Anthology Thriller OTT: ఓటీటీలోకి వచ్చిన కన్నడ ఆంథాలజీ థ్రిల్లర్ మూవీ - స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లు మైండ్‌బ్లోయింగ్
Anthology Thriller OTT: కన్నడ అంథాలజీ థ్రిల్లర్ మూవీ రూపాంతర సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రూపాంతర మూవీలో రాజ్‌బీ శెట్టి, అంజన్ భరద్వాజ్, హనుమక్క కీలక పాత్రల్లో నటించారు.
Anthology Thriller OTT: కన్నడ అంథాలజీ మూవీ రూపాంతర సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. జూలై నెలలో థియేటర్లలో రిలీజైన ఈ కన్నడ మూవీ పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్నది. స్టోరీ, స్క్రీన్‌ప్లేతో పాటు డైరెక్టర్ టేకింగ్, యాక్టింగ్ బాగున్నాయంటూ కామెంట్స్ వినిపించాయి. థియేటర్లలో రిలీజైన నెలన్నర తర్వాత రూపాంతర మూవీ ఓటీటీలోకి వచ్చింది.
రాజ్ బీ శెట్టి హీరో...
రూపాంతర మూవీలో కన్నడ అగ్ర దర్శకుడు రాజ్ బీ శెట్టి కీలక పాత్రలో నటించాడు. అతడితో పాటు లేఖనాయుడు, అంజన్ భరద్వాజ్, సోమశేఖర్, భరత్ జీబీ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు.
మొత్తం నాలుగు కథలతో అంథాలజీ డ్రామా థ్రిల్లర్‌గా దర్శకుడు మిథిలేష్ రూపాంతర మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాతోనే దర్శకుడిగా మిథిలేష్ సాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
రూపాంతర కథ ఇదే...
సమకాలీన సమాజంలోని సమస్యలకు థ్రిల్లర్ అంశాలను జోడించి దర్శకుడు నాలుగు కథలను రూపంతర మూవీలో చూపించాడు. పల్లెటూరికి చెందిన వృద్ధులైన రైతు దంపతులు అనుకోకుండా సిటీకి వలస వస్తారు ఉరుకులపరుగుల ప్రపంచంలో వారు ఎదుర్కొన్న కష్టాలను ఫస్ట్ స్టోరీలో చూపించాడు డైరెక్టర్.
బిచ్చగత్తె దగ్గర బాగా డబ్బు ఉండటం చూసి పోలీస్ ఆఫీసర్‌తో కానిస్టేబుల్ ఆమెను అనుమానిస్తారు. బిచ్చగత్తె గురించి సాగించిన అన్వేషణలో వారు తెలుసుకున్న నిజాలను రెండో స్టోరీలో డైరెక్టర్ థ్రిల్, ఎమోషన్స్ కలగలిపి ఆవిష్కరించారు.
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారిన ఓ యువకుడు జీవితంలో ఏం కోల్పోయాడు? ఆ డార్క్ వరల్డ్ నుంచి ఎలా బయటపడ్డాడన్నది మూడో కథలో కనిపిస్తుంది. అనుకోకుండా ఓ లోకల్ రౌడీతో ఐటీ ఎంప్లాయ్ గొడవపడతాడు. ఈ గొడవ ఎలాంటి పరిణామాలకు దారితీసింది? శత్రువులుగా ఉన్న వారిద్దరు ఎలా మిత్రులుగా మారారన్నది చివరి ఎపిసోడ్‌లో డైరెక్టర్ చూపించారు. ఈ నాలుగు కథలను ఆడియెన్స్ ఊహలకు అందని ట్విస్ట్‌లు, డ్రామాతో దర్శకుడు రాసుకున్నాడు. ఈ నాలుగు కథలను లింక్ చేస్తూ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియెన్స్‌లో గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్...
నాలుగు డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లలో నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు మిథిలేష్ రూపంతర మూవీని తెరకెక్కించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.5 రేటింగ్‌ను సొంతం చేసుకున్నాడు.ఈ ఏడాది కన్నడంలో హయ్యెస్ట్ ఐఎమ్‌డీబీ రేటింగ్ దక్కించుకున్న మూవీగా నిలిచింది. రూపాంతరలో హీరోగా నటిస్తూనే ఈ మూవీకి డైలాగ్స్ అందించారు రాజ్ బీ శెట్టి.ప్రజెంటర్‌గా, స్క్రీన్‌ప్లేరైటర్‌గా ఈ మూవీకి కొనసాగాడు.
టర్భోలో విలన్…
కాగా ఈ ఏడాది రాజ్ బీ శెట్టి యాక్టర్‌గా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. మమ్ముట్టి టర్బో మూవీలో విలన్‌గా నటించాడు. ప్రస్తుతం మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తోన్నాడు.