Andhra Pradesh Appulu : వామ్మో.. ఆంధ్రప్రదేశ్ నెత్తిమీద ఇన్ని అప్పులు ఉన్నాయా!-cm chandrababu makes key remarks in the assembly regarding andhra pradesh debts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh Appulu : వామ్మో.. ఆంధ్రప్రదేశ్ నెత్తిమీద ఇన్ని అప్పులు ఉన్నాయా!

Andhra Pradesh Appulu : వామ్మో.. ఆంధ్రప్రదేశ్ నెత్తిమీద ఇన్ని అప్పులు ఉన్నాయా!

Basani Shiva Kumar HT Telugu
Nov 15, 2024 03:22 PM IST

Andhra Pradesh Appulu : ఏపీ అప్పుల గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టం ఎక్కువని వ్యాఖ్యానించారు. అప్పులకు సంబంధించిన లెక్కలను చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. మొత్తం 9 లక్షల కోట్లకు పైగా అప్పు ఉంది.

ఏపీ అప్పులు
ఏపీ అప్పులు (istockphoto)

గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక ఉగ్రవాదం రాజ్యమేలిందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజలు నమ్మి ఓట్లేస్తే.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని విమర్శించారు. సంపద సృష్టించే పని ఒక్కటి కూడా చేయలేదని.. పెట్టబడులు పెట్టేందుకు వస్తే.. తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ బడ్జెట్‌పై అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు.. అప్పులకు సంబంధించి లెక్కలు ప్రకటించారు.

ఏపీ అప్పులు ఇలా..

గవర్నమెంట్ అప్పు - రూ.4,38,278 కోట్లు

పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ - రూ.80,914 కోట్లు

కార్పొరేషన్ అప్పు - రూ.2,48,677 కోట్లు

సివిల్ సప్లైస్ కార్పొరేషన్ - రూ.36,000 కోట్లు

పవర్ సెక్టార్ - రూ.34,267 కోట్లు

అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ - రూ.1,13,244 కోట్లు

అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ - రూ. 21,980 కోట్లు

నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ - రూ.1,191 కోట్లు.

ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు

ఇప్పటి వరకు రూ.9,74,556 కోట్ల అప్పు తేలిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రూ.431 కోట్లతో రుషికొండ ప్యాలెస్‌ నిర్మించారని.. రుషికొండ ప్యాలెస్‌ను చూస్తే కళ్లు తిరుగుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజాధనంతో ఇంత పెద్ద ప్యాలెస్‌ కడతారా? పర్యావరణాన్ని విధ్వంసం చేసి రుషికొండ ప్యాలెస్‌ కట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేశారని.. ఓ పత్రికకు రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారని వెల్లడించారు. రూ.500 కోట్లు ఖర్చు చేసి ఉంటే రోడ్లు బాగయ్యేవని చంద్రబాబు స్పష్టం చేశారు.

'గత ప్రభుత్వం ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చింది. మేం అధికారంలోకి వచ్చేసరికి ఏపీ వెంటిలేటర్‌పై ఉంది. నా దగ్గర డబ్బుల్లేవు. నూతన ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. కొత్త ఆలోచనలతో సంపద సృష్టిద్దాం.. పేదలకు పంచుదాం. ఏడాదికి రూ.33 వేల కోట్ల పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీనే. 64.50 లక్షల మందికి ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం' అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

'మద్యం పైనా ఇంత అవినీతి చేస్తారని ఊహించలేదు. మద్యంపై రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఉద్యోగ అవకాశాలు కోల్పోయింది. గ్రామాల్లో ఉచితంగా లభించే ఇసుకపై వ్యాపారం చేసుకున్నారు. చెత్తపైనా పన్ను వేసి అనేక ఇబ్బందులు పెట్టారు. గత ఐదేళ్లు ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ఎన్నో పనులు చేశారు' అని చంద్రబాబు విమర్శించారు.

Whats_app_banner