Smartphone Discount : 100ఎంపీ బ్యాక్ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా.. తక్కువ ధరలోనే స్టైలిష్ ఫోన్!-tecno camon 30 5g smartphone available with 18 percent discount know affordable price and other features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartphone Discount : 100ఎంపీ బ్యాక్ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా.. తక్కువ ధరలోనే స్టైలిష్ ఫోన్!

Smartphone Discount : 100ఎంపీ బ్యాక్ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా.. తక్కువ ధరలోనే స్టైలిష్ ఫోన్!

Anand Sai HT Telugu
Dec 01, 2024 10:45 PM IST

Tecno Camon Phone Discount : తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ కొనాలి అనుకుంటే.. టెక్నో స్మార్ట్ ఫోన్ మీకోసం వెయిట్ చేస్తోంది. మంచి ఆఫర్లతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కెమెరా కూడా బాగుంటుంది.

టెక్నో ఫోన్‌పై డిస్కౌంట్
టెక్నో ఫోన్‌పై డిస్కౌంట్

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారి కోసం గుడ్‌న్యూస్. ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి ఇది సరైన సమయం. అమెజాన్‌లో తక్కువ ధరతో టెక్నో స్మార్ట్ ఫోన్ కొనవచ్చు. ప్రస్తుతం టెక్నో Camon 30 5G ఫోన్ ధర తక్కువతో ఉంది. మీరు 18 శాతం తగ్గింపు ధరతో పొందుతారు. అలాగే 10 శాతం క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉన్నాయి. 20 వేల లోపే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు చూద్దాం..

yearly horoscope entry point

Tecno Camon 30 5జీ మొబైల్ ఈ ఏడాది మేలో విడుదలైంది. ఇది రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో విక్రయిస్తున్నారు. మీరు దీనిని సాల్ట్ వైట్, బాలిస్టిక్ డార్క్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 100 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇందులో 6.78-అంగుళాల డిస్‌ప్లే, 256జీబీ స్టోరేజ్, 5000mAh బ్యాటరీ, 70W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.

కంపెనీ టెక్నో 30 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.27999కి విడుదల చేసింది. 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్ ఆప్షన్ రూ.32,999కి విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు వేరియంట్‌ల ధర అమెజాన్‌లో రూ.3000 వరకు తగ్గుతుంది. తగ్గింపు తర్వాత 8జీబీ ర్యాప్ ఫోన్ ధర రూ. 22,999, 12జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ. 26,999కి అందుబాటులో ఉంది. అంతేకాకుండా 10 శాతం క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉన్నాయి.

టెక్నో కామన్ 30 5జీ మొబైల్ 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పూర్తి హెచ్‌డీ ప్లస్ LTPS అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080 x 2436 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది.

మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో టెక్నో కామన్ 30 5G ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్లలో తయారు అయింది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Hi ఓఎస్ 14లో పని చేస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ Mali G610 GPUని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 12GB RAMతో విడుదల చేశారు. రెండు వేరియంట్లలో 256జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఉంది.

టెక్నో కామన్ 30 5జీ మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ ఓఐఎస్ సపోర్ట్‌తో 100-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 70W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఇచ్చారు. ఈ ఫోన్ కేవలం 19 నిమిషాల్లో 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం