NNS July 16th Episode: పూజారిని అరుంధతి గురించి అడిగిన భాగీ.. పొరపాటు పడిన అమర్.. మళ్లీ మిస్సయిన మిస్సమ్మ!
Nindu Noorella Saavasam July 16th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 16వ తేది ఎపిసోడ్‌లో ఇంటికి వచ్చిన పూజారిని అరుంధతి గురించి అడుగుతుంది భాగీ. కానీ, శివరామ్ సైగ చేయడంతో అరుంధతి చనిపోయిన విషయం చెప్పడు పంతులు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 16th July Episode) అరుంధతి చావుతో ఇల్లు కోల్పోయిన సంతోషాన్ని మిస్సమ్మ మళ్లీ తీసుకొచ్చిందని, అరుంధతే మళ్లీ మిస్సమ్మ రూపంలో తమ ఇంటికి కోడలుగా వచ్చిందని అంటాడు శివరామ్.
ఆమెను చూడాలని ఉంది
అసలేమాత్రం పరిచయం లేని ఇద్దరు ఒకేలా ఎలా ఆలోచించగలరో, ప్రేమించగలరో అర్థం కావట్లేదంటాడు. ఏ జన్మలోనో రక్తసంబంధం ఉండి ఉంటుంది, ఆ రుణాన్ని ఈ జన్మలో ఇలా తీర్చుకుంటుందేమో అంటాడు పంతులు. ఇంతగా మీరిద్దరూ మీ కోడలు గొప్పతనం గురించి చెబుతున్నారంటే ఒకసారి ఆమెను నాకు చూడాలనిపిస్తుంది అంటాడు.
అప్పుడే మిస్సమ్మ కాఫీ తీసుకుని రావడంతో అదిగో.. ఆమే మా కోడలు అని చూపిస్తాడు శివరామ్. పంతులు, మిస్సమ్మ ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోతారు. కొడైకెనాల్లో కలిశామని ఇద్దరూ గుర్తు చేసుకుంటారు. అసలు మీ ఇద్దరికీ ఎలా పరిచయం అని అడగడంతో జరిగిందంతా చెబుతుంది మిస్సమ్మ. ఎక్కడ పంతులు అరుంధతి చనిపోయిన విషయం మిస్సమ్మకు చెబుతాడోనని కంగారు పడతారు శివరామ్, నిర్మల.
బాధపడతావని చెప్పలేదు
మరోవైపు పంతులు మిస్సమ్మకు నిజం చెప్పకముందే ఇంటికి వెళ్లి ఆపాలని రాథోడ్‌ని త్వరగా పోనిమ్మంటాడు అమర్. ఇంతలో అరుంధతి గురించి భాగీ అడుగుతుంది. మిస్సమ్మకు నిజం తెలిసిపోయేలా ఉందని కంగారు పడుతుంది అరుంధతి. కానీ, శివరామ్ సైగ చేయడంతో అమర్ అరుంధతిని ఎంత ప్రేమగా చూసుకునేవాడో చెప్పి కవర్ చేస్తాడు పంతులు. దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది మిస్సమ్మ.
అప్పుడే వచ్చిన అమర్ బాధపడుతున్న మిస్సమ్మను చూసి నిజం తెలిసిందనుకుంటాడు. తనే నిజం చెప్పాలనుకున్నానని, కానీ బాధపడతావని చెప్పలేదని అంటాడు. రాథోడ్ కోపంగా వెళ్లి పంతులుని కోప్పడతాడు. అసలు మిమ్మల్ని మిస్సమ్మకు నిజం చెప్పమని ఎవరన్నారు అంటాడు. అసలు తాను ఆ అమ్మాయికి నిజం చెప్పలేదంటాడు పంతులు. వెంటనే పరుగున అమర్ దగ్గరకు వచ్చి మిస్సమ్మకు ఏం తెలియదని, చెప్పొద్దని సైగ చేస్తాడు.
