NNS 4th July Episode: మనోహరిని కాల్చిన రణ్వీర్.. అమర్‌లో మొదలైన అనుమానం.. మిస్సమ్మ వండిన వంటల్లో విషం!
NNS 4th July Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ గురువారం (జులై 4) ఎపిసోడ్లో రణ్వీర్ తనను తలపై కాల్చినట్లు కల కంటుంది మనోహరి. మరోవైపు అమర్‌లో అనుమానం మొదలు కాగా.. మిస్సమ్మ చేసిన వంటలో మనోహరి విషం కలుపుతుంది.
NNS 4th July Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం గురువారం (జులై 4) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఫంక్షన్లో మనోహరిని వెతుకుతూ అమర్‌కి ఎదురుపడతాడు రణ్వీర్. చూసుకోకుండా అమర్‌ని నెట్టుకుంటూ వెళ్లిపోతాడు. కోపంగా చూస్తున్న అమర్‌ని తమవాడిదే తప్పని నచ్చజెప్పుతాడు సౌరభ్. అదేంటి మీరు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్న వాళ్లే కదా అని అడుగుతాడు అమర్. అవునండీ.. ఆ అమ్మాయి ఇక్కడుందని తెలియడంతో వచ్చామని చెబుతాడు సౌరభ్.
వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం చూసి కంగారు పడుతుంది మనోహరి. అప్పుడే మనోహరిని చూసి చంపేందుకు వెంటపడతాడు రణ్వీర్. ఫంక్షన్లో కాల్పులు జరపడంతో అందరూ అటు ఇటు పరిగెడతారు. పిల్లలు తలోదిక్కున పరిగెత్తడంతో మిస్సమ్మ, అమర్ కలిసి వాళ్లను కాపాడతారు. అమర్ వెళ్లి రణ్వీర్తో గొడవపడి పోలీసులకు అప్పగిస్తాడు.
అమర్‌లో మొదలైన అనుమానం
పిల్లలు ఇంటికి రాగానే పడుకుంటారు. ఫంక్షన్లో జరిగిన హడావిడికి పిల్లలు భయపడి త్వరగా పడుకున్నారని.. శివరామ్, నిర్మలకి పాలు ఇచ్చి పడుకోమని చెబుతుంది మిస్సమ్మ. అందరూ పడుకున్నారని వచ్చి అమర్‌తో చెబుతుంది. కానీ అమర్ ఏదో ఆలోచిస్తున్నట్లు గమనించి మళ్లీ ఏమైంది ఈ మనిషికి అనుకుంటుంది. దీర్ఘంగా ఆలోచిస్తున్న అమర్ భాగీని చూసి ఉలిక్కిపడతాడు.
ఏమైందని అడుగుతుంది భాగీ. ఆ మనుషులు అనుకోకుండా మనకు ఎదురుపడుతున్నారా? లేకపోతే వాళ్లు వెతుకుతున్నది మనకు తెలిసిన వాళ్లలేనా? అంటాడు అమర్. అదేంటని ఆశ్చర్యపడుతుంది మిస్సమ్మ. మన పెళ్లిరోజు, ఆరోజు సరస్వతిగారు కనపడకుండా పోయిన రోజు, మళ్లీ ఈరోజు.. వాళ్లు మనకు ఎదురుపడ్డారు అంటాడు అమర్.
మనోహరికి పీడకల
అదేంటని ఆలోచనలో పడుతుంది మిస్సమ్మ. నాకెందుకో వాళ్లు వెతుకుతున్నది మనోహరి కోసమేనా అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే మనోహరి పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే అంటాడు అమర్. మనోహరి ప్రమాదంలో ఉంటే తననే అడిగితే సరిపోతుంది కదా అంటుంది మిస్సమ్మ. ఇప్పటివరకు చెప్పలేదంటే అడిగితే మాత్రం చెబుతుందా అనడంతో అమర్ ఆలోచనలో పడతాడు.
మనోహరి కార్లో కూర్చుని తనని చంపేస్తానని బెదిరిస్తాడు రణ్వీర్. వద్దు నువ్వు చెప్పినట్లే వింటాను, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను, ఎక్కడకి రమ్మంటే అక్కడకు వస్తాను అంటుంది మనోహరి. ఇంకా నీ మాయమాటలు నమ్మేందుకు నేను పిచ్చోడిని అనుకుంటున్నావా? అంటాడు రణ్వీర్. తప్పించుకోవాలని చూసిన మనోహరిని లాక్‌చేసి తలపై కాలుస్తాడు.
నో.. అంటూ అరుస్తూ లేచి అదంతా కల అని గ్రహించి ఉలిక్కి పడుతుంది మనోహరి. రణ్వీర్ నన్ను చూశాడంటే మరుక్షణంలో చంపేస్తాడు. ఈలోపలే నేను అమర్‌తో తాళి కట్టించుకోవాలి అనుకుంటుంది. ఉదయం లేచి పిల్లల కోసం వంట చేస్తుంది మిస్సమ్మ. ఎలాగైనా మిస్సమ్మను ఇంట్లో నుంచి పంపించి అమర్‌తో తాళి కట్టించుకోవాలనుకుంటుంది మనోహరి.
మిస్సమ్మను పిలిచినట్లు నాటకమాడి ఆమె బయటకు వెళ్లగానే కిచెన్‌లోకి పరిగెత్తి వంటల్లో విషం కలుపుతుంది. కిటికీలోనుంచి చూసిన అరుంధతి వద్దు మను.. అని అరుస్తుంది. విషం కలిపిన వంటని ఎవరు తింటారు? మిస్సమ్మను అమర్ ఇంట్లో నుంచి వెళ్లగొడతాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జులై 04న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్