NNS July 31st Episode: ​​​మళ్లీ మనోహరి ఎస్కేప్.. అరుంధతి తల్లిదండ్రుల వేటలో అల్లుడు​.. అమర్ ప్రేమ కోసం భాగీ ప్లాన్-nindu noorella saavasam serial july 31st episode amar will find arundhathi parents nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns July 31st Episode: ​​​మళ్లీ మనోహరి ఎస్కేప్.. అరుంధతి తల్లిదండ్రుల వేటలో అల్లుడు​.. అమర్ ప్రేమ కోసం భాగీ ప్లాన్

NNS July 31st Episode: ​​​మళ్లీ మనోహరి ఎస్కేప్.. అరుంధతి తల్లిదండ్రుల వేటలో అల్లుడు​.. అమర్ ప్రేమ కోసం భాగీ ప్లాన్

Sanjiv Kumar HT Telugu
Published Jul 31, 2024 06:03 AM IST

Nindu Noorella Saavasam July 31st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 31వ తేది ఎపిసోడ్‌‌లో అరుంధతి రాసిన డైరీ చదివి మనోహరిని నిలదీస్తాడు అమర్. అయితే అది అరుంధతి తల్లిదండ్రులను ఆరు వెతకాలనుకున్న విషయం తనకు ఎందుకు చెప్పలేదని కోప్పడతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 31వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 31వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 31st July Episode) ఆరు డైరీ తీసుకొచ్చి మనోహరిని నిలదీస్తాడు అమర్​. అరుంధతి రాసిన ప్రతీది నాకు తెలుసనుకున్నాను. కానీ, నాకు తెలియనివి కూడా చాలా ఉన్నాయి అంటాడు అమర్​. మీకు తెలియనివా? ఏంటండి అంటుంది భాగీ. అవేంటో మనోహరి చెబుతుంది అంటాడు అమర్​.

భయంతో మనోహరి

చేతిలో డైరీ, అమర్​ మాటల్లో కోపం చూస్తుంటే నిజం తెలిసిపోయినట్లుంది. ఇంత దగ్గరగా వచ్చి నేను అమర్​కి దూరం కాలేను. ఇప్పుడేం చెయ్యాలి అని భయంతో వణికిపోతుంది మనోహరి. అరుంధతి డైరీ తీసుకొచ్చి మనోహరిని చెప్పమంటావేంటి అమర్​ అంటాడు శివరామ్. చెప్పు మనో.. నువ్వు చేసిన తప్పు ఒప్పుకో అంటుంది అరుంధతి.

సైలెంట్​గా ఉన్న మనోహరిని మాట్లాడు.. చిన్నప్పటినుంచీ మీరిద్దరూ ఒకటిగా పెరిగారు నిన్ను తను స్నేహితురాలే కాదు కుటుంబం అనుకుంది. అలాంటి నువ్వు ఇలాంటి పని చేస్తావనుకోలేదు. చెప్పు మనోహరి ఎందుకు చేశావు ఇలా.. ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు అంటాడు అమర్​. ఒసేయ్​ అరుంధతి నిన్ను చంపేసినా నన్ను సాధిస్తున్నావు కదే అనుకుంటుంది మనోహరి.

నాకు చెప్పమనడం

అమర్​.. నేను చెప్పేది.. ఏదో తప్పయిపోయి.. పొరపాటుగా అంటు చెప్పబోతున్న మనోహరిని ఆపి పొడిపొడిగా కాదు పూర్తిగా చెప్పు. ఆరు తన తల్లిదండ్రుల కోసం వెతుకుతుందని నాకెందుకు చెప్పలేదు అంటాడు అమర్​. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు అంటుంది మనోహరి. ఆరు తల్లిదండ్రుల గురించి రాయడం, తనకేమన్నా అయితే ఆ విషయం నాకు చెప్పమనడం గురించి చెప్పమంటున్నా అంటాడు అమర్.

అరుంధతి తన తల్లిదండ్రులను కలవాలనుకున్నట్లు డైరీలో రాసుకుంటుంది. ఒకవేళ తనకు ఏమైనా అయితే ఆ విషయం మనోహరిని ఆయనకు చెప్పమని చెప్పాను. నేను లేకపోయినా నా పిల్లల్ని దగ్గరకు తీసుకో నాన్న అని రాసుకుంటుంది అరుంధతి. అమర్​ అడిగింది అరుంధతి తల్లిదండ్రుల గురించి అని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంటుంది మనోహరి.

అందరి కథలు ఒకలా ఉండవు

మనిషే లేనప్పుడు తన గతం గురించి ఎక్కడ వెతుకుతాం అమర్​. అయినా.. మమ్మల్ని వద్దనుకుని, పుట్టగానే వదిలేసిన వాళ్లగురించి తెలుసుకుని ఏం చేస్తాం. అప్పుడు వద్దన్నవాళ్లు ఇప్పుడు దగ్గరకు తీసుకుంటారా అంటుంది మనోహరి. నువ్వు చీకటిని చూసి ఆగిపోయావు. కానీ అక్క ఆ చీకటి వెనక వెలుగు చూడాలని కోరుకుంది. అందరి కథలు ఒకలా ఉండవు అని భాగీ అంటుంది.

అందరు అనాథలు తల్లిదండ్రులు వదిలేసినవాళ్లే కాదు కొందరు వాళ్ల ప్రమేయం లేకుండా కూడా కొందరు అనాథలుగా మారతారు. మా నాన్న ప్రమేయం లేకుండా మా అక్క మాకు దూరమైంది. మా అక్కకోసం మా నాన్న పడుతున్న ఆవేదనని దగ్గరగా చూస్తున్నా కాబట్టి చెబుతున్నా అంటుంది భాగీ. అందరూ భాగీ చెప్పిందే నిజమే అంటారు. అరుంధతి కోరికను తాను తీరుస్తానని మాటిస్తాడు అమర్.

తల్లిదండ్రుల ముందు

పాతికేళ్ల క్రితం జరిగినదాన్ని ఇప్పుడెలా తెలుసుకుంటావు అమర్​ అని అడుగుతుంది మనోహరి. ఎలాగైనా కనుక్కుంటాను మనోహరి. ఆరు కోరుకున్నట్లే తన పిల్లల్ని తన తల్లిదండ్రుల ముందు ఉంచుతాను. ఈ క్షణం నుంచే ఆ పని మొదలుపెడుతున్నా అంటాడు. ఆయనతోపాటు నేనూ మా అక్కను వెతుకుతాను అనుకుంటుంది భాగీ.

పిల్లలు అరుంధతిని తలుచుకుని బాధపడతారు. అమ్మ తన తల్లిదండ్రులకోసం ఎంత బాధపడిందో అని ఆలోచిస్తారు. తాతయ్య వాళ్లని కలిసినరోజు కచ్చితంగా అడగాలి అనుకుంటారు. మిస్సమ్మ ప్రిన్సిపల్ దగ్గర, డాడీ దగ్గర రిస్క్​ చేసి కాపాడినందుకు థ్యాంక్స్​ చెప్పమంటుంది అమ్ము. తను చెప్పనంటుంది అంజు. అప్పుడే మిస్సమ్మ రూమ్​లోకి వచ్చి పడుకోమని చెబుతుంటే మెల్లిగా థ్యాంక్స్​ అంటుంది అంజు.

అంజుకు గుర్తొచ్చిన అరుంధతి

ఎవరికి చెప్పావు? ఎందుకు చెప్పావు? అని అడుగుతుంది మిస్సమ్మ. పిల్లలు అంజుని ఆటపట్టిస్తారు. అల్లరి చేస్తూ ఉంటేనే ఇష్టం అంటూ అంజుని హగ్​ చేసుకుంటుంది మిస్సమ్మ. అంజుకి అరుంధతి గుర్తొచ్చి ఏడుస్తుంది. మిస్సమ్మ పిల్లల్ని పడుకోబెట్టి వెళ్తుంది. రామ్మూర్తిని పరీక్షిస్తూ ఎలా ఉందని అడుగుతాడు డాక్టర్​. కొన్నిరోజుల వరకు నొప్పి, మంట ఉంటాయి .కారం తక్కువగా తినమంటాడు డాక్టర్.

డాక్టర్​ని సాయం అడుగుతాడు రామ్మూర్తి. తనకి ఏ సమస్య వచ్చినా తనకే చెప్పమని, తన కూతురికి చెప్పొద్దని వేడుకుంటాడు. మీకు కొండంత అండగా మీ అల్లుడు ఉన్నాడు. ఆయనే అన్నీ దగ్గరుండి మీ ఆపరేషన్​ సంగతులన్నీ చూసుకున్నాడు. మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంటాడు డాక్టర్​.

మంగళని తిట్టిన డాక్టర్

దాంతో సంబరపడతాడు రామ్మూర్తి. డాక్టర్​ మంగళని ఎందుకు తిడతాడు? అమర్​ని ప్రేమలో పడేయడానికి భాగీ ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే జులై ఆగస్ట్ 1న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner