీ పేజీ చదవండి
ఎదురుగా ఉన్న ఆరు డైరీ చూసి గతాన్ని తలుచుకుంటాడు అమర్. తన జీవితంలో పర్సనల్ అంటూ ఏం లేదని, ప్రాణాలతో ఉన్నంత వరకూ తనకు సంబంధించిన ప్రతీది మీకు తెలియాలి అని అరుంధతి డైరీ చదివి వినిపించడం గుర్తు చేసుకుంటాడు. అప్పుడే ఎదురుగా ఉన్న అరుంధతి డైరీ కనిపించి చేతిలోకి తీసుకుంటాడు. ఆఖరిపేజీ చదవండి.. ఆ మనోహరి చేసిన మోసం మీకు తెలుస్తుంది అంటుంది అరుంధతి.
అనంతరం డైరీలో ఉన్న చివరి పేజీ చదువుతాడు అమర్. డైరీలో అరుంధతి రాసిన విషయాన్ని చదివిన అమర్ కోపంతో కిందకి వెళ్తాడు. అమర్ వెంటే పరిగెడుతుంది అరుంధతి. మనోహరి కారు దిగుతుంది. ఆగు మను.. అని గట్టిగా అంటుంది అరుంధతి. తనని ఎవరో పిలిచినట్లు అనిపించి ఆగుతుంది మనోహరి.
తప్పులు బయయపడే టైమ్
నిన్ను నమ్మి నేను తప్పు చేశాను. అందుకే ఆ దేవుడు నాకు చావు రూపంలో శిక్ష వేశాడు. కానీ, నీ తప్పులు బయటపడే టైమ్ వచ్చింది. మా ఆయన నేను రాసింది చదివేశారు. ఇప్పుడు నువ్వు లోపలకు వెళ్లగానే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటుంది. ఏయ్.. అరుంధతి.. ఆపవే.. నువ్వు ఇక్కడే ఉన్నావని నన్ను బాగా తిట్టుకుంటున్నావని అర్థమైంది అని మనోహరి అంటుంది.
నువ్వు ఎన్ని మాటలన్నా నాకు వినిపించవు. కానీ, ఒకటి చెబుతున్నా విను. నీకు చివరి ముహుర్తం పెట్టేశాను. ఆ ఘోరాకు నీ అస్థికలు అప్పజెప్పాను. రేపు ఈ టైమ్‌కి నీ ఆత్మ వాడి చేతిలో బంధీ అవుతుంది. వాడు చేయించే పాపాలు చేసి నువ్వూ పాపిగా మారిపోతావు అంటుంది మనోహరి. వినాశకాలే విపరీత బుద్ధి.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు అంటుంది అరుంధతి.
నీ పాపం పండే రోజు
నా దారిలో ఎవరు వచ్చినా నీ గతే పడుతుంది. నువ్వు అడ్డొచ్చావు చచ్చావు. ఇప్పుడు నా మొగుడు అడ్డొస్తున్నాడు చస్తాడు అంటుంది మనోహరి. అరుంధతి పిలుస్తున్నా వినిపించుకోకుండా లోపలకు వెళ్తుంది మనోహరి. నీ మెడలో తాళి కట్టినవాడు నిన్ను చంపడానికి తిరుగుతున్నాడు. నన్ను చంపి మా ఆయనతో నీ మెడలో తాళి కట్టించుకోవాలనుకున్నావు. నీ పాపం పండే రోజు దగ్గర్లోనే ఉంది మనోహరి అంటుంది అరుంధతి.
హాల్లో ఉన్న భాగీని చూసి నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో చూస్తాను అంటూ దగ్గరకు వెళ్లి పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయినట్లున్నావు అంటుంది మనోహరి. అలిసిపోయానేమోగానీ ఆగిపోలేదు అంటుంది భాగీ. నీది కాని యుద్ధాన్ని నువ్వెందుకు చేస్తున్నావు అంటుంది మనోహరి. ఈ కుటుంబం నాది నా కుటుంబానికి ఏ సమస్య వచ్చినా అది నాదే అంటుంది భాగీ.
ఎన్నిసార్లు కలుపుకుంటారో
పాపం అని వదిలేద్దామనుకున్నానే కానీ అమర్ చేత ఛీ కొట్టించనిదే నీకు బుద్ధివచ్చేలా లేదు అంటుంది మనోహరి. ఎవరిని పక్కన పెట్టారో ఎవరిని పక్కనుంచుకున్నారో తెలుస్తూనే ఉందిగా. అక్క అస్థికలకు ఏదైనా అయ్యిందో నీ సంగతి చెబుతాను అంటుంది భాగీ. హే.. ఆ అస్థికల్ని ఎక్కడ కలుపుకుంటారో ఎన్నిసార్లు కలుపుకుంటారో మీ ఇష్టం అంటూ చిరాగ్గా అక్కడనుంచి వెళ్లబోతుంది మనోహరి.
ఆగు మనోహరి అని అరుస్తాడు అమర్. అమర్ పిలుపుతో కంగారుపడుతుంది మనోహరి. చేతిలో డైరీతో కిందకి దిగుతున్న అమర్‌ని చూసి నిజం తెలిసిపోయిందా అని భయపడుతుంది. ఆయనకి నిజం తెలిసిపోయింది మను.. ఇక నువ్వు తప్పించుకోలేవు అంటుంది అరుంధతి.
నిజంగానే తెలిసిపోయిందా?
అమర్ ఏం చేయబోతున్నాడు? నిజంగానే అమర్‌కు మనోహరి నిజం తెలిసిపోయిందా? మనోహరి అమర్‌ని మళ్లీ మోసం చేస్తుందా? అనే విషయాలు తెలియాలంటే జులై 31న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!