Prabhas Hombale Films: ప్రభాస్‌తో వరుసగా మూడు సినిమాలు చేయనున్న హోంబలే ఫిల్మ్స్.. లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మలతో..-prabhas hombale films three movies lokesh kanagaraj prasanth varma to direct ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Hombale Films: ప్రభాస్‌తో వరుసగా మూడు సినిమాలు చేయనున్న హోంబలే ఫిల్మ్స్.. లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మలతో..

Prabhas Hombale Films: ప్రభాస్‌తో వరుసగా మూడు సినిమాలు చేయనున్న హోంబలే ఫిల్మ్స్.. లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మలతో..

Hari Prasad S HT Telugu
Nov 08, 2024 03:16 PM IST

Prabhas Hombale Films: ప్రభాస్ తో మరో మూడు సినిమాలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది హోంబలే ఫిల్మ్స్. వాటిలో లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మలతో రెండు మూవీస్ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే.

ప్రభాస్‌తో వరుసగా మూడు సినిమాలు చేయనున్న హోంబలే ఫిల్మ్స్.. లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మలతో..
ప్రభాస్‌తో వరుసగా మూడు సినిమాలు చేయనున్న హోంబలే ఫిల్మ్స్.. లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మలతో..

Prabhas Hombale Films: రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఒకేసారి మూడు సినిమాలు అనౌన్స్ చేసింది హోంబలే ఫిల్మ్స్. ఇప్పటికే కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన ఈ ప్రొడక్షన్ హౌజ్.. ఇప్పుడు అదే ప్రభాస్ తో వరుసగా మూడేళ్ల పాటు మూడు సినిమాలు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించడం విశేషం. సలార్ 2తోనే ఈ మూడు సినిమాల ప్రయాణం మొదలువుతుందని శుక్రవారం (నవంబర్ 8) ఒక ప్రకటనలో వెల్లడించింది.

ప్రభాస్‌తో హోంబలే ఫిల్మ్స్

ప్రభాస్ తో ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ సలార్ మూవీ తీసిన సంగతి తెలుసు కదా. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో సలార్ 2 కూడా సిద్ధమవుతోంది. ఇదొక్కటే కాదు.. రెబల్ స్టార్ లో మరో రెండు మూవీస్ కూడా చేయనున్నట్లు ఆ ప్రొడక్షన్ హౌజ్ వెల్లడించింది. ఈ మూడు సినిమాలు 2026, 2027, 2028లలో రిలీజ్ కానున్నట్లు కూడా చెప్పింది. అంటే 2026లో ముందుగా సలార్ 2 రాబోతోంది.

ఈ విషయాన్ని శుక్రవారం (నవంబర్ 8) తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపింది. ది హోంబలే ఈజ్ కాలింగ్ ప్రభాస్ అనే పోస్టర్ ను ఈ సందర్భంగా ట్వీట్ కు జత చేసింది. "రెబల్ స్టార్ ప్రభాస్ తో చేతులు కలుపుతున్నందుకు గర్వంగా ఉంది. ఇండియన్ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటూనే వాటిని విశ్వవ్యాప్తం చేయడానికి ఏకంగా మూడు సినిమాల భాగస్వామ్యంతో వస్తున్నాం.

మరపురాని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించే దిశలో మా అంకిత భావాన్ని చూపించే డిక్లరేషన్ ఇది. సిద్ధంగా ఉండండి.. సలార్ 2తోనే జర్నీ మొదలుకానుంది" అనే క్యాప్షన్ తో హోంబలే ఫిల్మ్స్ ఈ అద్భుతమైన విషయాన్ని ప్రభాస్ అభిమానుల ముందుకు తీసుకొచ్చింది.

ఆ ఇద్దరు డైరెక్టర్లతోనేనా?

ప్రభాస్ తో హోంబలే ఫిల్మ్స్ తీయబోయే నెక్ట్స్ మూవీ సలార్ 2. దీనికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గా ఉంటాడు. కానీ తర్వాతి రెండు సినిమాలకు డైరెక్టర్లు ఎవరన్న చర్చ మొదలైంది.

అయితే బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకులు లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మలతో ఆ రెండు మూవీస్ ఉండబోతున్నట్లు gulte రిపోర్టు వెల్లడించింది. అదే నిజమైతే బాక్సాఫీస్ దుమ్ముదులిపే రికార్డు బ్రేకింగ్ మూవీస్ రావడం ఖాయం. తెలుగులో హనుమాన్ లాంటి మూవీ అందించిన రికార్డు ప్రశాంత్ వర్మకు ఉండగా.. అటు విక్రమ్, లియోలాంటి మూవీస్ తో లోకేష్ కనగరాజ్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగింది.

అలాంటి డైరెక్టర్లు ప్రభాస్ తో మూవీస్ తీస్తే.. వాళ్లకు హోంబలే ఫిల్మ్స్ లాంటి టాప్ ప్రొడక్షన్ హౌజ్ కలిస్తే.. ఇక ఆ రికార్డులకు అంతే ఉండదు. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఇవే కాకుండా కల్కి 2898 ఏడీ మూవీ సీక్వెల్ కూడా లైన్లో ఉంది. ఆ లెక్కన వచ్చే ఐదేళ్ల పాటు ప్రభాస్ ఊపిరి సలపని షూటింగులతో బిజీగా ఉండబోతున్నాడు.

Whats_app_banner