NNS July 13th Episode: అమర్ కోసం పోటీ పడిన భాగీ అరుంధతి.. రాథోడ్ ప్రేమ సలహా.. ఆరు అస్థికలపై మనోహరి ఆరా!
Nindu Noorella Saavasam July 13th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 13వ తేది ఎపిసోడ్‌లో అమర్‌ను ప్రేమలో పడేయాటానికి భాగీకి రాథోడ్ సలహా ఇస్తాడు. అప్పుడే అమర్‌కు ఎదురుపడేందుకు మిస్సమ్మ, అరుంధతి పోటీ పడతారు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 13th July Episode) అరుంధతి అస్థికలు దక్కించుకుంటేనే ఆమె ఆత్మను బంధించడం వీలవుతుందని తన గురువు చెప్పడంతో వాటిని వెతుక్కుంటూ మనోహరి రూంలోకి వస్తాడు ఘోర. ఇంతలో రణ్వీర్ గురించి చెప్పడానికి అమర్, మనోహరి రూంకి వస్తాడు. ఘోరా అమర్‌కి కనపడకుండా మనోహరి రూమ్‌లో దాక్కుంటాడు.

మరోసారి జైలుకు
ఘోరాని అమర్ చూస్తాడేమోనని మనోహరి టెన్షన్ పడుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావంటూ అమర్ అడిగేతే ఏం లేదని చెప్తుంది. సరే అయితే మనం మరోసారి జైలుకు వెళదామని అమర్ చెప్పగానే తనకు హెల్త్ బాగా లేదని, ఇవాళ కుదరదని, రెస్ట్ తీసుకుంటానని చెప్తుంది. అమర్ సరేనని వెళ్లిపోతాడు. దాంతో మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది.
అమర్ మనసులో అనుమానాలు బలపడుతున్నాయి. ఆరు ఫ్రెండ్ ముసుగులో ఉన్నాను కాబట్టి నా మీద అనుమానం రావడం లేదు. దాని అస్థికలు నేను తీసుకొస్తాను. అది శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా నువ్వు చేయ్ అని ఘోరకు చెప్తుంది మనోహరి. మిస్సమ్మ లంచ్ బాక్స్ తీసుకొచ్చి రాథోడ్‌కు ఇస్తుంది. రాథోడ్ నువ్వింత ముద్దపప్పువు అనుకోలేదు అంటాడు.
ప్రేమలో పడేయటం నేర్చుకో
మిస్సమ్మ అదేంటి అంత మాటన్నావు అంటుంది. ఎప్పుడు చూసినా గొడవలు కాదు ప్రేమలో పడేయటం నేర్చుకోమని చెప్తాడు రాథోడ్. నీ మనసులో ఉన్న ప్రేమ ఆ మనిషికి తెలియాలంటే నువ్వు కళ్ల ముందే ఉండాలి. కలలోకి కూడా వస్తూ ఉండాలి. అప్పుడే కదా మా సారు మనసులో స్థానం సంపాదించుకునేది అంటాడు. మీ సారు అంటే నాకు ప్రేమ అని చెప్పానా..? అంటుంది మిస్సమ్మ.
కళ్లల్లో అంత స్పష్టంగా కనిపిస్తుంటే మళ్లీ మాటల్లో చెప్పాలా ఏంటి? ఈ బాక్సేదో ఆయన చేతుల్లో పెట్టండి. ఆయన బయటికి వెళ్తుంటే ఎదురెళ్లండి అని సలహా ఇస్తాడు రాథోడ్. మీ సారు ఊరుకుంటారంటావా? అంటుంది మిస్సమ్మ. ఊరుకోక ఏం చేస్తారు. ఇంతకుముందు మేడం గారు కూడా ఎదురొచ్చేవారు. అప్పుడు రోజంతా మేడం గారి గురించే ఆలోచించేవారు. నీకు కూడా వర్కౌట్ అవుతుందిలే.. అని రాథోడ్ చెప్పగానే మిస్సమ్మ తాను అమర్‌కు ఎదురొచ్చినట్టు అమర్ మిస్సమ్మను హగ్ చేసుకున్నట్లు కలగంటుంది.
ఎదురు రావాలని
దీంతో రాథోడ్ సిగ్గుపడింది చాలు ముందు పని కానివ్వు అనగానే మిస్సమ్మ అమర్ కోసం ఎదురుచూస్తుంది. అమర్ రాగానే బాక్స్ ఇస్తుంది మిస్సమ్మ. బాక్స్ తీసుకుని వెళ్తున్న అమర్‌కు ఎదురు రావాలని గేటు దగ్గరకు పరుగెడుతుంది అరుంధతి. మిస్సమ్మ కూడా ఎదురు రావాలని పరుగెడుతుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుని ఇక్కడేం చేస్తున్నారు అని ప్రశ్నించుకుంటారు. ఇద్దరూ ఒకేసారి మా ఆయనకు ఎదురు రావాలని చెప్పుకుంటారు. దీంతో మిస్సమ్మ షాక్ అవుతుంది.
ఇంతలో తేరుకుని అరుంధతి ఏదో సర్ధి చెప్తుంది. ఇంతలో అమర్ వెళ్లిపోతాడు. మిస్సమ్మ బై చెప్తుంది. అమర్ కారు వెనక్కి తీసుకుని వచ్చి మరీ మిస్సమ్మకు బై చెప్పి వెళ్తాడు. దీంతో మిస్సమ్మ ఫుల్ హ్యాపీగా గెంతులేస్తూ ఆరు దగ్గరకు వెళ్తుంది. అక్కా మా ఆయన నాకు బై చెప్పేశాడు అక్కా.. ఫస్ట్ టైం.. అంటుంది. అవునా..? అవును మిస్సమ్మ మీరు హద్దులు దాటి ముద్దుల దాకా వెళ్లారట నిజమా? పెద్దవాళ్లు మాట్లాడుతుంటే విన్నాను అని అరుంధతి అడుగుతుంది.
హద్దు దాటరని తెలుసు
ఓ అదా? ముద్దు లేదు హద్దు లేదు అక్కా బైమిస్టేక్ ఆయన మీద పడ్డప్పుడు లిప్‌స్టిక్ ఆయనకు అంటుకుంది. ఆ మనోహరిని ఏడిపించడానికి నేనది అలానే ఉంచా? ఆ ముద్దు చూసినప్పుడు ఆ మనోహరి ముఖం చూసుండాలి అక్కా? అంటుంది మిస్సమ్మ. ఇది నా ముఖం చూసుండాలి అనుకుంటూ నేను అదే అనుకున్నాను మిస్సమ్మ లేదంటే మా ఆయన హద్దు దాటరని నాకు తెలుసు? అంటుంది అరుంధతి. మీ ఆయనేంటి? అనగానే ఆరు తన మాటలతో మిస్సమ్మను కన్ప్యూజ్ చేసి వెళ్లిపోతుంది.
పోలీస్‌స్టేషన్‌లో ఉన్న రణవీర్‌ను కలవడానికి లాయర్ వస్తాడు. బెయిల్ గురించి మాట్లాడుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే మనోహరిని చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు రణవీర్. మరోవైపు నిర్మల, శివరాంల దగ్గరకు వచ్చిన మనోహరి ఇంటికి ఏదో దోషం పట్టినట్టుందని చెప్తుంది. ఆరు అస్థికలను నదిలో కలపలేదు కదా అందుకే ఇలా జరుగుతుందేమోనని మనోహరి చెప్పగానే నిర్మల నిజమే అనిపిస్తుంది అంటుంది.
అమర్ ఒప్పుకుంటాడా?
కిటికీలోంచి చూస్తున్న ఆరు బాధపడుతుంది. ఆరు అస్థికలు ఎక్కడున్నాయని మనోహరి అడుగుతుంది. మనోహరి ఆరు అస్థికలను కనిపెడుతుందా? అమర్ ఆరు అస్థికలను పుణ్యనదుల్లో కలపడానికి ఒప్పుకుంటాడా? అనే విషయాలు తెలియాలంటే జులై 14న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!