NNS July 12th Episode: అమర్‌ని చూసి ఇంట్లో వాళ్లు షాక్- భాగీని అమ్మగా ఒప్పుకున్న అమ్ము- మనోహరి గదిలో ఘోరా- దొరకనుందా?
Nindu Noorella Saavasam July 12th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 12వ తేది ఎపిసోడ్‌లో అమర్ బుగ్గపై లిప్‌స్టిక్ మరకలు చూసి ఇంట్లో వాళ్లంత షాక్ అవుతారు. అలాగే విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తర్వాత మనోహరి గదిలోకి ఘోరా వస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 12th July Episode) చీర కుచ్చిళ్లు తట్టి అమర్‌పై పడిపోతుంది భాగీ. సరిగ్గా అమర్ చెంపపై భాగీ పెదవులు పడటంతో లిప్‌స్టిక్ అంటుకుంటుంది. దాన్ని ఎలా చెరిపేయాలా అని భయపడుతున్న భాగీకి మనోహరిని ఏడిపించడానికి దాన్ని ఓ అవకాశంగా వాడుకోవచ్చనే ఆలోచన వస్తుంది.
ఆటపట్టించిన భాగీ
హుషారుగా బయటకు వచ్చిన భాగీకి తలుపు తీయగానే ఎదురుగా మనోహరి కనపడుతుంది. భాగీని చూసి కంగారుగా పరుగుపెడుతున్న మనోహరిని పిలిచి ఏంటి మను.. నన్ను చూసి భయపడిపారిపోతున్నావు? అని అడుగుతుంది. నీకంత సీన్ లేదు అని తీసిపడేస్తుంది మనోహరి. మా ఇద్దరికీ ఏం జరగలేదు మను.. అంటూ మళ్లీ మళ్లీ చెప్పి మనోహరిని ఆటపట్టిస్తుంది భాగీ.
చిరాకు పడుతున్న మనోహరిని చూసి నవ్వుకుంటూ అక్కడనుంచి వెళ్తుంది భాగీ. వెంటనే అమర్ ఎలా ఉన్నాడో చూద్దామని డోర్ దగ్గరకు వెళ్తుంది. అమర్ చెంప మీద ఉన్న లిప్‌స్టిక్ చూసి షాకవుతుంది. మనోహరిని చూసిన అమర్ ఏంటి మనోహరి ఉదయాన్నే నా రూమ్ దగ్గర ఏం చేస్తున్నావు? అని అడుగుతాడు. ఏం లేదు అమర్.. గుడ్ మార్నింగ్ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
అంతా షాక్
అమర్ హాల్లోకి వచ్చి పేపర్ చదువుతూ ఉంటాడు. అటుగా వచ్చిన రాథోడ్ అమర్ బుగ్గ మీద ఉన్న లిప్‌స్టిక్ చూసి తనలో తానే నవ్వుకుంటాడు. లిప్‌స్టిక్ చూసి షాకయిన శివరామ్ వెంటనే నిర్మలను పిలిచి చూపిస్తాడు. అందరూ కొత్తగా ప్రవర్తిస్తున్నారేంటి? ఏమైంది మీ అందరికీ అంటాడు అమర్. కానీ, ఎవ్వరూ చెప్పకపోవడంతో భాగీ.. కాఫీ తీసుకురా! అంటాడు. భాగీ అని అమర్ పిలవడంతో అందరూ షాకవుతారు.
కోప్పడిన అమర్
సంతోషంతో కాఫీ పట్టుకుని వస్తుంది భాగీ. నువ్వైనా దాని గురించి చెప్పమ్మా అంటూ అక్కడనుంచి వెళ్లిపోతాడు శివరామ్. ఏం చెప్పకుండా సిగ్గుపడుతున్న భాగీని చూసి కోపంగా హే.. లూస్.. ఏం జరిగిందో చెప్పు అంటాడు అమర్. అంటే.. అది ఇందాక నేను కాలుజారి మీ మీద పడ్డాను. అప్పుడు మీ బుగ్గమీద లిప్‌స్టిక్ అంటింది అని చెప్పగానే కోపంగా చూస్తాడు అమర్. దాంతో వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోతుంది భాగీ.
అదంతా కిటికీ లోనుంచి చూస్తూ అరుంధతి అసలేం జరుగుతోంది అనుకుంటుంది. మరోవైపు పిల్లలకు బాక్సులు పెట్టి స్కూల్‌కి రెడీ చేస్తుంది భాగీ. అందరినీ పిలిచి వాళ్ల బాక్స్‌లు ఇస్తుంది. కానీ, అంజు మాత్రం ఆ బాక్స్‌ల్లోని ఫుడ్ తిని సేఫ్ అనుకుంటేనే తీసుకెళ్తామంటుంది. అందరూ మరిచిపోయినా ఆ ఫుడ్ పాయిజన్ గురించి ఈ అంజు గుర్తు చేసి నన్ను ఇరికిస్తోంది అనుకుంటుంది మనోహరి.
బాధపెడుతున్నారు
అంతలో రాథోడ్ వచ్చి బాక్సుల్లోని ఫుడ్ తిని బాగుందని చెబుతాడు. అందరూ నవ్వుతారు. పిల్లలకు బాయ్ చెబుతూ హగ్ అడుగుతుంది భాగీ. నువ్వు మరీ మా అమ్మలా ఫీలవుతున్నావు.. నువ్వు కేవలం మిస్సమ్మవి.. మా అమ్మవి కావు.. ఎప్పటికీ కాలేవు అంటారు పిల్లలు. దానికి బాధపడుతుంది మిస్సమ్మ. పాపం మిస్సమ్మ.. తన పిల్లలు కాకపోయినా ప్రేమ పంచుతుంటే వీళ్లు ఇలా బాధపెడుతున్నారు అంటాడు శివరామ్.
అంతలో అమ్ము వచ్చి మిస్సమ్మను హగ్ చేసుకుని నేను మా అమ్మకి ఇలాగే బాయ్ చెప్పేదాన్ని అంటుంది. సంతోషంతో ముద్దుపెట్టి స్కూల్‌కి సాగనంపుతుంది భాగీ. ఇంట్లో అందరూ మిస్సమ్మ వైపు మారిపోతున్నారు. అమర్, అమ్ము కూడా దానిపై ప్రేమ చూపిస్తున్నారు ఎలాగైనా దాన్ని వీళ్లకి దూరం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. అప్పుడే కిటికీలోనుంచి మనోహరిని పిలుస్తాడు ఘోరా.
అనుకున్నది సాధించలేవు
ఇక్కడకు ఎందుకు వచ్చావు? నిన్ను చూస్తే అమర్ చంపేస్తాడు. వెంటనే ఇక్కడనుంచి వెళ్లు అంటున్న మనోహరి మాట వినిపించుకోకుండా లోపలకు వచ్చి మాట్లాడతానంటూ రూమ్ లోపలకు వస్తాడు. ఆ ఆత్మ ఇంట్లో ఉండగా నువ్వు అనుకున్నది సాధించలేవు మనోహరి.. ఆ అమ్మాయి అస్తికలు నాకు ఇస్తే ఆత్మను బంధించగలను అంటాడు ఘోరా.
అప్పుడే అమర్ మనోహరి కోసం రూమ్‌కి వస్తాడు. మనోహరి రూమ్‌లో ఉన్న ఘోరాని అమర్ చూస్తాడా? అసలు అమర్ మనోహరి రూమ్‌కి ఎందుకు వచ్చాడు? అనే విషయాలు తెలియాలంటే జులై 13న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!