ఏదో చెప్పాలనుకుంటున్నారు
కానీ, అమర్ అరుంధతి గురించి చెప్పబోతుండటంతో పరుగున వచ్చి ఆపుతాడు రాథోడ్. ఆయన నాకు ఏదో చెప్పాలనుకుంటున్నారు రాథోడ్.. చెప్పనివ్వు అంటుంది మిస్సమ్మ. ఇద్దరూ కాసేపు అమర్ కోసం పోట్లాడతారు. ఇద్దరినీ ఆపేసి ఏం జరిగింది రాథోడ్ అంటాడు అమర్. లోపల అంతా క్లోజ్‌గానే ఉంది మీరే ఓపెన్ అవుతున్నారు అంటాడు రాథోడ్.
అమర్ ఇంట్లోకి వెళ్లి పంతులుకి కృతజ్ఞతలు చెబుతాడు. అరుంధతి అకాల మరణం, మిస్సమ్మ ఇంటి కోడలు అవడం అంతా దైవనిర్ణయం అంటాడు పంతులు. ఇలా ఎన్నిరోజులు ఆ అమ్మాయికి నిజం తెలియకుండా ఆపుతారు అని అడుగుతాడు. కానీ, ఆ నిజం మిస్సమ్మకు తెలియకపోవడమే మంచిది అమర్.. ఇన్నాళ్లు నువ్వు మిస్సమ్మ దగ్గర నిజం ఎందుకు దాచావో అర్థంకాలేదు, కానీ ఈరోజు మిస్సమ్మ అరుంధతిపై పెంచుకున్న ప్రేమ చూశాక ఎప్పటికీ తెలియకూడదని కోరుకుంటున్నా అంటుంది నిర్మల.
పరమార్థం ఉంటుంది
అసలు వాళ్లిద్దరినీ దేవుడు ఎందుకు కలిపాడు అంటాడు అమర్. ఆ పరమేశ్వరుడి లీలలు మనకు అర్థంకాకపోవచ్చుగానీ పరమార్థం మాత్రం కచ్చితంగా ఉంటుంది. అయినా.. అరుంధతిని ఆ అమ్మాయి చూల్లేదని ఎవరు చెప్పారు. ఆరోజు గుళ్లో అరుంధతిని చూల్లేదు కదా అంటున్న అమర్‌తో గుళ్లో కాదు ఈ ఇంట్లో అంటాడు పంతులు.
అరుంధతి అస్థికలు ఇంకా పుణ్యనదుల్లో కలపలేదు కదా అమర్.. అందుకే ఇంకా అరుంధతి ఇక్కడే ఉందంటున్నారు అంటాడు శివరామ్. నా ఆరు నా చుట్టూనే ఉందా అని ఎమోషనల్ అవుతాడు అమర్. అంటే అస్థికలు కలపకపోతే మా అమ్మగారు ఎప్పటికీ ఇక్కడే ఉంటుందా? అని అడుగుతాడు రాథోడ్. అది సృష్టి విరుద్దం అంటాడు పంతులు. ఓ మంచి ముహూర్తం చూసి అస్థికలు కలిపేద్దామంటాడు అమర్.
కలిపే బాధ్యత నాది
అస్థికలు కలపడంతో పాటు మా సార్‌ని, మిస్సమ్మని కలపడం కూడా అంతే ముఖ్యం అంటాడు రాథోడ్. వాళ్లిద్దరినీ కలిపే బాధ్యత నాదే అంటాడు పంతులు. తన అస్థికలు నదిలో కలపితే శాశ్వతంగా ఈలోకాన్ని వదిలి వెళ్లిపోతాను. ఈ విషయం ఎవరితో చెప్పలేను, వాళ్లని ఆపలేను ఏం చేయాలి అని ఆలోచిస్తుంది అరుంధతి. అప్పుడే వచ్చిన మనోహరిని చూసి అంతా దీనివల్లే అనుకుంటుంది.
ఘోరా ఇచ్చిన తాయత్తుని ఎక్కడ కట్టాలా అని ఆలోచిస్తుంది మనోహరి. ఆ తాయత్తుని చూసిన అరుంధతి అదేంటని కంగారు పడుతుంది. మనోహరి ప్లాన్‌ని పంతులు కనిపెడతాడా? అరుంధతి అస్థికలు మనోహరి చేతికి చిక్కుతాయా? అనే విషయాలు తెలియాలంటే జులై 17న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!