Yoga for Brain Power: మీ పిల్లల చేత ఈ మూడు యోగాసనాలు ప్రతిరోజూ వేయించండి, వారి బ్రెయిన్ పవర్ పెరుగుతుంది
Yoga for Brain Power: ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు చదువుపై ఎంతో దృష్టి పెడుతున్నారు. వారి పిల్లలు చదివిన పాఠాన్ని త్వరగా మర్చిపోతున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. మీ పిల్లలకు ఇలాంటి సమస్యే ఉంటే ప్రతిరోజూ వారితో ఈ సింపుల్ యోగసనాలు వేయించండి. వారి బ్రెయిన్ పవర్ పెరుగుతుంది.
వయస్సు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి కోల్పోవడం సాధారణం. వయసు పెరిగే కొద్దీ శరీరం మాత్రమే కాదు మెదడుకు కూడా వృద్ధాప్యం వస్తుంది. కానీ చిన్నవయసులోనే పిల్లలు, యువకులు విషయాలను మర్చిపోవడం జరుగుతోంది. వారు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకశక్తి బలహీనంగా ఉందని ఫిర్యాదు చేస్తారు. తమ పిల్లలు చదువుపై అస్సలు దృష్టి పెట్టడం లేదని, చదివిన పాఠాన్ని త్వరగా మర్చిపోతున్నారని వాపోతున్నారు. మీ పిల్లల విషయంలో మీకు ఇలాంటి ఫిర్యాదు ఉంటే, ఖచ్చితంగా ఈ మూడు యోగా ఆసనాలను అతని దినచర్యలో భాగం చేయండి. ఇవి చాలా సింపుల్ యోగాసనాలు. పిల్లలు సులువుగా వీటిని వేయొచ్చు.
పద్మాసన యోగం
పద్మాసనాన్ని లోటస్ ముద్ర అని కూడా అంటారు. ఈ యోగాసనం కండరాల ఉద్రిక్తతను తగ్గించడం ద్వారా మనశ్శాంతిని అందించడంలో సహాయపడుతుంది. ఈ యోగా చేయడం వల్ల మెదడు చురుగ్గా మారడంతో పాటు మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. పద్మాసన యోగం చేయాలంటే ముందుగా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని కుడి కాలుని ఎడమ తొడ పైన ఉంచాలి. ఈ స్థితిలో, మీ కుడి పాదం అరికాళ్ళు పైకి ఉండాలి. మడమ పొట్టకు సమీపంలో ఉండాలి. అదేవిధంగా ఎడమ కాలును కుడి తొడ పైన ఉంచాలి. ఇప్పుడు మీ రెండు చేతులను మోకాళ్లపై ధ్యాన భంగిమలో ఉంచి లోతైన శ్వాస తీసుకోండి. ఇలా చేసేటప్పుడు, మీ పూర్తి దృష్టిని శ్వాసపై ఉంచండి. ఇలా చేయడం వల్ల బాహ్య ఒత్తిడి, ఆందోళన వంటివి ఉండవు.
పశ్చిమోత్తనాసనం
పశ్చిమోత్తనసనం చేయడానికి, కాళ్ళు చాచి కూర్చుని శరీరాన్ని ముందుకు వంచాలి. ఈ ఆసనం చేసేటప్పుడు ముందుకు వంగడం వల్ల మెదడులో రక్తప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంతో మానసిక ఆరోగ్యం బాగుంటుంది. పశ్చిమోత్తనాసనం చేయడానికి, రెండు కాళ్ళను నిటారుగా నేలపై చాపాలి. ఇలా చేసేటప్పుడు, మీ రెండు కాళ్ళ మధ్య దూరం ఉంచవద్దు. ఇప్పుడు మీ రెండు అరచేతులను మెడ, తల, వెన్నెముకను నిటారుగా ఉంచండి. ఇప్పుడు మీ తల, మొండెం ముందుకు వంచండి. మీ మోకాళ్ళను వంచకుండా చేతుల వేళ్ళతో పాదాల కాలి వేళ్ళను తాకడానికి ప్రయత్నించండి. ఇలా చేసేటప్పుడు లోతైన శ్వాస తీసుకోండి. మీ తలతో రెండు మోకాళ్ళను, మీ మోచేతులతో నేలను తాకడానికి ప్రయత్నించండి. తరువాత సాధారణ భంగిమలోకి వచ్చి విశ్రాంతి తీసుకొని శ్వాస తీసుకోండి. ఈ ఆసనాన్ని 3 నుండి 4 సార్లు పునరావృతం చేయండి.
శవాసనం
చాలాసార్లు టెన్షన్ లేదా అసౌకర్యం వల్ల మనసు ప్రశాంతంగా ఉండలేకపోతుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మనస్సును రిలాక్స్ చేయడానికి శవాసన సహాయం తీసుకోవచ్చు. శవాసనం చేయాలంటే ముందుగా యోగా చాపపై వెల్లకిలా పడుకోవాలి. ఇలా చేసేటప్పుడు, మీ చేతులు, కాళ్ళను చాచి ఉంచండి. విశ్రాంతి తీసుకుంటూనే లోతైన శ్వాస తీసుకోండి.
పైన చెప్పిన యోగాసనాలు వేయడం చాలా సింపుల్. పిల్లలు సులభంగా వేస్తారు. కాబట్టి ప్రతిరోజూ పావుగంట సేపు ఈ ఆసనాలు వేయించండి చాలు. వారిలో మార్పు నెలరోజుల్లోనే చూస్తారు.