Diabetes: డయాబెటిక్ పేషెంట్లు పెరుగులో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తినండి, ఇది చేసే మ్యాజిక్ చూడండి-diabetic patients add cinnamon powder to yogurt and see the magic it does ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: డయాబెటిక్ పేషెంట్లు పెరుగులో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తినండి, ఇది చేసే మ్యాజిక్ చూడండి

Diabetes: డయాబెటిక్ పేషెంట్లు పెరుగులో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తినండి, ఇది చేసే మ్యాజిక్ చూడండి

Haritha Chappa HT Telugu
Aug 29, 2024 04:30 PM IST

Diabetes: దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ బిర్యానీలో తప్ప ఇంకెక్కడా దీన్ని వాడరు. పెరుగులో దాల్చినచెక్క పొడి కలుపుకొని తింటే డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు జరుగుతుంది.

పెరుగుతో డయాబెటిస్ తగ్గుతుందా?
పెరుగుతో డయాబెటిస్ తగ్గుతుందా? (Unsplash)

Diabetes: దాల్చిన చెక్క పొడిని వాడే వారి సంఖ్య తక్కువగానే ఉంది. బిర్యానీలో, కూరల్లో చిన్న దాల్చిన చెక్క ముక్క వేస్తారు. కానీ దాల్చిన చెక్క పొడిని మాత్రం ఇంట్లో ఉంచుకోరు. డయాబెటిక్ పేషెంట్లు దాల్చిన చెక్కని పొడి రూపంలో మార్చేసి డబ్బాలో భద్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఒక కప్పు పెరుగులో ఒక పావు స్పూను దాల్చిన చెక్క పొడిని వేసి ఆ పెరుగును తినాలి. ఇలా రెండు మూడు వారాలపాటు తిని చూడండి. మీలో ఆరోగ్యం మెరుగైనట్టు అనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడం గుర్తిస్తారు. ముఖ్యంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగ్గా ఉంటుంది.

డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఆహారాన్ని ప్రత్యేక శ్రద్ధతో తీసుకోవాలి. దాల్చిన చెక్క పొడి, పెరుగు ఈ రెండింటి కాంబినేషన్ మీలో మధుమేహం పెరగకుండా అడ్డుకుంటుంది. ఒక నెలరోజుల పాటు దాల్చిన చెక్క పొడిని కలిపిన పెరుగును తినండి. మీలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడం గుర్తిస్తారు. ఎన్నో పరిశోధనలు పెరుగు, దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీ, బ్లడ్ షుగర్ స్థాయిలపై మంచి ప్రభావాన్ని చూపుతాయని నిరూపించాయి.

దాల్చిన చెక్క ఎందుకు తినాలంటే...

దాల్చిన చెట్టు బెరడునే దాల్చిన చెక్కగా వాడుతాము. ఈ దాల్చినచెక్కలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం ఉంది. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఇది రక్త ప్రవాహం నుండి గ్లూకోజ్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారిలో శరీర కణాలు ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అయితే దాల్చిన చెక్క పొడిని తినడం వల్ల శరీరకణాలు గ్లూకోజ్‌ను ఉపయోగించే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి అని అధ్యయనాలు చెబుతున్నాయి.

దాల్చిన చెక్క శరీరంలో చేరాక పొట్టలో కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమై రేటును తగ్గిస్తుంది. దీనివల్ల భోజనం చేశాక ఒకేసారి రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. కాబట్టి పెరుగులో చిటికెడు లేదా పావు స్పూను దాల్చిన చెక్క పొడి వేసుకుని తింటూ ఉండండి.

ఇన్సులిన్ స్థాయిలు

దాల్చిన చెక్క లో ఉండే కొన్ని సమ్మేళనాలు ఇన్సులిన్ ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తాయని పరిశోధనలో తేలింది. ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా దాల్చిన చెక్కలోని సమ్మేళనాలు గ్లూకోజ్ ను గ్రహించేలా చేస్తాయి.

ఒక కప్పు పెరుగులో దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఈ విషయాన్ని శాస్త్రీయంగా శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. కాబట్టి మధుమేహం ఉన్నవారికి దాల్చిన చెక్క పొడి పెరుగులో వేసుకొని తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

రక్తంలో చక్కె ర స్థాయిలు

పెరుగు విషయానికి వస్తే దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ప్రోటీన్ అధికంగా ఉంటుంది. తక్కువగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అమాంతం పెరగవు. అలాగే తెలుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తంలో చక్కెర పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. పొట్టలోని గట్ బ్యాక్టీరియాలో అసమతుల్యత రాకుండా ఇవి అడ్డుకుంటాయి.

పెరుగులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. విటమిన్ డి కూడా లభిస్తుంది. ఈ రెండూ కూడా గ్లూకోజ్ జీవక్రియకు ముఖ్యమైనవి. క్యాల్షియం ఇన్సులిన్ ఉత్పత్తిలో సహాయపడితే విటమిన్ డి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. కాబట్టి పెరుగు, దాల్చిన చెక్క కలిపి తినడం వల్ల వాటిలోని సుగుణాలు అన్ని డయాబెటిస్ రోగులకు వరంలా మారుతాయి.

టాపిక్