NNS 9th August Episode: నిజం భాగీకి చెప్పలేనన్న అమర్.. పప్పులో కాలేసిన ఘోరా.. మనోహరికి షాక్!
NNS 9th August Episode: నిండు నూరేళ్ల సావాసం శుక్రవారం (ఆగస్ట్ 9) ఎపిసోడ్లో అరుంధతి లేదన్న నిజాన్ని భాగీకి చెప్పలేనని అమర్ అంటాడు. అటు ఘోరా చేతికి అరుంధతి ఆత్మ కాకుండా మరో ఆత్మ చిక్కడంతో మనోహరి షాక్ తింటుంది.
NNS 9th August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 9) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రామ్మూర్తి వెతుకుతున్న తన పెద్దకూతురు అరుంధతి మేడమే అని చెప్పేద్దామంటాడు రాథోడ్. కానీ తను ఆ విషయం వాళ్లతో చెప్పలేనంటాడు అమర్. పాతికేళ్లుగా తన పెద్దకూతురు కోసం వెతుకుతూ ఎప్పటికైనా ఆమెను కనుక్కుంటాననే ఆశతో బతుకుతున్న ఆయనకు మీ కూతురు ఇక లేదని ఎలా చెప్పమంటావు రాథోడ్.
నిజం చెప్పలేనన్న అమర్
వరుసకి అక్కా అని పిలుచుకునే ఆరునే బతికిలేదనే విషయం తెలిస్తే భాగీ తట్టుకోలేదని చెప్పలేదు కదా.. మరి ఇప్పుడు తన తోడబుట్టిన అక్క బతికిలేదనే విషయం చెబితే ఎలా తట్టుకుంటుంది రాథోడ్ అంటాడు అమర్. మిస్సమ్మ ఈ విషయాన్ని తట్టుకోగలదా.. ఆ పెద్దాయన కళ్లల్లో పశ్చాత్తాపం చూశావా.. ఇక దానికి ప్రాయశ్చిత్తం లేదని ఎలా చెప్పమంటావు అంటాడు.
ఆరు చనిపోయిందనే విషయం చెప్పి వాళ్ల గుండె పగిలేలా చేయడం కంటే ఎప్పటికీ ఆ నిజం చెప్పకుండా ఉండటమే మంచిది. ఇవాళ మనం తెలుసుకున్న నిజాన్ని ఇక్కడే సమాధి చేసి వెళ్దాం రాథోడ్ అంటూ అరుంధతి పంచెను హత్తుకుని ఏడుస్తాడు అమర్. రాథోడ్ కూడా బాధపడతాడు.
ఘోరా చేతికి వేరే ఆత్మ
అరుంధతి ఆత్మను బంధించానని సంతోషపడతాడు ఘోరా. కానీ ఆ సీసాలో అరుంధతి కాకుండా వేరే ఆత్మ బంధీ అవుతుంది. ఆమె ఆత్మను చూసి చిత్రగుప్త, అరుంధతి భయపడతారు. నీవొక ఆత్మవై ఉండి తోటి ఆత్మను చూసి భయపడతావా? అంటాడు చిత్రగుప్త. అరుంధతి బదులు వేరే ఆత్మ బంధీ అవడం చూసి ఆశ్చర్యపోతాడు ఘోరా.
కంగారు పడుతుంది మనోహరి. నా అస్థికల్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చావో అక్కడే పెట్టేయ్ అంటుంది ఆ ఆత్మ. లేదంటే దయ్యమై పట్టి పీడిస్తానని బెదిరిస్తుంది. తన అస్థికల నుంచి ఆమె ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతుంది అరుంధతి. అవి నీ అస్థికలు కావని చెబుతాడు చిత్రగుప్త. వాటిని మనోహరి చేతికి చిక్కకుండా భాగమతి మార్చేందుకు లాకర్ నెంబర్ మార్చిన విషయం అరుంధతికి చెబుతాడు.
నా అస్థికలు కావని తెలిసి కూడా నన్ను కంగారు పెట్టారా అని కోప్పడుతుంది అరుంధతి. కావాలనే ఆటపట్టించానని నవ్వుతాడు చిత్రగుప్త. అరుంధతి అస్థికలు తీసుకురమ్మంటే ఎవరివో తెచ్చావా అని మనోహరిని కోప్పడతాడు ఘోరా. ఒక్కపని సరిగ్గా చేయడం చేతకాదు.. ప్రగల్భాలు పలుకుతూ ఉంటావు అంటాడు. ఏదో ఒక ఆత్మ దొరికింది కదా.. పూజ చెయ్యి అంటుంది మనోహరి. కానీ అరుంధతి ఆత్మనే కావాలంటాడు ఘోరా. మనోహరి నచ్చజెప్పుతున్నా వినకుండా అక్కడనుంచి వెళ్లిపో అని అరుస్తాడు.
అబద్ధం చెప్పిన మంగళ
రామ్మూర్తిని పడుకోమంటుంది భాగీ. అమర్ అక్క గురించి తెలుసుకుని వస్తానన్నారు కదా.. ఆయన ఏం చెబుతారో విన్నాక పడుకుంటానంటాడు రామ్మూర్తి. అసలు నిజం తెలిస్తే ఇప్పుడే చస్తావు అని మనసులో అనుకుంటుంది మంగళ. ఆశ్రమం నుంచి వార్డెన్ ఫోన్ చేసి అరుంధతి కోసం ఆయన భర్త వచ్చాడని రామ్మూర్తితో చెప్పమంటుంది.
కానీ ఆ విషయం రామ్మూర్తి, భాగీకి తెలియకుండా వేరే వాళ్లతో మాట్లాడినట్లు మాట్లాడుతుంది మంగళ. రామ్మూర్తికి ఫోన్ ఇవ్వకుండా తనే చెప్తానని మేనేజ్ చేస్తుంది. ఫోన్లో ఎవరని అడిగిన రామ్మూర్తికి నిజం చెప్పకుండా రాంగ్ కాల్ అని అబద్దం చెబుతుంది మంగళ. అమర్‌కి చేరువై ఎలాగైనా మనోహరి ఆట కట్టించాలనుకుంటాడు రణ్వీర్.
అందుకోసం అమర్‌ని ముందుగా నమ్మించాలని ప్లాన్ చేస్తాడు. అమర్ ఇంటికి వెళ్లి ఆ రోజు జరిగినదానికి తనని క్షమించమని వేడుకుంటాడు. రణ్వీర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మనోహరి గతం బయటపడనుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్టు 09న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!