NNS July 24th Episode: రక్ష బయట పడేసిన పిల్లలు- మనోహరికి భాగీ వార్నింగ్​- దొరకని అరుంధతి డైరీ- గతం చెప్పిన రణ్‌వీర్-nindu noorella saavasam serial july 24th episode bhagamathi warning to manohari nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns July 24th Episode: రక్ష బయట పడేసిన పిల్లలు- మనోహరికి భాగీ వార్నింగ్​- దొరకని అరుంధతి డైరీ- గతం చెప్పిన రణ్‌వీర్

NNS July 24th Episode: రక్ష బయట పడేసిన పిల్లలు- మనోహరికి భాగీ వార్నింగ్​- దొరకని అరుంధతి డైరీ- గతం చెప్పిన రణ్‌వీర్

Sanjiv Kumar HT Telugu
Jul 24, 2024 06:37 AM IST

Nindu Noorella Saavasam July 24th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 24వ తేది ఎపిసోడ్‌‌లో ఇంటి కీస్ లేకపోవడంతో లాన్ అంతా క్లీన్ చేస్తారు పిల్లలు. అలాగే ఇంటికి కట్టిన రక్ష కూడా తీసేస్తారు. దాంతో అరుంధతి ఇంట్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 24వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 24వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 24th July Episode) పిల్లలు లాన్​ క్లీన్​ చేస్తూ ఉంటారు. తనకోసం కష్టపడుతున్న పిల్లల్ని చూసి మురిసిపోతుంది అరుంధతి. మనోహరి చల్లిన పౌడర్​ చూసి ఏంటిదంతా? లాన్​ అంతా ఉంది అని కోపంగా ఊడ్చేస్తుంది అమ్ము. అంజు చెట్లకు నీళ్లు పడుతూ లాన్​ అంతా కడిగేస్తుంది.

దగ్గరకు తీసుకున్న అరుంధతి

ఘోరా మనోహరికి ఇచ్చిన మంత్రించిన బూడిదంతా నీళ్లతో పాటు బయటకు వెళ్తుంది. మనోహరి చెట్టుకి కట్టిన తాయత్తుని కూడా విప్పి పడేస్తుంది అంజు. దాంతో అరుంధతి ఇంట్లోకి వెళ్లగలుగుతుంది. లాన్​ అంతా క్లీన్ చేసి అమ్మకు నచ్చేలా చేయగలిగామని సంబరపడిపోతారు పిల్లలు. అమ్మని మిస్సవుతున్నామని బాధపడతారు. వాళ్ల బాధని చూసిన అరుంధతి దగ్గరకు తీసుకుంటుంది.

గుడిలో మనోహరిని చూసినా ఏం చేయలేకపోయానని ఆలోచిస్తూ ఉంటాడు రణ్​వీర్​. నా చేతులతో తాళి కట్టింది ఓ రాక్షసికి అని ఈ రోజే తెలిసింది. తన కాపురాన్ని వదిలేసుకుని ప్రాణ స్నేహితురాలి కాపురం కూల్చిన రాక్షసి అంటాడు రణ్​వీర్​. అసలు ప్రాణ స్నేహితురాలిని ఎలా చంపేసింది అంటాడు సౌరభ్​.

మనోహరి బుద్ధిశాలి

అది ప్రేమ అనుకుంటుంది. కానీ అది పంతం.. అమర్​ తనని కాదన్నాడనే పగ, తనని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పంతం అంటాడు రణ్​వీర్​. మనోహరి అంతా పక్కా ప్లాన్​‌తోనే చేస్తోంది. అమర్​ బలం తెలిసే అతన్ని తనకు రక్షగా పెట్టుకోవాలనుకుంటుంది అంటాడు లాయర్​. మనం బలవంతులమే కావచ్చు. కానీ మనోహరి బుద్ధిశాలి. చేతికి మట్టి అంటకుండా మనిషిని మట్టిలో కలిపేయగల సామర్థ్యం ఉంది. ఆలోచనతో అడుగేయాలి. ఆవేశపడితే ఒక్క అడుగుతో పాతాళానికి తొక్కేస్తుంది అని హెచ్చరిస్తాడు సౌరభ్.

దాని నక్క తెలివితేటలు నాకు బాగా తెలుసు సౌరభ్.. నా ఆవేశం దాన్ని చంపేయమని చెప్పినా నా గతం నన్ను ఆపుతోంది. దాన్ని ప్రాణాలతో పట్టుకుంటా.. అది చేసిన పనికి లెక్క సరిచేస్తా అంటాడు రణ్​వీర్​. పూజ పూర్తిచేసుకుని అమర్​ వాళ్లు ఇంటికి వస్తారు. కీస్​ తీసుకుని ఇంట్లోకి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు అమర్​. కీస్​ పెట్టకుంటే మేమెలా వెళ్తామంటారు పిల్లలు.

లాన్ అంతా క్లీన్ చేశాం

రాథోడ్​ అని అమర్​ అనగానే ఎప్పుడూ పెట్టే చోట పెట్టకుండా జేబులో పెట్టుకుని తిరుగుతున్నానా అంటూ తన పాకెట్లో ఉన్న కీస్​ చూసి ఆశ్చర్యపోతాడు రాథోడ్​. నువ్వు కీస్​ పెట్టకపోవడం వల్ల మేం ఒక మంచి పని చేశాం కాబట్టి ఏమనట్లేదు అంటుంది అంజు. ఏం చేశారు అనగానే.. అమ్మకి లాన్​ అంటే ఇష్టం కదా.. అందుకే లాన్ అంతా క్లీన్​ చేశామని చెబుతారు పిల్లలు.

దాంతో ఘోరా ఇచ్చిన రక్ష తీసేసి పిల్లలు అరుంధతిని మళ్లీ ఇంట్లోకి తీసుకొచ్చారని అర్థం చేసుకుంటుంది మనోహరి. ఈరోజు నుంచి లాన్​ని నేనే క్లీన్​ చేసి నీట్​గా ఉంచుతాను అంటుంది భాగీ. అందరూ లోపలకు వెళ్లడంతో కారులో ఉన్న డైరీని తీసుకుందామని వెళ్తుంది మనోహరి. కానీ, అప్పుడే అక్కడకు వచ్చిన భాగీ ఆ డైరీని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది భాగీ. గుమ్మానికి కట్టి ఉన్న తాయత్తుని తీసి కోపంగా విసిరిపడేస్తుంది.

భాగీ వార్నింగ్

అది చూసి కంగారుగా పరిగెత్తుకొస్తుంది మనోహరి. ఏయ్​.. నీకేమైనా పిచ్చా.. మంచికోసం కట్టినదాన్ని ఎందుకలా పడేసావు? అంటుంది. చంపేస్తా.. ఇంకోసారి ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేయాలని చూస్తే చంపేస్తా అంటూ మనోహరికి వార్నింగ్​ ఇస్తుంది భాగీ.

రణ్​వీర్​ ఏం చేయబోతున్నాడు? అరుంధతి ఆత్మను పట్టించడానికి మనోహరి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే జులై 25న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner