NNS July 25th Episode: ఇంట్లో దొంగల అరుంధతి.. భాగీకి అనుమానం.. డైరీ చదవనున్న మిస్సమ్మ.. ఘోరాతో మనోహరి మంతనాలు
Nindu Noorella Saavasam July 25th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 25వ తేది ఎపిసోడ్‌లో ఇంట్లో దొంగల అరుంధతి నడుస్తూ ఉంటుంది. నిర్మల పక్క నుంచి వెళ్తుంది. కానీ, అరుంధతితో మాట్లాడదు. అది చూసిన భాగీకి అనుమానం వస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 25th July Episode) ఘోరా ఇచ్చిన తాయత్తుని తీసి విసిరేయడంతో భాగీపై అరుస్తుంది మనోహరి. కానీ, అలాంటి పిచ్చి పనులు చేస్తే ఇంకోసారి మాటలతో సమాధానం చెప్పను అంటూ మనోహరికి వార్నింగ్ ఇస్తుంది భాగీ.
తప్పెక్కడ జరుగుతుందో
షాకై నిల్చుని చూస్తున్న మనోహరిని చూసి నువ్వు నన్ను బయటకు పంపించడానికి ఎన్ని చేసినా నాకు నా చెల్లి ఉంది అంటుంది అరుంధతి. ఘోరాను కలిసి జరిగిందంతా చెబుతుంది మనోహరి. పేగుబంధం, రక్తబంధం కలిసి నన్ను మళ్లీ ఓడించాయి. ఆత్మ విషయంలో నా ప్రయత్నం ప్రతీసారి విఫలమవుతుంది. అసలు తప్పెక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు అంటాడు ఘోరా.
తప్పు ఎక్కడ జరిగిందో ఆలోచిస్తూ కూర్చోవడం కంటే ఆ అస్థికలు దక్కించుకుంటే దాన్ని పట్టుకోవచ్చు. కానీ, ఆ భాగీ ఇంట్లో ఉండగా అస్థికలను కనుక్కోలేం అంటుంది మనోహరి. అమర్ ఆ అస్థికల్ని నదిలో కలిపే కార్యక్రమం మొదలు పెట్టకముందే వాటిని దక్కించుకోవాలి అంటుంది. ఆ ఆత్మని నేను పొందకపోతే నేను బలవంతున్ని కావాలనే కోరిక, నువ్వు అమర్‌ని పెళ్లి చేసుకోవాలనే ఆశ ఎప్పటికీ అలాగే మిగిలిపోతుంది అంటాడు ఘోరా.
అస్థికల్ని దక్కించుకోవాలి
లేదు.. అలా జరగడానికి వీల్లేదు. అమర్ ఆ భాగీకి దగ్గర కావడం నేను తట్టుకోలేకపోతున్నా. ఎలాగైనా ఇవాళే ఆ లాకర్ కీస్ ఎక్కడున్నాయో కనుక్కుని అస్థికల్ని దక్కించుకోవాలి అంటుంది మనోహరి. ఈరోజు నిన్ను దక్కించుకుంటానంటూ గట్టిగా నవ్వుతాడు ఘోరా. మరోవైపు అరుంధతి మెల్లిగా హాల్లో నడుస్తుండటం చూస్తుంది భాగీ. అక్క నాకోసమే వచ్చినట్లుంది అనుకుంటుండగానే నిర్మల అటుగా వెళ్తుంది.
అదేంటి.. అత్తయ్య అసలు అక్కడ అక్క లేనట్లుగానే వెళ్లిపోయారు. ధైర్యంగా రావాల్సిన అక్కేంటి దొంగలా నక్కుతూ వస్తోంది అని ఆశ్చర్యపోతుంది. అరుంధతి మెల్లిగా పిల్లల దగ్గరకు వెళ్తుంది. పిల్లలు హోంవర్క్ చేస్తూ ఉంటారు. అంజుకి ఏం రాదని ఏడిపిస్తూ ఉంటారు. తలుపు చాటున నిల్చుని పిల్లల్ని చూస్తున్న అరుంధతిని చూసి షాకవుతుంది భాగీ. మెల్లిగా తనకు దగ్గరగా వెళ్లి ముట్టుకోడానికి ప్రయత్నిస్తుంది.
కన్‌ఫ్యూజ్ చేయాలి
కానీ, అరుంధతి వెంటనే పక్కకు తప్పుకుంటుంది. అక్కా.. అంటూ మాట్లాడబోయిన భాగీని ఆపి పిల్లలు చదువుకుంటున్నారు. మనం బయట మాట్లాడుకుందామని అక్కడ నుంచి లాన్లోకి పరిగెడుతుంది అరుంధతి. మిస్సమ్మ అంతా చూసేసింది ఇప్పుడెలా.. ఎలాగైనా మిస్సమ్మని కన్విన్స్ చేయాలి లేకపోతే కన్ప్యూజ్ చేయాలి అనుకుంటుంది.
అసలు మీరు ఇంట్లోకి అలా దొంగలా ఎందుకు వచ్చారు. మా అత్తయ్య మిమ్మల్ని చూసి కూడా ఎందుకు పలకరించలేదు? పిల్లల్ని అలా దాక్కుని ఎందుకు చూస్తున్నారు? అని అడుగుతుంది మిస్సమ్మ. అంటే.. నీకోసం వెతుకుతూ వచ్చాను. మీ అత్తయ్యకి నాకు పడదు అందుకే కనపడినా కనపడనట్లు పోతుంది. అమ్ము, మా పాప ఒకటే క్లాసు.. తనకి నోట్స్ కావాలంటే వచ్చాను. కానీ, పిల్లలు చదువుకుంటున్నారని డిస్టర్బ్ చేయలేదు అని చెబుతుంది అరుంధతి.
ఆమెను మర్చిపోయాడా
అది సరేగానీ.. అంటూ మళ్లీ ఏదో అడగబోయిన మిస్సమ్మను ఆపి ఇంతకీ ఉన్నట్లుండి గుడికి వెళ్లారు అని అడుగుతుంది. దాంతో సిగ్గుపడుతుంది భాగీ. సిగ్గుపడింది చాలుగానీ.. అత్తయ్య, మామయ్య నిన్ను, ఆయన్ని కలపడానికి గుడికి తీసుకెళ్లి పూజలు చేయించారు అంతేగా అంటుంది అరుంధతి. అవునక్కా అని మిస్సమ్మ అనగానే.. అయినా ఆయన భార్య చనిపోయి కొన్నిరోజులే అయ్యింది కదా.. అప్పుడే ఆయన ఆమెను మర్చిపోయాడా అని అడుగుతుంది.
నిజమే అక్కా.. నేను ఎప్పటికీ అక్క ప్లేస్‌ని భర్తీ చేయలేను. ఆయన జీవితంలో ఎప్పటికీ అక్క ఉంటుంది. నేను ఇష్టపడేది ఆయనని మాత్రమే కాదు. ఆయనలోని ప్రతి లక్షణాన్ని అంటుంది మిస్సమ్మ. నిన్ను పట్టుకుని తనివితీరా ఏడవాలనుంది మిస్సమ్మ అనుకున్న అరుంధతి డైరీ గురించి గుర్తుచేసి ఒకసారి చదవమని చెబుతుంది.
డైరీ ఎవరి చేతికి
నిజమే అక్కా.. తప్పకుండా చదువుతా అంటూ ఇంట్లోకి వెళ్తుంది మిస్సమ్మ. మనోహరి గురించి తెలిసేలా చేయి స్వామి అని దేవున్ని వేడుకుంటుంది అరుంధతి. రూమ్‌లోకి వెళ్లిన మిస్సమ్మ టేబుల్ మీద ఉన్న డైరీని తీసుకోబోతుండగా నిర్మల పిలుస్తుంది. అరుంధతి డైరీ ఎవరి చేతికి దొరుకుతుంది? డైరీ కోసం మనోహరి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే జులై 26న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!