NNS September 19th Episode: అరుంధతికి దొరికిన గుప్త ఉంగరం- గాల్లో వేలాడిన రాథోడ్​- మనోహరిని నిలదీసిన అమర్- భాగీ ఎంక్వైరీ-nindu noorella saavasam serial september 19th episode arundhathi took gupta ring nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns September 19th Episode: అరుంధతికి దొరికిన గుప్త ఉంగరం- గాల్లో వేలాడిన రాథోడ్​- మనోహరిని నిలదీసిన అమర్- భాగీ ఎంక్వైరీ

NNS September 19th Episode: అరుంధతికి దొరికిన గుప్త ఉంగరం- గాల్లో వేలాడిన రాథోడ్​- మనోహరిని నిలదీసిన అమర్- భాగీ ఎంక్వైరీ

Sanjiv Kumar HT Telugu
Sep 19, 2024 12:10 PM IST

Nindu Noorella Saavasam September 19th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 19వ తేది ఎపిసోడ్‌‌లో చిత్రగుప్తుడి ఉంగరం రాథోడ్ వద్ద పడుతుంది. అది తీసుకున్న రాథోడ్‌తో గుప్తా గొడవ పెట్టుకుంటాడు. దాంతో గాల్లోకి రాథోడ్ ఎగురుతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 19వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 19వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 19th September Episode) పౌర్ణమి నాడు అరుంధతిని బంధించేందుకు ఘోర ప్రయత్నిస్తున్నాడని.. వాడి నుంచి ఆరును కాపాడాలనుకుంటాడు గుప్త. మరోవైపు ఘోర.. ఈ పౌర్ణమి నాడు ఆ ఆత్మను బంధిస్తాను అంటాడు.

అరుంధతిని వదలను

తన రూంలో క్యాలెండర్‌లో పౌర్ణమిని రౌండప్‌ చేసి ఈసారి నిన్ను వదలను అరుంధతి అని గట్టిగా అరుస్తుంది మనోహరి. ఇంతలో ఆమర్‌ అక్కడికి వచ్చి అరుంధతిని వదలను అంటున్నావ్.. ఎందుకు అన్నావు? అని ప్రశ్నించడంతో మనోహరి టెన్షన్‌ పడుతుంది. పౌర్ణమిని ఎందుకు రౌండప్‌ చేశావు అని అడగడంతో మనోహరి కట్టుకథ చెప్తుంది.

ఎవరో స్వామీజీ చెప్పారని పౌర్ణమికి అరుంధతి పేరు మీద గుడిలో అన్నదానం చేయించాలని, అందుకు గుర్తు కోసం రౌండప్‌ చేశానని చెప్తుంది మనోహరి. మరి అరుంధతిని వదలను అని ఎందుకు అన్నావు అని అమర్ అడగడంతో తను నన్ను వదిలేసి వెళ్లినా నేను మాత్రం తనను ఎప్పటికీ వదలను అన్నాను అంటూ అమర్‌ ముందు ఎమోషన్‌ అయినట్టు నాటకం ఆడుతుంది.

మరోవైపు పిల్లలను పడుకోబెట్టి భాగీ తమ రూంలోకి వెళ్తుంటే అమర్‌ వస్తాడు. అమర్​ని చూసి షాకైన భాగీ మీరెప్పుడు వచ్చారు అని అడుగుతుంది. నువ్వు బుక్‌ క్లోజ్‌ చేసేటప్పుడు వచ్చాను. ఇవాళ జరిగిన దానికి పిల్లలు బయపడ్డారేమోనని చూడటానికి వచ్చాను అంటాడు అమర్​. మీరు మా పక్కన ఉండగా ఇక మాకెందుకు భయం. ఏవండి అంజు చైన్‌ తీసేసి టేబుల్‌ మీద పెట్టేసింది అని భాగీ అనగానే సరే లాకర్‌లో పేట్టేయ్‌ అంటాడు అమర్​.

మాట్లాడటం పూర్తి కాలేదు

మాట్లాడుతుంటే వెళ్లిపోతున్నారేంటి? మనుషుల మాట వినరా? లేదా మనుషులు అంటే మీకు పడదా? అంటుంది భాగీ. మనుషులా ఇక్కడ నేను తప్పా మనుషులు ఎక్కడున్నారు అని ఏడిపిస్తాడు అమర్​. జోక్‌ వేశారా? చాలా బాగుంది అని భాగీ అనగానే లేదు.. నిజమే చెప్పాను అంటాడు అమర్​. మళ్లీ ఎక్కడికి నేను మాట్లాడటం పూర్తి అవ్వలేదు ఇంకా.. అంటుంది భాగీ.

మ్యాటర్‌ తప్పా మిగతా ముచ్చట్లు అన్ని పెడతావు. చెప్పు అంటాడు అమర్​. ఈ చైన్‌ అంజుకు ఎక్కడిది..? దుర్గా మాత డాలర్‌ కదండి. కోల్‌‌కత్తా వాళ్లు ఎక్కువ వేసుకుంటారు. అంజుకు మాత్రమే ఎందుకు ఉంది. మిగతా వాళ్లకు ఎందుకు లేదు అని భాగీ అడుగుతుంది. దానికి అమర్ మౌనంగా ఉంటాడు. ఏంటండి ఏం మాట్లాడటం లేదు. ఎందుకండి ఈ మధ్య ఏదోలా బిహేవ్‌ చేశారు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదండి అంటుంది భాగీ.

చెప్పాల్సి వచ్చినప్పుడు అన్ని చెప్తాను మిస్సమ్మ. నువ్వు అడగనివి. నువ్వు అనుకోనివి అన్ని చెప్తాను అని అమర్‌ వెళ్లిపోతాడు. మీ బాధని, కష్టాలని అన్ని పంచుకోవాలండి. ఆరోజు కోసం ఎదురుచూస్తూ ఉంటాను అని అనుకుంటుంది భాగీ. గుప్త తన చేతికున్న ఉంగరం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఒకవేళ అరుంధతికి దొరికితే మళ్లీ నన్ను టార్చర్‌ పెడుతుందని భయపడుతాడు.

రాథోడ్-గుప్తా గొడవ

అటూ ఇటూ చూసి ఇక్కడ ఎక్కడ అరుంధతి లేదనుకుని ఉంగరం తీస్తాడు గుప్తా. అది జారి పోయి రాథోడ్‌ కాళ్ల దగ్గర పడుతుంది. దీంతో ఇద్దరి మధ్య కామేడీ గొడవ జరుగుతుంది. నా ఉంగరం నాకు ఇవ్వు అని గుప్త అడగ్గానే ఇదేమైనా మాయ ఉంగరమా? అయితే నేను వెంటనే గాల్లో తేలియాడాలి అంటాడు. దాంతో వెంటనే రాథోడ్‌ పైకి వెళ్తాడు. భయంతో వణికపోతుంటాడు రాథోడ్‌.

వెంటనే ఆ ఉంగరానికి కిందకు దింపమని చెప్పు దింపేస్తుంది అని గుప్తా అనగానే రాథోడ్‌ చెబుతాడు. దాంతో రాథోడ్ జారి కిందపడిపోతాడు. రాథోడ్‌ చేతిలోని ఉంగరం జారి దూరంగా పడిపోతుంది. అరుంధతి వచ్చి ఆ ఉంగరం తీసుకుంటుంది. అయ్యో నా అంగుళీకము ఎవరి వద్దకు చేరకూడదని అనుకున్నానో వారి వద్దకే చేరింది. అంతా అయిపోయింది. ఇక ఆ బాలిక నా అంగుళీకము నాకు ఇవ్వదు అనుకుంటాడు గుప్త.

కానీ, అరుంధతి వచ్చి.. గుప్త గారు తీసుకోండి.. ఉంగరం తీసుకుని మళ్లీ మాయం అయిపోండి.. అని ఉంగరం గుప్తకు ఇవ్వగానే గుప్త మాయం అవుతాడు. వెంటనే రాథోడ్‌ భయపడతాడు. ఇదంతా నిజంగానే జరిగిందా? లేక మాయ. లేదు మాయే.. అనవసరంగా ఆ మనోహరి పెట్టిన కాఫీ తాగాను. ఇదంతా ఆ కాఫీ మహిమే.. అనుకుంటూ లోపలికి వెళ్లిపోతాడు రాథోడ్.

లాకెట్ రహస్యం

అరుంధతిని చిత్రగుప్త యమ లోకానికి తీసుకెళ్తాడా? అంజు లాకెట్​ రహస్యం భాగీ ఎలా తెలుసుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్​ 20న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner