Kannada OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన క‌న్న‌డ సూప‌ర్ హిట్ మూవీ - యాక్ష‌న్ సీక్వెన్స్‌లు నెక్స్ట్ లెవెల్‌-duniya vijay kannada latest action thriller movie bheema streaming now on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kannada Ott: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన క‌న్న‌డ సూప‌ర్ హిట్ మూవీ - యాక్ష‌న్ సీక్వెన్స్‌లు నెక్స్ట్ లెవెల్‌

Kannada OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన క‌న్న‌డ సూప‌ర్ హిట్ మూవీ - యాక్ష‌న్ సీక్వెన్స్‌లు నెక్స్ట్ లెవెల్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 06, 2024 01:25 PM IST

Kannada OTT: క‌న్నడ లేటేస్ట్ సూప‌ర్ హిట్ మూవీ భీమా థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చింది. దునియా విజ‌య్ హీరోగా న‌టించిన ఈ మూవీ శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీకి దునియా విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

కన్నడ ఓటీటీ
కన్నడ ఓటీటీ

Kannada OTT: దునియా విజ‌య్ హీరోగా న‌టించిన క‌న్న‌డ లేటెస్ట్ సూప‌ర్ హిట్ మూవీ భీమా థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి దునియా విజ‌య్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఎనిమిది కోట్ల బ‌డ్జెట్ - 25 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

ఎనిమిది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన భీమా మూవీ 25 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. తొలిరోజు 10 కోట్ల వ‌ర‌కు ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ఈ ఏడాది క‌న్న‌డంలో ఫ‌స్ట్ డే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా భీమా రికార్డ్ క్రియేట్ చేసింది.

అమెజాన్ ప్రైమ్‌...

భీమా మూవీ సెలైంట్‌గా శుక్ర‌వారం ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఆగ‌స్ట్ 9న థియేట‌ర్లలో ఈ మూవీ విడుద‌లైంది. నెల రోజుల కూడా కాక‌ముందే ఓటీటీలోకి రావ‌డం క‌న్న‌డ‌నాట ఆస‌క్తిక‌రంగా మారింది.

స‌ల‌గ త‌ర్వాత దునియా విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సెకండ్ మూవీ ఇది. విజ‌య్ కుమార్ పేరుతో ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భీమా మూవీలో విజ‌య్ మాస్ యాక్టింగ్‌, మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ ఫైట్ సీక్వెన్స్‌లు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయంటూ అభిమానులు పేర్కొన్నారు. క‌థ‌, డైలాగ్స్‌తో పాటు కొన్ని సీన్స్ విష‌యంలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. భీమా మూవీలో అశ్విని హీరోయిన్‌గా న‌టించింది. అచ్యుత్‌కుమార్‌, క‌ళ్యాణి రాజు, డ్రాగ‌న్ మంజు కీల‌క పాత్ర‌ల్లో న టించారు.

భీమా క‌థ ఇదే...

భీమా (దునియా విజ‌య్‌) ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌. త‌న జీవితంలో జ‌రిగిన ఓ విషాదం కార‌ణంగా క్రైమ్ వ‌ర‌ల్డ్‌కు దూర‌మ‌వుతాడు. మెకానిక్ షాప్ పెట్టుకొని సాధార‌ణ జీవితాన్ని గ‌డుపుతుంటాడు. కొన్ని కార‌ణాల వ‌ల్ల డ్ర‌గ్స్ మాఫియాపై భీమా పోరాటం చేయాల్సివ‌స్తుంది. బ్లాక్ డ్రాగ‌న్ మంజా అనే రౌడీని ఎదురించి భీమా ఎలాంటి పోరాటం చేశాడు? అనాథ అయిన అత‌డు గ్యాంగ్‌స్ట‌ర్‌గా ఎలా మారాడు? అత‌డి గ‌తం ఏమిటి? జైలులో ఉన్న స‌ల‌గ‌కు, భీమ‌కు ఉన్న సంబంధం ఏమిటి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. భీమా సినిమాకు చ‌ర‌ణ్ రాజ్ మ్యూజిక్ అందించాడు.

మూడేళ్లు గ్యాప్‌...

భీమా మూవీతో దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత క‌న్న‌డ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు దునియా విజ‌య్‌. బాల‌కృష్ణ హీరోగా గ‌త ఏడాది సంక్రాంతికి రిలీజైన వీర‌సింహారెడ్డి మూవీలో మెయిన్ విల‌న్‌గా దునియా విజ‌య్ న‌టించాడు. ప్ర‌తాప రెడ్డి పాత్ర‌లో త‌న విల‌నిజంతో అభిమానుల‌ను మెప్పించాడు.

దునియా విజ‌య్ సినిమాటిక్ యూనివ‌ర్స్ పేరుతో భీమాకు కొన‌సాగింపుగా మూడో పార్ట్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు దునియా విజ‌య్ అనౌన్స్‌చేశాడు. ఈ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో స‌లాగ ఫ‌స్ట్ మూవీగా రాగా...భీమా సెకండ్ మూవీగా తెర‌కెక్కింది.