NNS July 17th Episode: నిజం చెప్పేసిన మనోహరి.. ఘోరా ప్లాన్ సక్సెస్.. ఇంటి బయటే అరుంధతి.. రణ్‌వీర్ కొత్త స్కెచ్
Nindu Noorella Saavasam July 17th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 17వ తేది ఎపిసోడ్‌లో మిస్సమ్మ నీ చెల్లెలు అని అరుంధతికి నిజం చెప్పేస్తుంది మనోహరి. కానీ, గుప్తా మాటలు గుర్తుకు వచ్చి వరుసకు చెల్లెలు అవుతుంది అనుకుంటుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 17th July Episode) అరుంధతి అస్థికలను ఓ మంచి ముహుర్తం చూసి పుణ్య నదుల్లో కలుపుదామన్న అమర్ మాటలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది అరుంధతి. అప్పుడే ఘోరా ఇచ్చిన తాయెత్తు, బూడిద తీసుకుని వస్తుంది మనోహరి.
మళ్లీ ఏం చేస్తున్నావ్
అంతా దీనివల్లే అంటూ కోపంగా మనోహరి దగ్గరకు వెళ్తుంది అరుంధతి. కారులో నుంచి తాయత్తు తీసి చేతిలో పట్టుకుని ఘోరా చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటుంది మనోహరి. మనో.. ఏంటే ఇది.. ఏం చేస్తున్నావు మళ్లీ అంటూ కంగారు పడుతుంది అరుంధతి.
ఏంటే ఆరు.. ఇక్కడే ఉన్నావా? నన్ను చూస్తూ ఏం చేస్తున్నానో తెలియక భయపడుతూ ఉన్నావా? కష్టపడి ప్లాన్ చేసి నిన్ను చంపేస్తే మళ్లీ కిందకి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ఏం కావాలే నీకు? అంటుంది మనోహరి. నీ పతనం కావాలి.. మా ఆయన నిన్ను మెడ పట్టుకుని భయటకు గెంటేయడం కావాలి అంటుంది అరుంధతి. నిన్ను పంపించేస్తే నీ చెల్లి వచ్చింది.. దాన్ని గెంటేద్దామనుకుంటే మీ నాన్న అడ్డొచ్చి హాస్పిటల్ పాలయ్యారు అంటుంది మనోహరి.
గుప్త మాటలు గుర్తుకు వచ్చి
అంటే మిస్సమ్మ నా చెల్లెలా.. ఆయన నా తండ్రా.. అని షాక్ అవుతుంది అరుంధతి. వెంటనే గుప్త మాటలు గుర్తు చేసుకుని మిస్సమ్మ నా తోడపుట్టకపోవచ్చు గానీ వాళ్లజోలికి వస్తే నేను ఊరుకోను మనోహరి అని వార్నింగ్ ఇస్తుంది అరుంధతి. ఘోరా ఇచ్చిన బూడిదను గార్డెన్‌లో చల్లుతుంది మనోహరి. తాయత్తుని చెట్టుకి కడుతుంది. దాని శక్తితో అరుంధతి ఇంటి బయటకు వెళ్లిపోతుంది.
ఎంత ప్రయత్నించినా అరుంధతి ఇంట్లోకి రాలేకపోతుంది. తాయత్తు తీసుకెళ్లి గుమ్మానికి కడుతుంది మనోహరి. అప్పుడే అక్కడకు వచ్చిన మిస్సమ్మను చూసి భయపడుతుంది మనోహరి. ఏం చేస్తున్నావని మిస్సమ్మ అడగ్గానే ఇంట్లో వస్తున్న సమస్యలకు పరిష్కారం కోసం మంచి జరుగుతుందని ఇది కట్టాను అంటుంది మనోహరి. అత్తయ్యను అడిగావా అంటుంది మిస్సమ్మ. మంచి జరగడానికి కూడా అందరి పర్మిషన్ తీసుకోవాలా? అంటుంది మనోహరి.
నీ వల్ల మంచి జరగదు
మంచి జరగడం ఓకే గానీ అది నీవల్ల జరగుతుందంటేనే నమ్మకం కుదరట్లేదు అంటుంది మిస్సమ్మ. నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదంటూ ఇంట్లోకి వెళ్తుంది మనోహరి. హాల్లో కూర్చున్న పంతులు మనోహరిని చూసి అరుంధతి స్నేహితురాలు ఈ అమ్మాయే కదూ.. అమర్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నది ఈ అమ్మాయినే కదా అంటాడు. అవును అంటాడు శివరామ్.
అమర్‌ని పెళ్లి చేసుకోవడం నీ తలరాతలో లేదనుకుంటాను అందుకే రెండు సార్లు నీతో జరగాల్సిన పెళ్లి వేరేవాళ్లతో జరిగింది అంటాడు పంతులు. అంటే.. అక్క మీకు మనోహరి గురించి కూడా చెప్పిందా పంతులుగారు అంటుంది మిస్సమ్మ. అవునమ్మా.. అరుంధతి ఎప్పుడు గుడికి వచ్చినా ఈ అమ్మాయి పేరున అర్చన చేయించేది. ఈ అమ్మాయి సంతోషంగా ఉండాలని పూజలు చేసేది అలాంటి స్నేహితురాలు ఉండటం నీ అదృష్టం అంటాడు పంతులు.
అదృష్టం-దురదృష్టం
నిజమే పంతులుగారు.. ఇలాంటి స్నేహితురాలు ఉండటం మాత్రం మా అక్క దురదృష్టం అనుకుంటుంది మిస్సమ్మ. రణ్‌వీర్‌ని బెయిల్ మీద బయటకు తీసుకుని వస్తాడు సౌరభ్. రోజు పోలీస్ స్టేషన్‌కి వచ్చి సంతకం పెట్టాలని చెబుతాడు. ఆ మనోహరిని చంపేవరకు ఏదైనా చేస్తాను అంటాడు రణ్‌వీర్. కానీ, తొందరపడితే అమర్‌కి దొరికి పోతామని, ఆయన చాలా పెద్ద ఆఫీసర్ అని చెబుతాడు సౌరభ్.
ఆయనను పక్కదోవ పట్టించి మనోహరిని ఇక్కడ నుంచి తీసుకెళ్లడం కోసం మనం పని చేయాలని చెబుతాడు రణ్‌వీర్. పిల్లలు స్కూల్ నుంచి రావడంతో అందరూ బయటకు వస్తారు. ఇంట్లోకి రాలేకపోతున్న అరుంధతి అమ్ముని చూసి తను లోపలకు రాకుండా మనోహరి ఏదో చేసిందని చెబుతుంది.
ఏదో వెలితిగా ఉందంటూ
లోపలకు వచ్చిన పిల్లలు లాన్లోకి వస్తే అమ్మ అక్కడే ఉన్నట్లు ఉండేదని, ఇప్పుడు మాత్రం ఏదో వెలితిగా ఉందని అంటారు. అందరూ బాధపడతారు. రాత్రి భోజనానికి అందరూ కూర్చుంటారు. మనోహరికి పొలమారుతుంది. ఎవరో తలుచుకున్నట్లున్నారు అంటాడు అమర్. నన్ను తలుచుకోవడానికి నాకంటూ ఎవరు ఉన్నారు నా ఆరు తప్ప అంటుంది మనోహరి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
అరుంధతి మళ్లీ ఇంట్లోకి ఎలా వస్తుంది? మనోహరి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే జులై 18న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!