Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 18th September Episode) అమర్ కుటుంబం భక్తిగా వినాయక పూజ చేస్తుంటారు. రణ్‌వీర్ కూడా పూజలో కూర్చోవడం చూసి మనోహరి భయంతో వణికిపోతుంది. వినాయక విగ్రహంలో పెట్టిన బాంబ్ ఎప్పుడు పేలుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు అరవింద్.
పూజ పూర్తవగానే మిస్సమ్మ, అంజు కలిసి అందరికీ హారతి ఇస్తారు. అప్పుడే టిక్ టిక్ అంటూ వినిపించే శబ్దం గమనించి ఇంట్లో ఎక్కడో బాంబ్ ఉందని అనుమానిస్తాడు అమర్. అందరినీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లమని హెచ్చరిస్తాడు. ఏమైందని అందరూ కంగారు పడతారు. విగ్రహంలో ఎవరో బాంబ్ పెట్టారని అందరినీ బయటకు తీసుకెళ్లమని రాథోడ్‌కి చెబుతాడు.
బాంబ్ అలర్ట్ అని అందరినీ హెచ్చరిస్తాడు రాథోడ్. రణ్‌వీర్ సాయంతో అమర్ ఆ బాంబ్‌ని డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అరుంధతి కంగారు పడుతూ మీరెందుకు ఇదంతా చేస్తున్నారు బయటకు పదండి అని బతిమాలాడుతుంది. రణ్‌వీర్, అమర్ ఇద్దరూ కలిసి బాంబ్‌ని డిఫ్యూజ్ చేస్తారు. అందరూ టెన్షన్లో ఉన్నారు మీరు వెళ్లి అందరికీ ధైర్యం చెప్పండి అంటాడు రణ్‌వీర్.
బాంబ్ డీయాక్టివేట్ అయ్యిందని ఎవ్వరూ కంగారు పడొద్దని చెబుతాడు అమర్. ప్లాన్ ఫెయిలైనందుకు నిరాశగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు అరవింద్. ఎంత పెద్ద గండం నుంచి బయటపడ్డాం అని కంగారు పడతారు శివరామ్, నిర్మల. ఈరోజు నీ సాయంతోనే మేమంతా ప్రాణాలతో బయటపడ్డాం, ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడావు అని రణ్‌వీర్‌కి థాంక్స్ చెబుతాడు.
అసలు విగ్రహంలోకి బాంబ్ ఎలా వచ్చిందంటాడు రాథోడ్. ఇంతకీ విగ్రహం ఎక్కడ నుంచి తెచ్చావు మనోహరి, నేను చెప్పిన షాపులో తేలేదా అని అడుగుతాడు అమర్. నిజం చెబితే అమర్‌కి తనపై కోపం పెరిగిపోతుందని ఆ షాపతనే విగ్రహం తెచ్చి కారులో పెట్టాడని అబద్ధం చెబుతుంది మనోహరి. జాగ్రత్తగా లేనప్పుడు బాధ్యతలు తీసుకోకూడదు మనోహరి గారు అంటాడు రణ్‌వీర్. దాంతో సారీ చెబుతుంది మనోహరి.
సరే అని అందరినీ లోపలకు వెళ్లమంటాడు అమర్. చిత్రగుప్తుడు అరుంధతి ఆత్మను తీసుకుని పోవడానికి వస్తాడు. యమధర్మ రాజుకి ఎలాగైనా ఈ పౌర్ణమికి ఆత్మను యమలోకానికి తీసుకొస్తానని మాటిస్తాడు. ఇదే తనకి ఆఖరి పౌర్ణమి అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను మన లోకానికి తీసుకొస్తానని చెబుతాడు. పైకి చూసి మాట్లాడుతున్న గుప్తను చూసి యమధర్మ రాజు వచ్చారని పిలుస్తుంది అరుంధతి.
వెంటనే మాయమవుతాడు యముడు. పిలుస్తున్నా వెళ్తున్నారేంటి.. మీరిద్దరూ మీటింగ్ పెట్టారేంటి.. నన్ను పైకి తీసుకెళ్లే ప్లాన్ ఏమైనా చేశారా? అని అడుగుతుంది అరుంధతి. ఇద్దరూ కాసేపు వాదించుకున్న తర్వాత జరిగినదంతా పూసగుచ్చినట్లు చెబుతుంది అరుంధతి. ఈ పేలుడు పదార్థమునే భరించినవాడు ఆ పేలుడు పదార్థమును ఆపలేడా అని అరుంధతిని ఏడిపిస్తాడు గుప్త.
మీతో చాలా విషయాలు మాట్లాడాలి రండి అంటున్న అరుంధతి వెంట నడుస్తూ ఘోరా ఈ పౌర్ణమికి ఈ బాలికను బంధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. అతగాడి నుంచి ఈ బాలికను కాపాడవలె అనుకుంటాడు గుప్త. ఘోరా పూజలో కూర్చొని అరుంధతి ఆత్మను బంధించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈసారి ఎలాగైనా పౌర్ణమినాడు ఆ ఆత్మను బంధిస్తానంటాడు. అది అంత సులభం కాదని హెచ్చరిస్తాడు దేవా.
ఈ ఘోరా ముందు ఎవరు నిలబడినా వాళ్లకు మిగిలేది ఓటమే అంటాడు ఘోరా. మనోహరి క్యాలెండర్ చూస్తూ పౌర్ణమి రాబోతుందని గమనిస్తుంది. ఎలాగైనా ఈ పౌర్ణమికి ఆత్మ పీడ విరగడ చేయిస్తాననుకుంటుంది. అరుంధతి నిన్ను వదలను అంటుంది. మనోహరి మాటలు వింటాడు అమర్. ఎందుకు పౌర్ణమి రోజు రౌండప్ చేశావని, ఎందుకు అరుంధతిని వదలనని అంటున్నావని నిలదీస్తాడు.
మనోహరిపై అమర్‌లో అనుమానం మొదలవనుందా? పౌర్ణమికి ఏం జరగబోతోంది? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 19న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!