Bigg Boss Reject: బిగ్ బాస్ ఆఫర్‌ను రెజెక్ట్ చేసిన సీరియల్ సెలబ్రిటీలు వీళ్లే.. హాట్ నుంచి బోల్డ్ బ్యూటి వరకు!
Bigg Boss Rejected Celebrities List: దేశంలో అత్యధిక పాపులారిటీ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. అలాంటి ఈ షోలో పాల్గొనమని బిగ్ బాస్ నుంచి వచ్చిన ఆఫర్‌ను రెజెక్ట్ చేశారు కొంతమంది సెలబ్రిటీలు. వారిలో హాట్ నుంచి బోల్డ్ బ్యూటి వరకు ఉన్నారు. మరి వారెవరో తెలుసుకుందాం.
(1 / 7)
యే హై మొహబత్తీన్ సీరియల్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఫైనెస్ట్ నటి దివ్యాంక త్రిపాఠి. ఈ సీరియల్ తెలుగులో కూడా చాలా హిట్ అయింది. సీరియల్ నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న దివ్యాంక త్రిపాఠి బిగ్ బాస్ ఆఫర్‌ను సింపుల్‌గా రెజెక్ట్ చేసింది. (instagram)
(2 / 7)
బేయద్ అనే హిందీ సీరియల్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటి జెన్నిఫర్ వింజెట్. ఈ సీరియల్‌ను తెలుగులో నువ్వు నాకు నచ్చావ్ అనే టైటిల్‌తో జెమినీ ఛానెల్‌లో డబ్ చేశారు. ఈ ముద్దుగుమ్మ కూడా బిగ్ బాస్ ఆఫర్‌ను కాదనుకుంది. (instagram)
(3 / 7)
హేట్ స్టోరీ 3, ఎలోన్ సినిమాలతో పాపులర్ అయిన హీరో కరణ్ సింగ్ గ్రోవర్ కూడా తనకున్న ఫేమ్ చాలానే భావనతో బిగ్ బాస్ హిందీ షో ఆఫర్‌ను వద్దనుకున్నాడు. కాబుల్ హై, కాబుల్ హై 2, దిల్ మిల్ గయ్ సీరియళ్లతో క్రేజ్ సంపాదించుకున్న కరణ్ సింగ్ గ్రోవర్ ఇటీవల ఫైటర్ సినిమాలోనూ నటించాడు.(instagram)
(4 / 7)
బాలిక వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు), బేకాబు ఇతర సీరియళ్లలో ఫేమ్ సంపాదించుకున్న శివంగి జోషి బిగ్ బాస్ ఆఫర్‌ను తిరస్కరించింది. (instagram)
(5 / 7)
దేవోన్ కి దేవ్ మహాదేవ్ అనే సూపర్ హిట్ హిందీ సీరియల్‌లో పార్వతిగా అలరించింది సోనారికా భడోరియా. అనంతరం తెలుగులో హీరో నాగ శౌర్య సరసన జాదూగాడూ సినిమాలో హీరోయిన్‌గా చేసి డెబ్యూ ఇచ్చింది. తర్వాత తెలుగులో కనుమరుగైన సోనారిక సైతం హిందీలో బిగ్ బాస్ ఛాన్స్ వద్దనుకుంది. (instagram)
(6 / 7)
సెక్స్ హాలిక్ అనే షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన హాట్ బ్యూటి షామా సికందర్ యే మేరీ లైఫ్ హై, మాయ స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్ వంటి అడల్డ్ కంటెంట్ టీవీ సిరీసులతో పాపులర్ అయింది. ఈ బోల్డ్ బ్యూటి కూడా బిగ్ బాస్ ఆఫర్‌ను వద్దనుకుంది.(instagram)
ఇతర గ్యాలరీలు