Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 17th August Episode) అరుంధతిని కూడా పూజలో కూర్చోమంటుంది భాగీ. వ్రతంలో భాగీతో పాటు అమర్ కూడా ఉంటే బాగుంటుందని ఫోన్ చేసి వెంటనే రమ్మంటుంది నిర్మల. ముందు రాలేనని చెప్పినా నిర్మల నచ్చజెప్పడంతో సరేనంటాడు అమర్.
ఇంటికి వెళ్లాలి కారు తీయమని రాథోడ్‌కి చెబుతాడు అమర్. సార్.. మీరు ఏమనుకోనంటే ఒక మాట. మిస్సమ్మ చాలా మంచిది. ఇంట్లో మేడమ్ లేని లోటు తీర్చేందుకు మిస్సమ్మ చాలా కష్టపడుతోంది సార్. ఇప్పుడు కూడా మీరు మిస్సమ్మ కోసం వెళ్లట్లేదు.. మేడమ్ గారి చెల్లెలు పూజ కోసమే వెళ్తున్నారని అర్థమైంది. కానీ, ఎప్పటికైనా మీ మనస్సులో మిస్సమ్మ స్థానం మారాలని కోరుకుంటున్నా అంటాడు రాథోడ్.
కట్ చేస్తే ఇద్దరూ ఇంటికి బయల్దేరతారు. అందరినీ కూర్చుని పూజ మొదలు పెట్టమంటుంది నిర్మల. ఇక తప్పేలా లేదని మనోహరి, అరుంధతి కూర్చుంటారు. ఎదురుగా ఉన్న అరుంధతి ఫొటో చూసేంతలో చిత్రగుప్త తోటమాలిగా వచ్చి ఆ ఫొటోని అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. కంగారుగా పరిగెడుతున్న గుప్తకు అమర్, రాథోడ్ ఎదురు పడతారు.
ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లావు? చేతిలో ఆ ఫొటో ఏంటి? అంటాడు రాథోడ్. గుప్త చేతిలో ఉన్న అరుంధతి ఫొటో చూసి అమర్, రాథోడ్ ఆశ్చర్యపోతారు. ఫొటో జాగ్రత్తగా ఇంట్లో పెట్టమని చెప్పి లోపలకు వెళ్తాడు అమర్.
పూజకు టైమ్ అవుతోందని తొందర పెట్టడంతో త్వరగా రెడీ అయి వస్తానని లోపలకు వెళ్తాడు అమర్. భాగీ కూడా రూమ్‌లోకి వెళ్లడంతో ఇద్దరూ కాసేపు గొడవపడతారు.
ఇద్దరూ కిందకి వచ్చి పూజలో కూర్చుంటారు. అమర్ పక్కనే కూర్చున్న అరుంధతి పూజ చేస్తుండగా అమర్ చెయ్యి పట్టుకుంటుంది. తను బతికి ఉండగా అమర్ తనతో పూజ చేయించిన రోజుల్ని గుర్తు చేసుకుంటుంది. పూజ పూర్తవగానే అమర్ ఆశీర్వాదం తీసుకోమని భాగీకి చెబుతుంది నిర్మల. భాగీ అమర్ ఆశీర్వాదం తీసుకోగానే ఇద్దరూ కలిసి నిర్మల, శివరామ్ ఆశీర్వాదం తీసుకుంటారు.
తను కూడా అమర్ ఆశీర్వాదం తీసుకుంటేనే పూజా ఫలం దక్కుతుందని భావిస్తుంది అరుంధతి. ముత్తైదవులకు వాయనాలు తీసుకురమ్మని నిర్మల భాగీని లోపలకు పంపించగానే తొందరగా వచ్చి అమర్ కాళ్లకు దణ్ణం పెడుతుంది. అమర్ తన తలపై పడిన అక్షితలను దులుపడంతో అవి ఆరు తల మీద పడతాయి. వెంటనే అక్కడ నుంచి ఏడుస్తూ బయటకు వచ్చేస్తుంది అరుంధతి.
భాగీ అందరికీ వాయనాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. అరుంధతి కనిపించకపోవడంతో అక్క ఇప్పటివరకూ ఇక్కడే ఉంది కదా.. ఇప్పుడు ఎక్కడకు వెళ్లిందని చుట్టూచూస్తుంది. కానీ, అరుంధతి కనిపించకపోవడంతో నిరాశపడుతుంది. చనిపోయినా అమ్మ అనుగ్రహంతో వ్రతం చేసుకున్నందుకు అరుంధతిని పొగుడుతాడు గుప్త.
నిజంగా వ్రతం చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని కానీ, ఆ మనోహరిని ఇంట్లో నుంచి పంపించి అమ్మానాన్నలను ఒక్కసారి చూస్తే ఇంకా తనకి ఇంకేం అక్కర్లేదని అంటుంది. దాంతో ఆలోచనలో పడతాడు గుప్త. అరుంధతి తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటుందా? భాగీ అడ్డు తొలిగించుకోవడానికి మనోహరి ఏం చేయనుంది? అనే విషయాలు తెలియాలంటే ఆగస్టు 18న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!