NNS August 7th Episode: మనోహరి ప్లాన్ ఫెయిల్- సరస్వతిని కాపాడిన అక్కాచెల్లెళ్లు- అమర్ కొత్త ప్రయాణం- గుప్త ఎంట్రీ
Nindu Noorella Saavasam August 7th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 7వ తేది ఎపిసోడ్‌లో సరస్వతిని చంపాలనుకున్న మనోహరి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. సరస్వతి మేడమ్‌ను అరుంధతి, భాగీ అక్కాచెల్లెళ్లు ఇద్దరు కలిసి కాపాడుతారు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 7th August Episode) అమర్ వెళ్లిపోవడంతో సరస్వతి మేడమ్‌ని చంపడానికి లోపలకు వెళ్తుంది మనోహరి. మేడమ్‌ని చంపొద్దే.. అమ్మానాన్నలు కూడా వద్దనుకున్న మనల్ని పెంచిన మేడమ్‌ని ఏం చేయద్దు.. ఆమె కాపాడిన ఎంతోమంది ఉసురు తగులుతుందే అని వేడుకుంటుంది అరుంధతి.
ఆగిపోయిన మనోహరి
ఆ మాటలేవి వినపడని మనోహరి వార్డెన్‌కి విషపు ఇంజక్షన్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. సరస్వతి భయంగా చూస్తుంది. ఏంటి మేడమ్.. రాక్షసిలా కనిపిస్తున్నానా? అవును.. రాక్షసినే నువ్వు, ఆ అరుంధతి కలిసి తయారు చేసిన రాక్షసిని అంటుంది మనోహరి. సరస్వతిని చంపడానికి ముందుకు వచ్చిన మనోహరిని ఆపేందుకు గట్టిగా అరుస్తుంది అరుంధతి. ఆ అరుపుతో ఆగిపోతుంది మనోహరి.
తన మాట లెక్కచేయకుండా మేడమ్‌ని చంపడానికి సిద్ధమైన మనోహరిని ఆపేందుకు బయటకు వెళ్లి అందరినీ బతిమాలుతుంది అరుంధతి. అప్పుడే మిస్సమ్మ బయటకు రావడంతో మనోహరి సరస్వతి మేడమ్ రూమ్‌లో ఉందని చెప్పి తీసుకెళ్తుంది. అప్పుడే మేడమ్‌కి ఇంజక్షన్ చేయబోయిన మనోహరిని ఆపుతుంది మిస్సమ్మ. ఇక్కడేం చేస్తున్నావు? నీకు ఈ రూమ్‌లో ఏం పని ? అని నిలదీస్తుంది.
చంపేది నువ్వే
మా మేడమ్‌ని పరామర్శించడానికి వచ్చాను. దానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? అంటుంది మనోహరి. నాది కాదు.. ఆయన పర్మిషన్ తీసుకోవాలి. మనుషుల్ని చంపేది నువ్వే.. పరామర్శిచేది నువ్వేనా.. నడువు బయటకు అంటూ మనోహరిని బయటకు తీసుకొస్తుంది మిస్సమ్మ. ఆయన కాకుండా ఇంకెవరు వచ్చినా లోపలకు వెళ్లనివ్వకండి అని సెక్యూరిటీకి చెబుతుంది.
మరోవైపు ఘోరా మళ్లీ పూజ మొదలు పెడతాడు. ఈ సూర్యాస్తమయంతో నాలో సూర్యుడు ప్రకాశిస్తాడు అంటూ తన విజయాన్ని తలుచుకుని సంబరపడతాడు. అమర్ ఆశ్రమానికి వెళ్లి అరుంధతి చిన్నప్పటి వస్తువుల గురించి అడుగుతాడు. ఒక పట్టుపంచె ఉన్నట్లు రిజిస్టర్లో ఉందని ఓ పంచె తెచ్చి ఇస్తుంది వార్డెన్. ఆ పంచె చూసి ఉద్వేగానికి గురవుతాడు అమర్. అరుంధతిని తలుచుకుని బాధపడతాడు.
పట్టుపంచే తీసుకుని
ఆరుని తన తల్లిదండ్రులు వదిలించుకున్నారో.. తెలియకుండా దూరమైందో కనిపెట్టి తీరతా అంటాడు అమర్. నా గతాన్ని, నా తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ నా ప్రయాణాన్ని మొదలుపెడుతున్నా అంటూ అరుంధతి రాసిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుని నీ ప్రయాణాన్ని నేను పూర్తి చేస్తానంటాడు. ఆ పట్టుపంచె తాను తీసుకెళ్తున్నానని చెప్పి బయల్దేరతాడు.
ఘోరా పూజ మొదలు పెట్టడంతో అరుంధతి ఆత్మ అసహనానికి గురవుతుంది. ఏదో శక్తి తనను ఆవహిస్తున్నట్లు భావిస్తుంది. ఘోరా నన్ను బంధించే సమయం దగ్గరకు వచ్చేసింది అనుకుంటుంది అరుంధతి. మనోహరి ఘోరా దగ్గరకు వచ్చి అరుంధతి ఆత్మ గురించి అడుగుతుంది. ఒక్క పూజతో మనకు విజయం దక్కుతుంది అంటాడు ఘోరా.
చిత్రగుప్తుడి ప్రత్యక్షం
నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అన్నీ నాకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. ఆ సరస్వతి నోరు విప్పినా, ఆ అరుంధతి, భాగీ అక్కాచెల్లెళ్లని అమర్‌కి తెలిసినా నా కోరిక నెరవేరదు అంటుంది. అదంతా నాకు వదిలెయ్.. ఆ ఆత్మను అడ్డుపెట్టుకునే నీ జీవితాన్ని నీకు తిరిగి వచ్చేలా చేస్తాను అని మాటిస్తాడు ఘోరా.
నేను ఘోరాను ఆపలేను. ఆయనకు జరిగింది, జరుగుతున్నది చెప్పలేను అని బాధపడుతుంది. నా ఓటమిని అంగీకరించడం తప్ప నేనేం చేయలేకపోతున్నా అని కంగారు పడుతున్న అరుంధతిని బాలికా.. అని పిలుస్తాడు చిత్రగుప్తుడు.
అకస్మాత్తుగా ప్రత్యక్షమైన గుప్తను చూసి ఏమైపోయారు అని అడుగుతుంది. ఆ మనోహరి నా అస్థికల్ని తీసుకుని ఘోరాకు ఇచ్చి నన్ను బంధించాలని చూస్తోందని జరిగిదంతా గుప్తతో చెబుతుంది అరుంధతి. ఘోరా అరుంధతి ఆత్మను బంధిస్తాడా? చిత్రగుప్తుడు అరుంధతి ఆత్మను ఘోరా బారి నుంచి కాపాడుతాడా? అనే విషయాలు తెలియాలంటే ఆగస్టు 08న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!