NNS July 19th Episode: అరుంధతి డైరీలో మనోహరి రహస్యం- అమర్ చేతికి ఆరు డైరీ- మనోహరికి మైండ్ బ్లాక్
Nindu Noorella Saavasam July 19th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 19వ తేది ఎపిసోడ్‌లో అమ్ము శరీరంలో ఉన్నప్పుడు అన్నింటికి కారణం మనోహరి అని తన డైరీలో రాసుకుంటుంది అరుంధతి. ఆ డైరీ చివరిగా అమర్ చేతికి చేరుతుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 19th July Episode) మనోహరి కుట్ర నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. అప్పుడే తను పౌర్ణమి రోజు అమ్ము శరీరంలో ఉన్నప్పుడు డైరీలో మనోహరి గురించి రాసి పెట్టానని గుర్తొస్తుంది.
త్వరగా రెడీ అవ్వండి
ఏవండీ.. మన ఇంటికి వచ్చే సమస్యలు అన్నింటికీ కారణం మనోహరి అని రాసి పెట్టిన డైరీ అమర్ కంటపడాలని దేవుణ్ని వేడుకుంటుంది అరుంధతి. మరోవైపు పిల్లలు.. లేటవుతుంది త్వరగా రెడీ అవండి అంటుంది మిస్సమ్మ. అమ్మూ.. మీ మిస్సమ్మకి చెప్పు పొద్దున్నే వచ్చి ఇలా మనల్ని ఇబ్బందిపెట్టకుండా ఉండమని. కాసేపు లేటయితే ఏమవుతుంది అంటుంది అంజు.
ఏమవదు అంజు.. మనకి స్కూల్ లేటవుతుంది. ప్రిన్సిపాల్ ఫోన్ చేసి డాడీకి కంప్లైంట్ చేస్తుంది.. అంతే.. అంటుంది అమ్ము. అమ్మో.. వద్దు అంటూ పిల్లలు త్వరగా రెడీ అవుతూ కంగారులో బుక్ షెల్ప్ని పడేస్తారు. పుస్తకాలన్నీ కిందపడతాయి. అమ్మో.. ఇప్పుడు డాడీ మన రూమ్ ఇలా ఉండటం చూశారంటే చంపేస్తారు అని భయపడతారు పిల్లలు.
మనోహరి కంట ఆరు డైరీ
వెంటనే అంజు అటుగా వెళ్తున్న మనోహరిని తీసుకొచ్చి ఆంటీ.. మీకు నేనంటే ఇష్టమే కదా.. ఇవన్నీ కొంచెం సర్దేయండి అంటూ అందరూ అక్కడ నుంచి పరిగెడతారు. మనోహరి పుస్తకాలన్నీ సర్దుతూ ఉంటుంది. అప్పుడే అరుంధతి తన గురించి రాసిన డైరీ కనపడుతుంది. దాంట్లో ఏముందా అని తీసి చదువుతుంది.
అరుంధతి చనిపోయిన తర్వాత జరిగినవన్నీ దాంట్లో ఉండటంతో అంటే.. ఇది చచ్చిన తర్వాత రాసిందా.. అని కంగారు పడుతుంది. ఇంతలో పెన్సిల్ బాక్స్ మర్చిపోయానని తీసుకెళ్లడానికి వచ్చిన అంజు మనోహరి చేతిలో ఆరు డైరీ చూసి ఇది అమ్మ డైరీ కదా.. ఇక్కడెందుకు ఉంది. డాడీ రూమ్‌లో ఉండాలి కదా.. నేను అక్కడ పెట్టేస్తానులేండి ఆంటీ అంటూ డైరీ తీసుకుని వెళ్లిపోతుంది.
నా దగ్గరే ఉంచుకుంటానులే
ఇంతలో స్కూల్‌కి లేటవుతుందని రాథోడ్ పిలవడంతో ఈ ఒక్క రోజుకి డైరీ నా దగ్గరే ఉంచుకుంటానని వెంట తీసుకుని కిందకి దిగుతుంది అంజు. మనోహరి షాక్‌లో ఉండటంతో ఏం అర్థం కాదు. తర్వాత షాక్‌లో నుండి తేరుకున్న మనోహరికి డైరీ కనపడకపోవడంతో కంగారుపడుతుంది. అంజు వచ్చిన విషయం గుర్తుకువచ్చి అంటే ఆ డైరీ ఇప్పుడు అమర్ రూమ్‌లో ఉందా.. ఎలాగైనా అందర్ని గుడికి పంపించి డైరీ వెతికి పట్టుకోవాలి అనుకుంటుంది.
పిల్లలు స్కూల్‌కి బయల్దేరతారు. అంజు చేతిలో ఉన్న ఆరు డైరీ చూసి ఇది అమ్మ డైరీ కదా.. ఎందుకు తీసుకొస్తున్నావు అంటుంది అమ్ము. అమ్మని ఒక్కరోజైనా దగ్గరగా ఉంచుకుందామని అంటుంది అంజు. పిల్లలందరూ అరుంధతి రాసిన డైరీ చదివి గతం గుర్తుచేసుకుని బాధపడతారు. రాథోడ్ కూడా బాధపడుతూ ఆ డైరీని సార్‌కి నేను ఇస్తాలే అని చెబుతాడు. పంచెకట్టులో తయారైన అమర్‌ని చూసి మురిసిపోతుంది మిస్సమ్మ.
ఆగిపోయిన శివరామ్ నిర్మల
అందరూ గుడికి బయల్దేరుతుంటే తనకి ఒంట్లో బాలేదని రానని చెబుతుంది మనోహరి. సరేనంటాడు అమర్. కానీ మిస్సమ్మ మాత్రం మనోహరి ఏదో చేయబోతోందని అనుమానపడుతుంది. రాథోడ్ సలహాతో మిస్సమ్మ, అమర్‌ని జంటగా గుడికి పంపి వెనకాల వస్తామని చెప్పి ఆగిపోతారు శివరామ్, నిర్మల. అందరూ గుడికి వెళ్లిపోయారని అమర్ రూమ్‌కి వెళ్లి డైరీని వెతుకుతుంది మనోహరి.
అమర్ రూమ్ నుంచి శబ్ధం రావడంతో అందరూ వస్తారు. వాళ్లని చూడగానే షాకై అదేంటీ మీరు గుడికి వెళ్లలేదా అంటుంది మనోహరి. లేదు.. ఇంతకీ అమర్, మిస్సమ్మ లేనప్పుడు వాళ్ల రూమ్‌లో నువ్వేం చేస్తున్నావు అంటాడు శివరామ్. అంటే అంకుల్.. ఆరు డైరీని అంజు ఇక్కడ పెడతానని చెప్పింది. భద్రంగా పెట్టిందా లేదా అని చూస్తున్నా అంటుంది మనోహరి.
గుడికి వస్తానంటూ
ఆ డైరీ సార్ వెళ్లే కారులో ఉంటే ఇక్కడ వెతకడమేంటి అంటాడు రాథోడ్. డైరీ అమర్ కార్‌లో ఉందా అని షాకవుతుంది మనోహరి. మేమిప్పుడు గుడికి వెళ్తాం కదా.. అమర్‌కి చెప్పి జాగ్రత్త చెయ్యమని చెబుతాం అంటాడు శివరామ్. వాళ్లు గుడికి బయల్దేరుతుంటే తను వస్తానంటుంది మనోహరి.
అందేంటి మేడమ్.. ఇందాక రానని మళ్లీ వస్తానంటున్నారు అంటాడు రాథోడ్. ఏ రాకూడదా? అంటుంది మనోహరి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. అమర్ డైరీ చదువుతాడా? మనోహరి నిజస్వరూపం బయటపడుతుందా? అనే విషయాలు తెలియాలంటే జులై 20న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!